ఖాళీ అయిన కేరింతల మూటలు విప్పుకుంటూ బావురుమంటున్న ఇంటి ముందు లోకంలోని ఎదురుచూపునంతా కుప్పబోసి కూర్చుంటుందామె. పసుపు పచ్చని సీతాకోక చిలుక పంచప్రాణాలని మోసుకొచ్చే వేళయింది. పాలపుంతల నిడివి కొలిచొచ్చినంత గర్వంగా విచ్చుకున్న రెప్పల్లొంచి వ్యోమగామిలా దిగుతాడు వాడు. ఏళ్ళ ఎదురుచూపులు ఆత్మల ఆలింగనంలో చివరి ఘట్టాన్ని పూర్తిచేసుకుని పలకరింతల పులకరింతలు ఇచ్చిపుచ్చుకుంటాయి. ఊరేగిస్తున్న దేవుని పల్లకి భక్తుల భుజాలు మారినంత పవిత్రంగా పుస్తకాల సంచి భుజాలు మారుతుందప్పుడు. నాలుక రంగు చూడకుండానే ఏ ఐస్క్రీమ్ బార్ తిన్నాడో…