దృశ్యాదృశ్యం

చీకటి

చీకటి …………… ‘చీకటి కరేల్మని కదులుతుంది’ అంటాడు తిలక్. ఒంటరి ప్రపంచంలో, ఏకాంతంలో ఇది మెదులుతుంది, ఎందుకో! +++ తెలియదు గానీ ఒకానొకసారి ఎందుకో మేలుకుంటుంది నిద్ర. లేచి అటూ ఇటూ తిరుగుతుంటే…

Read More
అలసిన వేళల చూడాలీ…

అలసిన వేళల చూడాలీ…

నీడ గురించి మాట్లాడుకుంటాం ఫొటోగ్రఫీలో. వెలుగుతో పాటు నీడ గురించి ఎంతైనా చర్చించుకుంటాం. సరికొత్తగా అర్థం చేసుకునే ప్రయత్నమూ చేస్తాం. కానీ, మనల్ని వెంటాడేది నీడ మాత్రమేనా? కాదు. విశ్రాంతి కూడా. నిజం….

Read More

Between the Lines

చాలాసార్లు దూరతీరాలకేసి చూస్తం. కానీ, దగ్గరే మన కోరికలు తీర్చేవి ఉంటై.చూపుకు మామూలుగా అందవు. తేలికగా కనపడవు. కొద్దిగా శ్రమించాలి. ఒక్కోసారి ‘చంకలో బిడ్డలాగా’ మరపు వల్ల ఉన్నదాన్ని ఉన్నచోటే వెతుక్కోవలసే వస్తుంది.కానీ…

Read More

లైఫ్- స్టడీ

reality art. అప్రమత్తత సంసిద్ధత చప్పున ఒకటి కనిపిస్తుంది. చిత్రీకరించకపో్తే అ స్థితి జారిపోతుంది. ఈ గ్లాసులే తీసుకుంటే. అవి ఉన్నవి. క్షణంలో తీసుకెళతారు. వాటిని మళ్లీ అమర్చి చిత్రీకరిస్తే అది చిత్రలేఖనం….

Read More

మ్యాచీస్

పంచుకునే క్షణాలు.అవి మామూలు క్షణాలే కావచ్చును. అత్యంత సర్వసామాన్యమైన క్షణాలే కావచ్చును. కానీ, విలువైన సమయాలు. ఏదైనా ‘పంచుకునే’ ఆ కొన్నిఘడియలు అపూర్వమైనవి. క్షణకాలమే కావచ్చు. కానీ, అవి బతికిన క్షణాలు. తర్వాత…

Read More
ఒక పరి ఆనందమూ, ఇంకొక పరి విషాదమూ…

ఒక పరి ఆనందమూ, ఇంకొక పరి విషాదమూ…

ఎందుకో తెలియదు, తీసినప్పుడు. ఏ విచిత్రమూ గోచరించదు, చూసినప్పుడు. కానీ, లోపల ఆనందం ఉన్నట్టే విషాదం ఉంటుంది. ఒలుకుతుంది ఒక్క పరి, మరొక స్థితి కలవరపెడితే, ఇంకొక గతి తన్మయం చేస్తే. కళ్లు…

Read More

తిలకము దిద్దరుగా…!

ఛాయా చిత్రలేఖనంలో వస్తువు ‘జీవితం’ అయినప్పుడు అది ఫొటోగానే మిగిలిపోదు. అనుబంధం అవుతుందని తెలిసిన కొద్దీ ఆశ్చర్యం, ఆనందం. గొప్ప విశ్వాసం.మానవ సంబంధాలను మనుషులు ఎంత బాధ్యతాయుతంగా మలుస్తారో తెలిసిన కొద్దీ ఒక…

Read More

చిన్న గది…మనసు ఆకాశం!

చిన్న చిన్నవే. గూడు కట్టుకున్న పదాలే. కానీ, గొప్ప అర్థాలు. ‘ఖాన’ అంటే ఇల్లు. ‘ఖబూతర్’ అంటే పావురం. ‘కబూతర్ ఖాన’ అంటే భాగ్యనగరం. అవును మరి. పావురాల కోసం ఇండ్లను నిర్మించిన…

Read More

బతుకమ్మ పాట

నగరం అన్నది అలిశెట్టి ప్రభాకరుడికి ఒక రకం. చార్లెస్ డికెన్స్ కు మరో రకం.అది ఎవరైనా, వారికి ఏమైనా బతుకు మాత్రం సాహిత్యం, అది నగరమైనప్పటకినూ.నా వరకు నాకు హైదరాబాదు ఒక బతుకమ్మ….

Read More

సురసురమని వెలుగు…

బతుకు చిత్రాలు బహుకొద్ది దొరుకుతాయి. చాలాసార్లు వెలుతురులో. కానీ అరుదుగా చీకటిలో దొరుకుతాయి, వెలుతురు బతుకులు.అవును. వెలుగు నీడల మధ్య కొన్ని జీవితాలు. గాలిలో పెట్టిన దీపంలా కాదు, దీపం చుట్టూ గాలి…

Read More

కనువిప్పు

చాలా కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. ఫొటో తీయాలంటేనే కాదు, చూడాలంటేనూ. కానీ, వాస్తవం ఏమిటంటే, చూడగా చూడగా తెలుస్తుంది, కష్టమేమీ లేదని!నిజం. ఈ తల్లి మాదిరి, ఇలా ఒక కన్నో ఒక కాలో…

Read More

భారతరత్న

అత్యంత సామాన్యమైన చిత్రాల్లో ఇదొకటి. ఒక గుమస్తా దేశరాజధాని అయిన ఢిల్లీలో ఉదయాన్నే తన కార్యాలయానికి బయలుదేరుతున్నప్పుడు తీసిన ఫొటో. ఇందులో ఏమీ లేదు. నిజమే. కానీ, ఇది పబ్లిక్ పరేడ్లో ప్రదర్శనకు…

Read More

చిత్రాంగి

మన దిష్టి తగులుతుందిగానీ చూడగలిగితే ఎన్ని అందాలో… అస్పష్టంగానూ, నిగూఢంగానూ ఉండే అనురాగాలూ హృద్యమైన వ్యక్తీకరణలలూ కనుల ముందు దృశ్యబద్ధమైతే మానవులు ఎంత హాయిగా ఉంటున్నారో తెలిసి రాదు!నిజానికి మనుషులు ఏకాంతంలో లేదా…

Read More

The God of Small Things

చూడటానికీ, దర్శించడానికీ ఉన్న తేడా గురించి చాలా చర్చ చేయవచ్చు. కానీ, చూడండి. ఇప్పుడు ఇక్కడే ఆ ఎములాడ రాజన్న సన్నిధిలో ఉన్న ఈ తల్లిని చూడండి. అది నిజంగా దర్శనమే.నిజం. మనుషులను…

Read More

ప్రార్థించే కళ్లు!

ప్రశాంతి ….బహుశా ప్రార్థనా సమయం విద్యార్థిగా ఉన్నప్పుడే ఉంటుందా? ఏమో!కానీ, నిత్య విద్యార్థిగా భుజానికి కెమెరా వేసుకుని, ఉదయాన్నే వాడకట్టులన్నీ తిరుగుతూ ఉంటే, పరిసర ప్రపంచంలోని మనుషులు ఒక్కరొక్కరుగా తెరిచిన పుస్తకమై హత్తుకుంటుంటే,…

Read More

రఘురాయ్ చిత్రం

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం, ఢిల్లీ. సుప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘురాయ్ ఫొటోగ్రఫీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.ఆయన సంతోషంగా ఉన్నారు. తన ముందు ఉత్సుకతతో నిలబడ్డ పిల్లలందరినీ ఒకమారు చూసుకుని చిరునవ్వుతో ప్రసంగం ప్రారంభించటానికి…

Read More

‘ఈగ’ చెప్పే కథనం

  ఏదీ ముందుగా తెలియదు. అదే చిత్రం. అవును మరి. మనుషులను చిత్రీకరిస్తున్నప్పుడు మొదట్లో తెలియలేదు గానీ, వారిపై వాలిన ఈగలు నిదానంగా కనిపించడం మొదలైంది. చిత్రానికి సంబంధించిన సిసలైన వాస్తవికతను అవే…

Read More

కనుగొంటి కనుగొంటి…

తీసిన కన్నే అయినా కొన్ని చిత్రాలు జరూరుగా మళ్లీ కళ్లల్లో పడి కలవరపెడతాయి. గుండెను కలుక్కుమనిపిస్తాయి. ‘మో’ అన్నట్టి “బతికిన క్షణాల’ను యాతనకు గురి చేస్తూ ఉంటాయి. ‘అజంతా’లా ఒకే కవితను పదే…

Read More

కలవక కలవక కలిసినప్పుడు నిజమైన ముఖాముఖి…

అవును. మీకు తెలుసు. ‘ముఖాముఖి’. ఇది పాత్రికేయంలోని ఒకానొక అంశం. అది ఇద్దర్ని చూపిస్తుంది. కానీ, ఒకరు ఒకర్ని ప్రశ్నించి అవతలి వ్యక్తిని ఆవిష్కరించే అంశంగానే ధ్రువ పడింది. కానీ, మనిషి ఒక…

Read More

కళారవికి అభివాదం

ఒక సామాన్యమైన విషయాన్ని పంచుకున్నట్టే పంచుకున్నాడు గానీ ఆ మనిషి ఓ అసామాన్యమైన విషయాన్నే బోధించాడు. మరేం లేదు. “మానవుడు అన్నవాడు ఒక గంటలో కనీసం ఐదు నిమిషాలైనా ఆనందంగా గడపాలి’ అని…

Read More

బుగ్గ – శుభాకాంక్ష

క్రమక్రమంగా జీవితపు రహస్యాలు అవగతం అవుతున్నప్పుడు ఎంత సంతృప్తి కలుగుతుంది, ఏ వయసు వాళ్లకైనా!ఇదీ అదీ అని అనుకోవాల్సిన అవసరం లేదు. అది కేవలం ఒట్టి బుగ్గ ఊదుతున్న బొమ్మే కావచ్చు, కానీ,…

Read More

బాటసారులు ఒక తరగతి….!

ఎప్పుడు చూసినా ఈ చిత్రం ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. ఎందుకూ అంటే, చూపు నేర్పే పాఠాలు ఎన్నో అని! అవును.  కళ్లున్నంత మాత్రాన చూపున్నట్టు కాదు కదా! చూపును ఎప్పుడూ విస్తరించుకోవచ్చును,…

Read More

ఆదిమ రంగుల సంబురం!

ఎవరైనా ఎన్నో ఫొటోలు తీస్తూ ఉంటారు. తీస్తూ ఉండగా లేదా తీశాక అందులో గొప్ప ఫొటో ఏదో తెలుస్తూ ఉండవచ్చు. లేదూ తీరుబాటుగా ఉన్నప్పుడు ఏది ఉత్తమ చిత్రమో గుర్తు రానూ వచ్చు….

Read More

దిసమొల: నిశ్శబ్ధంగా వినిపించే ఒక సంకీర్ణ దృశ్యం!

ఫొటోగ్రఫీకి సంబంధించి ఏది ముఖ్యం, ఏది కాదు – అన్న చర్చ కాదుగానీ, నా వరకు నాకు దృశ్యం, అదృశ్యం రెండూ ముఖ్యమే అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ చిత్రం…నిజం. అర్థవంతమైన లేదా అవతలి…

Read More

“అది కాలిబాట కాదు, నా ఇల్లు!”

కాలి బాట మీది జీవితం గురించి నాకెప్పట్నుంచో ఒక జీవగ్రంథం వెలువరించాలని ఉంది. ఎప్పట్నుంచీ అంటే ఐదేళ్ల క్రితం కుమారిని కలిసినప్పటినుంచి…ఆమెకు చేతులు లేవు. కానీ, కాళ్లతోనే ముంగురులు సర్దుకుంటుంది. తల దువ్వుకుంటుంది….

Read More

సంక్రాంతి, స్త్రీలూ, ముగ్గులూ…!

చాలామంది అడుగుతున్నారు. ముగ్గుల బొమ్మలు అన్నప్పుడు అందరూ అదే అడుగుతున్నారు… ఎన్ని రకాల ముగ్గులు చిత్రించావూ అని!చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, రంగవల్లులు… ఈ మూడు రకాల ముగ్గులూ ఉంటాయి గనుక, ఒక్కొక్క…

Read More

ఏకాంత లు ….. ఒక ఏకాంతం !

పురుషులకు కావాల్సినన్ని స్థలాలున్నాయి. బయటి ప్రపంచం అంతా వారిదే. ఇంట్లో కొచ్చినా వారి ప్రపంచమే. ఎంతైనా, మగవాళ్లకు అన్ని స్థలాలూ, అన్ని కాలాలూ యోగ్యమైనవే. ఎక్కడ ఫొటో దిగినా అది వారి సామ్రాజ్యమే….

Read More

పాదం మీది పుట్టుమచ్చ!

డావిన్సీ చిత్రించిన మోనాలిసా చిరునవ్వు గురించి చాలా చర్చ జరిగింది. ఇంకా జరుగుతుంది కూడా. కానీ, దైనందిన జీవితంలో చిరునవ్వులతో జీవించే సాదాసీదా మనుషుల గురించి అంత చర్చ జరగదు. జరగాలనీ లేదు….

Read More

మూగవాడి పిల్లనగ్రోవి

అజంతా గుర్తొస్తాడు చాలాసార్లు. చెట్లు కూలుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు. కూలకుండా చెట్టు అలా నడుస్తూ వెళుతున్నప్పుడు కూడా. +++ ఇతడు కూడా అలాంటివాడే. రిక్షా లాగి పొట్టపోసుకుంటాడు. నిజానికి “రిక్షా తొక్కి’ అని…

Read More