1
మొక్కలకి నీళ్ళు పోశాను
కుక్కపిల్లకు అన్నం పెట్టాను
పిట్టలకు నీళ్ళు పోసుంచాను
తల పగిలి పోతోంది; మళ్ళీ పడుకుంటాను
గంట తర్వాత లేపుతావా?
తలకి యెర్రటి స్కార్ఫ్ కట్టుకుని
అమృతాంజనం వాసనతో
బందిపోటురాణి అవతారంలో అడిగింది భార్య.
2
నా కూనలు నీళ్ళు అడుగుతున్నాయి
దాహంతో అల్లల్లాడుతున్నాయి
నిద్దట్లో గొణుక్కుంటున్నట్టుగా అందామె
నిద్దట్లోనే నడుస్తూ వెళ్ళింది
పిట్టగోడ దగ్గరికి
చూద్దును కద
పిట్టగోడ మీద మట్టి పాత్ర
సగం నీళ్ళూ సగం గాలి
నీటిపై అనంతాకాసపు నీడ
చుట్టూ రంగురంగుల రెక్కలు కట్టుకు
వచ్చి వాలిన పిట్టలు
దాహార్తిని తీర్చుకుంటూ…..
మురిపెంగా చూస్తూనే వున్నా
పంచ భూతాల చిత్రాన్నీ
నింగీ-నేల యేకం చెసిన చిత్రకారిణినీ….
- పరేశ్ ఎన్ దోశి
(painting: Rafi Haque)
” నింగీ-నేల ఏకం చేసిన చిత్రకారిణినీ ” ఎంత మంచి అభినందన సర్ !
బావుంది సర్.
వ్యక్తీకరణ నచ్చింది. కవితను రెండు భాగాలుగా చేయడం కూడా.
బాగుంది
థాంక్యు ఆల్
పరేష్ గారు –
మంచి కవిగా మీ పేరు నాకు జ్ఞాపకం …
చాలా కాలం తర్వాత ఇట్లా మీ కవిత చూడడం …
చాలా బాగుంది –
రాస్తూ వుండండి !
మీ అభిమానానికి సంతోషం…
స్త్రీ గొప్ప తనం చాలా సింపుల్ గా వివరించారు. It really touched me
Thanq for sharing
లిటిల్ అక్త్స్ అఫ్ kindness అన్నది నాకు చాల పెద్ద విషయము అనిపిస్తుందండీ. థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ .
నాకు భలేగా నచ్చింది మీ కవిత. ఒక భావన అలా వీచికల హృదయాన్ని తాకి వెళ్లినట్టు గాక ఒక వర్షమై కురిసినట్టు. ఇంకా ఆ ఇమేజరీ గురించే ఆలోచిస్తున్నా