ఉత్తరం చేతివేళ్ళమధ్యలో
మెత్తని అడుగులతో ఊపిరివేడిని మొసుకొచ్చి విప్పి చూడమని అడుగుతోంది
అలసిపో్యిన కనుల నలుపుచారలు దాటిన బిందువులు
అక్షరాలని తడిచేసి చెదురుమదురు చేసాయి
ఆశ్రమ పాకలో చీకటినిర్మించుకున్నప్పుడు
సవ్వడిలేని నిద్ర ధ్యాననిమగ్నతలో ఒరిగిపోయినప్పుడు
చీకటితో రాజీ కుదుర్చుకున్న చంద్రుడి వెలుగు మసకబారగానే
ఉత్తరం సన్నని వెలుగు వెచ్చదనంతో చేతివేళ్లనుతాకి
పాటలోని పల్లవి శృతి మంద్రంలోకి దింపి
నర్మదా నదీ తీరాల వెంట పాలరాయి కొండలలో ఊగే తెప్ప సవ్వడి
నిశ్శబ్ధంలో నింగికి చుక్కలు
వేలయోజనాల దూరాన్ని దగ్గరచేసి చమ్కీలు కుట్టీ
పగటివెలుగు దాకదాచి లేఖలోకి ఒదగలేక
జారపోయిన అక్షరాలు
మెల్లగా అడుగుతున్నాయి
సందేశాన్ని వంపుతూ పదిలాన్ని ప్రశ్నిస్తూ
తప్పిపోయిందనుకున్న పరిచయం ముఖాన్ని వెదికింది
ముగింపులేకుండా ఏదో అడుగుతూనే వుంది
జాబు రాద్దమని కూర్చున్నానేగాని ఏది చిరునామ
ఊహలో ఊపిరిరెక్కలతో ఇక్కడికి చేరుకుంది
జ్జాపకాల రెల్లుపొదల్లొ చిక్కుకుపోయింది
అయినా అరిచేతులో నలుగుతున్న
తెల్లకాగితం మీద రాస్తూన్నాను
పెరటి తలుపు అడ్డగడియా తీసి
నూతిపళ్ళేం గట్టు మీదకూర్చుని…
రేణుక అయోల
ఉత్తరాన్ని గుర్తుచేసి “ఊహలో ఊపిరిరెక్కలతో ఇక్కడికి చేరుకుంది”
“నర్మదా నదీ తీరాల వెంట పాలరాయి కొండలలో ఊగే తెప్ప సవ్వడి
నిశ్శబ్ధంలో నింగికి చుక్కలు”
తెలుగులో సాహిత్యంలో, కవిత్వంలో ఎక్కువ గోదారి కన్పిస్తుంది, కానీ నర్మాదా నదిని వాడేసరికి కొత్తగా అనిపించింది. ఆ అనుభవ అనుభూతిలోకి చేరలేకపోయాను.
మీరు వాడిన చాలా పదాలవెంట “పెరటి తలుపు అడ్డగడియా తీసి
నూతిపళ్ళేం గట్టు మీదకూర్చుని” జ్ఞాపకాలవెంట పరుగులు తీసేటట్టు చేసారు.
అభినందనలు
కొన్ని నేమరవేతల మిఠాయి పొట్లం… చాలా నచ్చింది మేడమ్..
Wah….. Salaam… Super poem….
చాలా నోస్టాల్స్జిక్ కవిత రేణుకాజీ. ఉత్తరం ఓ మర్చిపోయిన జ్ఞాపకం. ఎక్కడో గుండెమారుమూల మిగిలిన ఓ తడి ఇంకా. మంచి కవితావస్తువునెంచుకుని దానికి న్యాయం చేసారు…మొదటి వాక్యం నుంచీ ఆకట్టుకుంది. అభినందనలు
లేఖలోకి ఒదగలేక
జారి పోయిన అక్షరాలు
మెల్లగా అడుగుతున్నాయి – చక్కని కవితకు వందనాలు