పదును వాక్యాల పరంపర

d1
“Poetry, above all, is a series of intense moments – its power is not in narrative. I’m not dealing with facts, I’m dealing with emotion.” అంటున్న Carol Ann Duffy గురించి ఈ సారి తెలుసుకుందామా ?

400 ఏళ్ళ స్కాటిష్ బ్రిటన్ పోయెట్రీ లో పురుషాధిపత్యం కి ఒక చరమాంకం పలికి 2009 లో మొదటిసారి ఒక స్త్రీ ఆస్థానకవి గా నియమింపబడటం అందునా ఒక ఓపెన్ డిక్లేర్డ్ గే ఆ స్థానంలో ఆస్థాన కవి గా రావటం నిజంగా రాణివాసపు రాజరికం నడిపే బ్రిటిష్ సాహిత్యంలో 8 వ వింతే. Poet laureate గా ప్రస్థానం మొదలు పెట్టిన తరువాత ఒకప్పుడు స్త్రీ లని కవియిత్రులు అని కూడా పిలిచేవారు అని కామెంట్ చేయడం తోనే కవిత్వం లో అప్పటికి ఇప్పటికి ఇంకా మిగిలి ఉన్న, భవిష్యత్తులో ఉండబోయే పురుషాధిపత్యం గురించి చెప్పకనే చెప్పారు అనిపిస్తుంది కదూ.

ఒక ఎకనామిస్ట్ సమీక్షకుడు వాటిని వివరించినట్లు ఆమె కవిత్వం , సాధారణంగా “ప్రపంచ వ్యతిరేకంగా ఉద్భవించిన ఆగ్రహాలు మరియు పగలు చూపటానికి సమాజం యొక్క అంచుల మీద పట్టణ సామ్రాజ్యవాదంతో అసంతృప్తితో ప్రజల మనోభావాలు మాట్లాడే విధంగానే ఉంటాయి . సహజంగా ప్రేమ కవితలు ఎక్కువ రాసుకున్న కారోల్ సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ లో చదువుతున్న రోజుల నుండి లెస్బియన్ అయినప్పటికీ ఆమె తొలి ప్రేమ కవితల్లో ఎక్కడ స్వలింగ సంపర్కం గురించిన భావనలు కనిపించవు .1994 లో తన సెలెక్తెడ్ పోయెమ్స్ ప్రచురించినప్పుడు కాని హోమో సెక్సుఅల్ ప్రేమల మీద తను రాసుకున్న భావాలు భయటపడలేదు.

కారోల్ కవిత్వం ఎప్పుడు ఒక బలమైన స్త్రీవాదాన్నే సూచించింది . ఆ విషయం తన మొదటి సంకలనం “Standing Female Nude” లోనే కనిపిస్తుంది . టైటిల్లోనే పురుషాధిక్య ప్రపంచం ముందు స్త్రీ వాదపు నగ్న ఆత్మని నిలబెట్టిన సింబాలిజం కనిపిస్తుంది అనిపించడం సహజం కదా మనకి .
“రోజుకో పావలా అర్ధణా కోసం ఎదో ఒక గొప్ప మ్యూజియంలో తగిలించబడి బూర్జువా సంతోషాలని నిలబెట్టడానికి నా వంటి రంగు కొంచం కొంచం తోడుతూ నా స్తనాగ్రాల మీద పడే కాంతి వెలుగులని చిత్రీకరిస్తూ వేశ్యా తనాన్ని అమ్ముకోవటమే ఆర్ట్ ” అని మొట్ట మొదటి కవిత మొదటి స్టాంజాలోనే ఆర్ట్ వరల్డ్ లో స్త్రీ స్థానం ఎక్కడుందో నొక్కి చెప్పగలిగిన ధైర్యం డఫ్ఫీ ది. అంతేనా రెండవ స్టాంజా చూడండి రాణులు ఏలే రాజ్యంలో పొట్ట కూటికోసం నగ్నంగా నిలబడ్డ మోడల్ అందచందాల్లో కొరత వచ్చింది అని బాధ పడే ఆర్టిస్ట్ ని చూసి ఆ మోడల్ నవ్వుకొనే నవ్వులో ఎన్ని అర్ధాలు ఉన్నాయో . మూడవ స్టాంజాకి వచ్చేసరికి శరీరం అమ్ముకుంటూ తాను ఆర్ట్ అమ్ముకుంటూ అతను అందరు ఒకే ఆటలో పావులని ఎంత సత్యంగా ఒప్పుకుంటుందో చూడండి .
d2
తన పదును వాక్యాల పరంపర లో ఇపుడు ఇక్కడ ఇచ్చింది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, ఇంకా చదువుకోవాల్సిన కవితలు ఎన్నో ఉన్నా అన్ని ఒకేసారి చదువుకోవటం కష్టం , అయినా ఆసక్తి ఉంటే మొత్తం చరిత్రలో అలాగే ఫిక్షన్ కథలలో ధీరోదత్తులు అంటూ ఇప్పటికి అందరం చదువుకొనే అన్ని మగ క్యారెక్టర్స్ మీద సెటైరికల్ గా రాసిన” The World’s Wife “ అస్సలు మిస్ అవ్వకండి. King Kong తో సహా Aesop, Pontius Pilate, Faust, Tiresius, Herod, Quasimodo, Lazarus, Sisyphus, Freud, Darwin దాక అందరి మీద వాళ్ళకి ప్రపంచం ఇచ్చే సూడో వాల్యూ మీద ఒక అద్భుతమయిన పోయెమ్స్ కలెక్షన్ అది. అదే కాకుండా ప్రేమ కవితలు రాసుకొనే స్త్రీ వాద రచయిత్రి యుద్ధం అవసరాలు అసహ్యాలు అని రాసుకున్న “ War photographer “ ఇక్కడే ఇమేజి గా ఇచ్చాము తప్పక చదవటానికి చూడండి ,

Standing Female Nude
by Carol Ann Duffy

Six hours like this for a few francs.
Belly nipple arse in the window light,
he drains the colour from me. Further to the right,
Madame. And do try to be still.
I shall be represented analytically and hung
in great museums. The bourgeoisie will coo
at such an image of a river-whore. They call it Art.

Maybe. He is concerned with volume, space.
I with the next meal. You’re getting thin,
Madame, this is not good. My breasts hang
slightly low, the studio is cold. In the tea-leaves
I can see the Queen of England gazing
on my shape. Magnificent, she murmurs,
moving on. It makes me laugh. His name

is Georges. They tell me he’s a genius.
There are times he does not concentrate
and stiffens for my warmth.
He possesses me on canvas as he dips the brush
repeatedly into the paint. Little man,
you’ve not the money for the arts I sell.
Both poor, we make our living how we can.
I ask him Why do you do this? Because
I have to. There’s no choice. Don’t talk.
My smile confuses him. These artists
take themselves too seriously. At night I fill myself
with wine and dance around the bars. When it’s finished
he shows me proudly, lights a cigarette. I say
Twelve francs and get my shawl. It does not look like me.

ఒకసారి కవిత్వం అంటే నిజాలు కాదు కుప్ప పోసుకున్న ఎమోషన్స్ అని చెప్తూనే ఇంకో సారి “ Like the sand and the oyster, it’s a creative irritant. In each poem, I’m trying to reveal a truth, so it can’t have a fictional beginning.” అంటూ కవిత్వం కల్పన కూడా కాకూడదు అని చెప్తున్న మన కాలపు కవయిత్రి కి అభినందనలతో

Download PDF

4 Comments

 • వాసుదేవ్ says:

  కవిత్వాన్ని పున: నిర్వచించి కవిత్వమంటే “కుప్ప పోసుకున్న ఎమోషన్స్” అనే ఓ అసలు సిసలు స్త్రీ వాదిని మీదైన శైలిలో పరిచయం చేసిన మీ ఎఫోర్ట్స్ ని అభినందిచక తప్పదు. నిజమే..చదవటం నేర్చుకున్నాక ఇలాంటి కవితలని అసలు మిస్ కాకుడదు. జీవితానికి ఓ అర్ధమిచ్చే ఇలాంటి రచనలు ఉన్నాయన్న సత్యాన్ని మీరు ప్రపంచానికివ్వటం అభినందనీయం. అభినందనలు నిశీజీ

 • నిశీధి says:

  థాంక్స్ వాసుదేవ్ గారు . నిజంగానే చదవటం అంటూ మొదలు పెట్టాక అసలు ఇలాంటివి మిస్ అవ్వకూడదు

 • కెక్యూబ్ వర్మ says:

  ఏదో రాసేస్తున్నాం కవిత్వం అని అనుకునే నాలాంటి వారికి ఇలాంటి కవులను వారి కవిత్వంలోని లోతును నిర్భీతిని నిర్మొహమాటాన్ని పరిచయం చేస్తూ చెంప ఛెళ్ళుమనిపించే మీరు అభినందనీయులు నిషీజీ..

 • తిలక్ says:

  ఓ మంచి కవయిత్రిని పరిచయం చేసినందుకు మీకు అభినందనలు నిశీధి గారు,ఎప్పుడూ ఇలానే ఎంతో కొత్తదనాన్ని రాసేసి వెళ్ళిపోతారు,తరువాత మళ్ళా ఏం రాస్తారా అని ఎదురు చూడడం నా వంతవుతుంది మిమ్మల్ని చదివిన ప్రతి క్షణం,ఎంత నచ్చిందో ఈ “పదును వాక్యాల పరంపర”,నా గదిలో ఇంకొన్ని పుస్తకాలు సర్దుకోవాలి ఇలా మీరు పరిచయం చేసే కవిత్వాన్ని పేర్చుకుంటూ.థాంక్స్ అలాట్ నిశీధి గారు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)