చీకటి

DRUSHYA DRUSHYAM 41

DRUSHYA DRUSHYAM 41

చీకటి
……………

‘చీకటి కరేల్మని కదులుతుంది’ అంటాడు తిలక్.
ఒంటరి ప్రపంచంలో, ఏకాంతంలో ఇది మెదులుతుంది, ఎందుకో!

+++

తెలియదు గానీ ఒకానొకసారి ఎందుకో మేలుకుంటుంది నిద్ర.
లేచి అటూ ఇటూ తిరుగుతుంటే ఒక శునకం ఆవళించుకుంటూ వెళుతుంది.
లేదా నీలి నీడల్ని కాల్చుకుంటుంది లోలోనే.

అర్థం కాదు. లోపలి కోర్కెలు అలా రెక్కలు చాపుకుని మృగంలా సంచరిస్తాయా? అంత తేలిగ్గా అర్థం కాదు.
లేక నీడ రూపం ధరించి అదట్లా నాలుగు కాళ్ల జంతువై మనిషే అలా సంచరిస్తాడా? తెలియదు.
కానైతే, ఒక్కోసారి మనిషి తనను తాను పశువులో చూసుకుంటూ ఉంటాడేమో!

ఒక రాత్రి. రెండింటికి…గేటు బయటకు చూస్తే ఇది.
అది నిదానంగా నడిచి వస్తుంటే లోపలికి…లోలోపలికి వెళ్లినట్లు వెళ్లి,
నా నుంచి మీ అందరికీ పంచి పెట్టేందుకా అన్నట్టు నాలోని సామాజికుడు మళ్లీ నిద్రలేచి కెమెరా చేతబట్టాడు.
తీసి, దీన్నిలా తీసి పెట్టాను ఒకసారి.

నాకైతే ఇదొక చిత్రం. ఆ రంగు, చ్ఛాయా…అంతా కూడా ‘కొర్కె’ అనిపిస్తుంది.
కామమూ అనిపిస్తుంది. బహుశా చిత్ర ప్రవృత్తిలో మానవీయ అనుభవంలో అమానుషంగా ‘ఇదీ’ ఒకటి దాగి ఉంటూనే ఉంటదేమో!

చూసినప్పుడల్లా బహుశా ఏదైనా ఒక అంతర్జాతీయ పోటీకి పంపదగ్గ ఫొటో ఏమో అని అనుకున్నాను… దీన్నొకసారి.
ఎందుకూ అంటే, దాచుకుని బతికే భారతంలో ఇది అదృశ్యం. దాటిపోతేగానీ ఈ దృశ్యానికి సరైన అర్థం కానరాదని కాబోలు.

+++

ఏమైనా, ఒక్కోసారి అదృశ్యమైన దేహరాగాలని దృశ్యమానం చేసే చిత్రాలూ మనలోనే పుడతాయి.
నిజం. అందులో ఇదొకటని నా భావన.

గమనిస్తారని, మన లోవెలుపలా దాగే కోటి దహనాల కాంతిని ఇముడ్చుకునే చిమ్మ చీకటి మన ముందే ఇట్లా సంచరిస్తుందని, దాన్నిఒడిసి పట్టుకునేందుకే ఈ చిత్రమని నమ్ముతారనే ఇది.
ఈ వారం. చీకటి కరేల్మని…

~ కందుకూరి రమేష్ బాబు

Download PDF

2 Comments

  • sujala says:

    ఫొటో ఎంత పొయెటిక్ గా ఉందో…ఈ సారి మీ వ్యాఖ్యానం అలాగే ఉంది..‘లోపలి కోర్కెలు అలా రెక్కలు చాపుకుని మృగంలా సంచరిస్తాయా?’..నిజమేనా…?…రాత్రి భయపెడుతుంది..కానీ మనల్ని మనకు ఎలాంటి అరమరికలు లేకుండా చూపిస్తుంది…మనలోని అసలు మనిషిని పట్టిస్తుంది..ఇది నా భావన…మీరన్నట్టు ఇది అంతర్జాతీయ పోటీకి పంపదగిన చిత్రమే…

  • bhasker koorapati says:

    మీ ఫోటో తో పాటు వ్యాఖ్యానం కూడా అద్భుతమైన ఫోటోలానే ఉంది.
    మీరు నిజంగా వర్సటైల్ జీనియస్.
    ఈ ఫోటో నిజంగానే అంతర్జాతీయ

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)