మధ్యలో సన్నటి గీత ఒకటి మెరుస్తూనే ఉంటుంది
చూసీ చూడనట్టు దాటే ప్రయత్నం చేసి
బుద్ధి ఓడిపోతుంటుంది
పగులూ రాత్రీ , ఒకే మెలకువతో
అర్ధాంతరంగా ఆగిపోయిన
ఒక్క నీ పాట కోసం కాచుకుంటుంది
రాత్రంతా నీ గదిలో వెలిగే దీపం చూసి ,
తెల్లవారినప్పుడు, ఆకాశం వంటి కాగితం మీద
నీ కవిత్వం ఉదయించాలని కలలు కంటుంది
లెక్కలేనన్ని జ్ఞాపకాలు రాలిపడినప్పుడు
నలిగిపోయిన ఓ పసి కుసుమాన్ని,
దోసిట్లో దుఃఖాన్ని దాచుకున్నపుడు
వేళ్ళ సందుల్లోనుంచి జారి పడిన ఓ కన్నీటి చుక్కనీ ,
నీవు దాటుతూ వెళ్ళే తన గోడ మీద అంటిస్తుంది
నీవు మాత్రం తెలుసుకోగల అర్ధాలతో వర్ణిస్తుంది
ఎంతకీ వీడని నీ నిశ్శబ్దంలో నుంచి
తనలోకి తను వెళ్ళి సేదతీరడం నేర్చుకుంటుంది
గాఢమైన చీకటిలో నిగూఢమైన శాంతిని హత్తుకుంటుంది
నిన్ను నెమరవేసుకుంటూ
తానో తపోవనంగా మిగిలిపోతుంది !!
- రేఖా జ్యోతి
నిన్ను నేమరవేసుకుంటూ తనో తపోవనం లా మారి పోతుంది !
బ్యూటిఫుల్!!
థాంక్ యూ Deepa గారు , ఓ దిగులులోకి జారి పోకుండా నిశ్శబ్దంగా నెమరవేసుకోవడం అందమే కదా !
ఆకాశం వంటి కాగితం మీద
నీ కవిత్వం ఉదయించాలని కలలు కంటుంది…………..మంచి భావం
థాంక్ యూ భవానీ గారు !
చాలా అద్భుతం గా ఉందమ్మా నీ కవితలకు నీ భావ సౌన్దర్యమ్ మెరుగులు దిద్దిన్దమ్మ
ధన్యవాదాలు సర్ !
మీ కవిత చాలా బావుంది రేఖా జ్యోతి గారూ.
నీవు మాత్రం తెలుసుకోగల అర్ధాలతో వర్ణిస్తుంది
కృతజ్ఞతలు ప్రసూన గారూ !
నీవు దాటుతూ వెళ్ళే తన గోడ మీద అంటిస్తుంది
నీవు మాత్రం తెలుసుకోగల అర్ధాలతో వర్ణిస్తుంది
chaala bagundammaa…mee kavitha…
Thank u సర్, మీరు చదవడం నిజంగా సంతోషం.
Entakii viidani nii nissabdam lonchi tanaloki tanu velli sedadiratam nerchukuntundi….. aa nerpu amulyam , mii maatallage rekha…
విలువైన కాలాన్ని కుమ్మరించి , అమూల్యమైన నేర్పుని శ్రద్ధగా నేర్పిన మీకు మరోసారి నమస్సులు ! Thank u Mam
“ఆర్తిగా ఉదయించే ప్రతీ క్షణానికి అటువైపు,
చేయి విదిలించుకుంటూ నీ నిరాశ
పట్టు బిగిస్తూ ఇటువైపు మరో ఆశ
మధ్యలో సన్నటి గీత ఒకటి మెరుస్తూనే ఉంటుంది
చూసీ చూడనట్టు దాటే ప్రయత్నం చేసి
బుద్ధి ఓడిపోతుంటుంది…”
“నిన్ను నెమరవేసుకుంటూ
తానో తపోవనంగా మిగిలిపోతుంది !! ”
nice poem …
compliments madam …
Thanks a Lot Sir !
waah…wat a pleasant poem
Thank u Sir !
చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి ఎంపిక చేసినందుకు ‘ సారంగ ‘ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు . _/\_
అయిష్టంగా చెప్పిన వీడ్కోలు ; వేరు ఐన తర్వాత కూడా వీడని జ్ఞాపకాలు; ప్రేమ భావన మీద ఇన్ని వేల కవితలు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొత్త కొత్త వ్యక్తీకరణలు వస్తున్నాయన్నది అస్చర్యమూ అనన్దమూ…