Facebook Icon
DivideLine
About Us

Welcome to Saaranga.

Saaranga Books was started to make a difference in the publishing of the Telugu literature. We are indeed expanding our focus into other languages, but our key focus remains on the Telugu literature.

“No one reads Telugu books these days.” We hear these words quite often these days. We know it to be true to a certain degree. But we believe it is not because a Telugu reader does not appreciate Telugu literature and its sensibilities, but because an average Telugu book suffers from poor quality and poor selection of substance. And more importantly, the Telugu literature suffers from a lack of opportunities for good Telugu writers to have their books published.

Saaranga Books will strive to change that. We will focus on publishing books that stand out in various ways such as:

Language

Emphasize a free, easy-to-read, informal Telugu language without compromising the innate literary strengths and the beauty of the Telugu language.

Literature

Emphasize high quality works that are based on individual stories, that have to do with the lives of real Telugu people, rather than the populist and popular intellectual ideas and opinions on the Telugu culture.

Politics and Society

Avoid becoming a glorified pamphlet, so often a trap that the books with a political or social change message fall into. With Saaranga our emphasis is in literature that first informs people’s emotions, making them richer and inspiring them to experience the life around them fully.

Book Packaging

To a significant extent, a modern young reader is more influenced by the external book package: the design, the look and feel of the book. Readers with this sense of taste are essential to Saaranga. With Saaranga we want to appeal to the modern reader who enjoys reading popular books, but is also drawn towards Saaranga books because of their intimacy with the contemporary modern Telugu life.

ఒక్క మాట లో చెప్పాలంటే ఉత్తమ సాహిత్యానికి కేంద్ర బిందువుగా ఉండాలన్న సదాశయంతో నెలకొల్పిన ప్రచురణ సంస్థ సారంగ బుక్స్.

Raj Karamchedu is the Publisher and General Editor of Saaranga.

ఏ నాడో అమెరికాలో స్థిరపడి, తెలుగు భాషకీ, సాహిత్యానికి భౌతికంగా దూరంగా వున్నా, తెలుగు భాష అన్నా, సాహిత్యం అన్నా బాగా ఇష్టపడే రాజ్ కారంచేడు ఇంగ్లీషులో కవిత్వం రాస్తారు. మంచి తెలుగు సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న సత్సంకల్పంతో సారంగ బుక్స్ కి నాంది పలికారు. వృత్తి రీత్యా వ్యాపార రంగం, ప్రవృత్తి రీత్యా సాహిత్య రంగం. నిత్య చదువరి. ఇంగ్లీషు పాఠకులకి తెలుగు కవిత్వాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో గతంలో ఇంగ్లీషులో ఒక బ్లాగు నిర్వహించారు. శివారెడ్డి, ఇస్మాయిల్ నించి అఫ్సర్ దాకా అనేక మంది కవితలని ఇంగ్లీషులోకి అనువదించారు. Email: raj@saarangabooks.com ద్వారా ఆయనను సంప్రదించవచ్చు.

Kalpana Rentala is the Editor of Saaranga.

కవయిత్రి. తెలుగులో పత్రికా రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. జర్నలిస్టుగా వివిధ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. ఆంధ్రాలో వుండగా ఆకాశవాణి, టీవీలలో కూడా పని చేశారు. కరుణశ్రీ, తెన్నేటి హేమలత లాంటి ప్రసిద్ధ రచయితలతో ఇంటర్యూలు చేశారు. 2002లో “నేను కనిపించే పదం” కవితా సంపుటికి అజంతా పురస్కారం అందుకున్నారు. ఆమె కవితలు ఇండియన్ లిటరేచర్ లాంటి పత్రికలలో ఇంగ్లీషు పాఠకులకు కూడా పరిచయం అయ్యాయి. కథారచనలో కూడా పేరు తెచ్చుకున్నారు. స్త్రీల సాహిత్యం గురించి ఇటీవలి కాలంలో విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తున్నారు. ముఖ్యంగా కథా సాహిత్యం మీద కథానుభవం అనే శీర్షికన తన బ్లాగు “తూర్పు-పడమర”లో వరసగా కొన్ని మంచి కథల్ని విశ్లేషణాత్మకంగా పరిచయం చేశారు. ఆమె తన బ్లాగ్ లో రాసిన “తన్హాయి” నవల విశేష ప్రజాదరణ పొందింది. Email: kalpana@saarangabooks.com ద్వారా సంప్రదించవచ్చు.

Afsar is the Editor of Saaranga.

కవి, విమర్శకులు, అధ్యాపకులు. 1980లో రచనా వ్యాసంగం ప్రారంభించారు, “రక్తస్పర్శ” తో సహా నాలుగు కవిత్వసంపుటాలు, రెండు సాహిత్య విమర్శ గ్రంధాలు రాశారు. “ఇవాళ” సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, “వలస”కి జాతీయ స్థాయి భాషా సరస్వతి సమ్మాన్ అందుకున్నారు. “ఆధుని కత- అత్యాధునికత” ద్వారా పోస్టు మాడర్నిజమ్ చర్చకి తీర తీశారు, “కథ-స్థానికత” విమర్శ వ్యాసాలతో స్థానిక సాహిత్యాలకు ఒక తాత్విక బలాన్ని ఇచ్చారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో సాహిత్య వేదిక ద్వారా సాహిత్య జర్నలిజానికి పునాది వేశారు. కొద్ది కాలం అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో బోధనా, పరిశోధనా చేసి, ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మకమయిన టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఆసియా సాహిత్యం, భాషా విభాగంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. పరిశోధనా రంగంలో కృషికి 2006లో ఆయనని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫెల్లో గా ప్రకటించింది. తెలంగాణ, రాయలసీమ పల్లెల హిందూ-ముస్లిం సాంస్కృతిక అంశాల మీద ఆయన పరిశోధనకి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచీకరణకి సమాధానం స్థానికతలో వుందని, స్థానిక సాహిత్య సాంస్కృతిక రూపాలే విశ్వజనీనమన్నది ఆయన వాదన. “అక్షరం” అనే పేరుతో బ్లాగ్ కూడా నడుపుతున్నారు.

©2010-2014 Saaranga Books. All Rights Reserved.