that’s way..!

జీవితమంతా యాదృచ్ఛికమే అవుతుంది
ఉదయాన్నే రాలిన మంచుబిందువులు
ఆ బిందువులను అద్దుకొని మురిసిన పసిగడ్డిపోచలు
ఆ గడ్డిపోచలపై వాలిన తొలిపొద్దు కిరణాలు
ఆ కిరణాలు హత్తుకొని నడిచిన కొన్ని పాదముద్రలు
జీవితం ఎంతోకొంత నిర్ణయాలలో నలుగుతుంది
మిట్టమధ్యాహ్నం నడిరాతిరి గాఢపొద్దులా
మనల్ని కప్పుకుంటుంది
అనేక ఉత్సవాలు లోలోపల నింపుకొని
ఇద్దరం ఒక్కటైన అలౌకికతత్వంలో ఉక్కిరిబిక్కిరవుతుంటాం
రణగొణ ధ్వనుల్లో మధ్యాహ్నం
మనుషుల మధ్య నడిచిపోతుంది
లోపలంతా గుడగుడ శబ్దం
పావురాయి రెక్కలు మరింత పరిచి
రగ్గులో మరింతగా ముదురుకుంటాం
జీవితమన్నాక ఎంతోకొంత స్వీయ అస్తిత్వముంటుంది
సాయంత్రం మనుషుల ఆత్మాభిమానుల్లో
మనుగదీసుకొని మేల్కొంటుంది
అందరూ తేలికపడి తెప్పరిల్లుతున్న వేళ
సూర్యుడు విరమించి రాత్రి దీక్ష పూనుతుండగా
ఆలోచనల రద్దీ మనమధ్య ఉరుకలెత్తుతుంది
స్ట్రీట్ లైట్ వెలుగుల్లా మన కండ్లు వెలుగుతుంటాయ్
బ్రేకుల్లేని వాహనాల్లా మన ఆలోచనలు
సిగ్నల్ దాటి ఉరుకుతుంటాయ్
ఎత్తిపోసుకుంటాం దేహంలోని శక్తినంతా
కూడదీసుకొని మనల్ని మనం  యథాతథంగా అక్షరాల్లోకి
ఆ తర్వాతంతా శూన్యం
గ్రహాంతర వాసుల్లాగా మనల్ని మనం వెతుక్కుంటాం
నవ్వుతూ చేరవచ్చే నక్షత్రం వద్ద సాంత్వన పడుతాం
ఆ సాంత్వన కూడా లేనివేళ
ఏ నిర్వచనం ఇవ్వలేని వేళ
గతితప్పిన గ్రహాంతర శకలంలా పేలిపోతాం
కృష్ణబిలంలో పడి కనుమరుగవుతాం
సూపర్ నోవా విస్ఫోటంలో మనమొక శిథిల రేణువై
విశ్వం ఆవలకు విసిరేయబడుతాం.
                                           – శ్రీకాంత్ కాంటేకర్srikanth kantekar
Download PDF

8 Comments

  • narayana sarma says:

    బాగుంది శ్రీకాంత్ గారూ.మంచి కవిత.బలమైన వాక్యాలున్నాయి.. సూర్యుడు విరమించి రాత్రి దీక్ష పూనుతుండగా/గాఢపొద్దులా-/మనమొక శిథిల రేణువై
    విశ్వం ఆవలకు విసిరేయబడుతాం/లాంటి ప్రయోగాలలో అర్థ దృష్టి సన్నగిల్లిందనిపిస్తుంది…(గాఢమైన పొద్దు/సూర్యుడు విరమించుకుని/శిథిల రేణువులమై…అని ఉండాలనుకుంటాను..)

    • nmraobandi says:

      సూర్యుడు విరమించి …
      సూర్యుడు విశ్రమించి – అనేమోనని
      నా అభిప్రాయం …

      … యథాతథంగా అక్షరాల్లోకి
      ఆ తర్వాతంతా శూన్యం …

      బాగుంది …
      అభినందనలు.

    • srikanth kantekar says:

      narayana sarma: nmraobandi: Thank you very much sir.. mi salahalanu tappakunda swikaristanu. Dhanyavaadalu..

  • ns murty says:

    బాగుంది శ్రీకాంత్ కాంటేకర్ గారూ. కవిత చిక్కగా ఉంది. అభినందనలు.

  • నిశీధి says:

    చాల మంచి కవిత అందించారు శ్రీకాంత్ గారు కుడోస్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)