యాడున్నడో…

10314600_637667592989813_7764800892807168432_n

 

 

 

 

 

 

యాడున్నడో కొడ్కు
ఈది బళ్ళ సదివిండు ఇదేశాలకు పోయిండు
నా కండ్లల పానాలు పెట్కొనున్నా వాడొస్తడని

సత్తు గిన్నెలల బువ్వ పెట్టిన  ఈయవ్వ యాదున్నదో లేదో
గంజితాపించినగాని గరీబుగా పెంచలే

కూలిజేసి కాలేజిల చేర్సినా
కువైట్లా ఉజ్జోగమన్నడు
గల్లీలల్ల గోలీలాడేటోడు డాలర్లులెక్కేస్తున్నడు

గుడ్సెల సల్ల తాగినోడు
నా కుతికల సుక్క పోస్తడో లేదో
అప్పుడపుడు పైసలైతే పంపిస్తడు
ఎప్పుడూ నన్ను సూడనికి రాలే

పదేండ్ల క్రితం వానయ్య పీనుగయ్యిండు
గియ్యలా నాకు తోడులేకపాయే
వాడునన్ను సూస్తడని
ఒక ముద్ద పెడ్తడనుకున్న నన్నిట్ల ఒదిలిపోయిండు

అయినా ఆశ సావలే
నేను మాత్రం దినం దినం సస్తున్న

 

-తిలక్ బొమ్మరాజు

Download PDF

3 Comments

  • Nisheedhi says:

    Every time I read u ‘am always amused by your word play . … But this time u out done u r self with sheer emotion . Kudos buddy . I must say u compete with u rself all the time n u win hearts . Autograph please:p

  • Sumanasri says:

    ఈ సత్యమ్ చాలామంది తల్లులకీ తెలీదు. అమాయకంగా మా అబ్బాయి వేరు మా అమ్మాయి వేరు అనుకుంటూ ఉన్నదే కాక
    అప్పులుచేసి దోచి పెడతారు అనౌసరంగ ఆశలు పెంచుకుంటారు. తప్పు పట్టటం లేదు కానీ కాలం మారుతోందని తెలుసుకోకపోవడం చదువుకుంటే మరింత గొప్పగా ఉద్దరిస్తారని పిల్లల కోసం జీవితాల్ని పణంగా పెట్టడం ఈ రోజుల్లో మూర్ఖత్వమే అవుతుంది. యితరుల అనుభవాలనుంచి నేర్చుకోకపోవడం కూడా ఈ నాటి లక్షణమే. జీవితసత్యాన్ని మంచి మాటల్లో కవిత్వంగా మలిచారు. అభినందనలు.

  • dasaraju ramarao says:

    పల్లెటూరి ప్రేమలు సామాన్య భాషల అద్భుతంగా వ్యక్తం చేసిండ్రు . అభినందనలు .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)