ఇంకేం చెప్పనూ!

bhuvanachandra (5)

షౌలింగర్ .. దాన్నే’ఘటికాచలం’ అని కూడా అంటారు. మద్రాసు నించి కార్లో ఓ మూడుగంటల ప్రయాణం.. ప్రస్తుత రద్దీలో. మధ్యలో ‘తిరువళ్లూరు’లో ఆగి వీరరాఘవస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. వీర రాఘవస్వామిని దర్శించడం ఓ అద్భుతమైన అనుభవం. ఆ ఆనందం అనుభవించాల్సిందే కానీ మాటలలో వివరించేది కాదు. పెళ్లికాని వాళ్లు మొక్కుకుంటే పెళ్లవుతుంది. అందుకే ఇక్కడ చిన్న ‘వరుడు’, ‘వధువు’ బొమ్మలు అమ్ముతారు.

షౌలింగర్ లేక షోలింగర్లో రెండు కొండలున్నై. ఒకటి నరసింహస్వామి గుడి, రెండోది ఆంజనేయస్వామిది. నరసింహస్వామిని దర్శించిన తరవాతే ఆంజనేయస్వామిని దర్శించాలి. కోతులకీ,కొండముచ్చులకీ లెక్కలేదు. ఆడవాళ్లు తలలో పువ్వులు పెట్టుకుంటే కోతులు ఆ పువ్వుల్ని లాగేస్తాయ్. అందుకే కొండ ఎక్కేప్పుడు ఓ కర్రని కూడా దుకాణదారులు ఇస్తారు.

నరసింహస్వామి గర్భగుడిలోకి వెళ్ళగానే బ్రాహ్మణులు ఓ పెద్ద ఉద్ధరిణతో మన మొహం మీద తటాల్న నీళ్లు కొడతారు. కొంతమంది భయపడితే కొంతమంది ఉలిక్కిపడతారు. ‘దృష్టిదోషం’ పోతుందిట. ఆ నీరు మన మీద పడితే.

ఇక్కడి ఆంజనేయస్వామికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఒకటి.. ఎక్కడా లేని విధంగా యీ ఆంజనేయస్వామికి నాలుగు చేతులు. రెండు అభయహస్తాలతో దీవిస్తుంటారు. ఇంకోటి సాలిగ్రామ మాల ధరించియోగముద్రలో ఉంటారు.

ఈ ఇద్దరు దేవుళ్ల ఫోటోలు ఎక్కడా దొరకవు. కేవలం దర్శించి తరించాల్సిందే . నృసింహస్వామి కొండ దూరం నించి చూస్తే సింహంలాగా కనిపిస్తుంది. ఇక్కడ 1400 మెట్లు. ఆంజనేయస్వామి గుడికి 400 మెట్లు. మెట్లు ఎక్కలేని వాళ్లకోసం ‘డోలీ’ ఏర్పాట్లు కూడ వున్నాయి. ఓ పాతికేళ్ల క్రితం వెళ్ళినప్పుడు ముందు ‘రిక్వెస్ట్’ చేస్తే గానీ ఉదయం ఇడ్లీ కూడా దొరికేది కాదు. ఇప్పుడు చాలా హోటళ్లు వెలిశాయి ( గుడి, కొండల దగ్గర.. ఊళ్ళో అంతకు ముందు హోటళ్లు వున్నై) ఆ రోజుల్లో ‘బస’ సత్రాల్లోనే. ఇపుడు ఏ.సి సౌకర్యాలతో సహా అన్ని హంగులతోనూ ఉండొచ్చు.

మానసిక జబ్బుల్తో బాధపడేవాళ్లని ఇక్కడికి తీసుకొచ్చి మూడు రాత్రులుంచితే ఖచ్చితంగా జబ్బు తగ్గుతుందని ఓ నమ్మకం. చాలా మందికి తగ్గిందని వాళ్ల నోటితోనే విన్నాను.

అక్కడి వాతావరణం చాలా హాయిగా వుంటుంది. శని,ఆదివారాలూ, మంగళవారమూ చాలా రద్దీగా ఉంటూంది. మిగతా రోజులు ప్రశాంతంగా వుంటుందక్కడ. దర్శనం ఉదయం తొమ్మిదింటినించి సాయంత్రం అయిదుగంటలవరకు మాత్రమే..

Image (9) - Copy

కొన్నేళ్ళ క్రితం ఆంజనేయస్వామి కొండ మొదట్లో వున్న ‘ఆర్య వైశ్య సత్రం’ దగ్గర ఓ చిన్న నిట్టాడి పాకలో ‘తాయమ్మ’ కు కనిపించాడంట. తాయి అంటే తమిళంలో ‘అమ్మ’ అని అర్ధం. మన తెలుగులో తాయమ్మ అంటే సుమారుగా అమ్మమ్మ అనుకోవచ్చేమో. మనిషి నలుపేగానీ అద్భుతమైన ‘కళ’. కళ్లు, పలువరుసా మెరుస్తూ మనల్ని ఇట్టే ఆకర్షిస్తాయి.. నవ్వు మొహం.

అప్పట్లో టిఫిన్ కావాలన్నా, ‘ఏర్పాటు’ చేసుకుంటే కానీ దొరికేది కాదని విన్నవించా. మేము అంటే నేనూ, శ్రీ గుత్తా రామ్ సురేష్‌గారి కుటుంబం షోలింగర్ చేరేసరికి చీకటి పడింది. ఆంజనేయస్వామి మెట్లదగ్గర వున్న ఓ చిన్న సత్రం (గుడికి సంబంధించిందే)లో రెండు గదులు తీసుకున్నాం. చాపలు వున్నై. దుప్పట్లూ అవీ మేము తీసికెళ్ళినవే. భోజనం కూడా మేం మద్రాసులోనే ‘పేక్’ చేసుకున్నాం. రాత్రిపూటకి.. చేరగానే ‘పెద్దమర్రి’ కింద వున్న ఓ చిన్న షాపులో ఇడ్లీలు రేపటికి ఏర్పాటు చేయగలవా’? అని ఓనర్ని అడిగితే చేస్తానన్నాడు.

పొద్దున్న లేవగానే నేను ఆ షాపుకి వచ్చాను. షాపు ఓనరు చెప్పాడు. “ఆ పాకలో వుండే ‘తాయమ్మ’ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా ఇడ్లీలు, చెట్నీ ఇస్తుంది. వెళ్లి నేను చెప్పానని చెప్పండి” అని.

అక్కడ వున్నది తాయమ్మ పేరు మీద చలామణీ అవుతున్న స్వర్ణకుమారి. నన్ను చూడగానే “రండి! ఇప్పుడు ఇడ్లీ వేసి ఇమ్మంటారా?” అన్నది నవ్వుతూ, అసలు స్వర్ణకుమారిగారు అక్కడుంటుందని నేను ఊహించలేదు. “మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. మీరు నన్ను గుర్తుపట్టారా?” అన్నాను. “మీతో పరిచయం చాలా తక్కువ. నిజం చెబితే ఒక్కసారే మీతో మాట్లాడింది. సురేష్‌గారు పరిచయమే.. వారి కుటుంబం కూడా తెల్సు. రామినీడుగారి సినిమాల్లో వేషం కూడా వేసానుగా!” నవ్వింది. ఆ నవ్వులో అదే ‘వెలుగు’.

“మీరు.”అడగబోయి ఆగిపోయా.

“ముందు కూర్చోండి..! చిన్న ప్లాస్టిక్ స్టూలు వేసింది. కూర్చున్నా. అయిదు నిముషాల్లో వొత్తుల స్టౌ(విక్ స్టౌ) మీద పాలు వేడి చేసి ‘ఫిల్టర్’ కాఫీ ఓ కప్పు నాకిచ్చి తనో కప్పు తీసుకుంది. ఆలోగా చుట్టూ చూశా. చిన్న పాక. పొందిగ్గా, పరిశుభ్రంగా వుంది. కాఫీ చాలా బాగుంది. ‘ఫిల్టర్’ కాఫీ రుచి చూడాలంటే మద్రాసులోనే… అది అలవాటు అయ్యాక మరే కాఫీ తాగలేము.

“నా గురించి మీకేం తెలుసూ?” నవ్వి అన్నది.

“సారంగపాణి స్ట్రీట్‌లో మిమ్మల్ని మీ ఇంటినీ చూడ్డమే తప్ప పెద్దగా ‘తరవాతి’ విషయాలు తెలీవు. మీరొక మంచి నటి అని తెలుసు. చాలా సినిమాలు చూశాను మీవి. తరవాత కృష్ణ గానసభలో మీరు శాస్త్రీయ సంగీతం పాడటం తెలుసు. ఇంతమంచి గాయని అయ్యుండీ సినిమాల్లో ఎందుకు పాడలేదా అని అనుకునే వాడిని” చెప్పాను.

“శాస్త్రీయ సంగీతం మా అమ్మ నేర్పితే, నృత్యం మా మేనత్త రాజరాజేశ్వరి నేర్పింది..!”

“రాజరాజేశ్వరి అంటే అలనాటి…?”

“అవును.. గొప్ప స్టేజ్ ఆర్టిస్టు. సినిమాలు కూడా చేశారు.”

“ఓహ్! యీ విషయం ఇప్పటిదాకా నాకు తెలీదు..”

“అన్ని విషయాలూ అందరికీ తెలీదుగా.. అయినా.. ఎవరి జీవితాల్లో వారు బిజీగా వుంటారు. ఇప్పుడు మరీ వేగం.. మీరందరూ మెట్ల దగ్గర దిగినప్పుడు చూశాను. రాత్రి మీరు టిఫిన్ గురించి అడిగారని షాపు శెట్టి చెప్పారు. సరేనన్నాను.” మళ్లీ నవ్వుల వెలుగు.

“ఇక్కడ మీరు..?”

“ఎందుకో అందరి మీదా అన్నిటి మీదా విరక్తి కలిగింది. నా కోసం “కొన్ని క్షణాలైనా” నేను మిగుల్చు కోవాలనిపించింది. అందుకే ఓ రోజు నా నగలు కొన్ని అమ్మేసి ఎవరికీ చెప్పకుండా మద్రాసు విడిచి పెట్టేశాను. చాలా వూళ్లు తిరిగాను. ఇక్కడ ఎందుకో బాగుందనిపించింది. యీ పాక ఉండే చోటులో ఓ ముసలమ్మ వుండేది. చాలా ఏళ్ళనించి ఇక్కడే ఉంటోంది గనక యీ స్థలాన్ని ఆమెకి ఇచ్చారు. నేను వచ్చినప్పుడు నాకు వండి పెట్టింది ఆవిడే. మిగిలినవాళ్లకి నన్ను చుట్టంగా పరిచయం చేసింది. దానితో ఆమె చనిపోయాక దేవుడి వారసత్వంగా యీ చోటు నాకు దక్కింది. (నవ్వు)..”

“మద్రాస్ టీ నగర్‌లో మీ ఇల్లూ, ఇంటిముందు గార్డెనూ ఇవన్నీ..?”

“వాటన్నిటికంటే ఇదే నాకు బాగుంది. విశాలమైన ఇల్లు అక్కర్లేదండీ. విశాలమైన మనసుండలి. నేనెవరో ఈ ఇంటి ముసలమ్మకి తెలీదు. కానీ, తన దగ్గర వుండమని నన్నడిగింది. సరే అన్నాను. నిజంగా నన్ను ఓ తల్లిలా ప్రేమించింది… చాలా ప్రశాంతంగా నా వొళ్ళోనే కళ్లు మూసింది…!” ఆగింది. ఆమె చూపులు కింద పెట్టిన కాఫీ కప్పు మీదున్నా.. మనసక్కడ లేదని క్షణంలో తెలిసిపోయింది. బహుశా మనోనయనాల్తో ఆ వృద్ధురాల్ని చూస్తూ వుండొచ్చు. ముఖంలో నిర్వికారం వున్నది. కొన్ని క్షణాలు గడిచాయి.

“సారీ! ఏవో జ్ఞాపకాల్లోకి జారిపోయాను. సరేలెండి.. ఇంతకీ మీరు టిఫెన్ సంగతి చెప్పలేదు కదూ. వాళ్లు ముగ్గురూ. మీరూ .. ఇంకా డ్రైవరూ.. అంతేగా..!”

“అవును. కానీ వాళ్లని కనుక్కోవాలి. టిఫిన్ దైవదర్శనానికి ముందా, తరవాతా అనే విషయం. ఇంకా టైముందిగా. వాళ్ల స్నానాలవీ కానిచ్చాకే నే స్నానిద్దామనుకుంటున్నాను. మీరు ఏమీ అనుకోకపోతే మరో కప్పు కాఫీ మీరిస్తే తాగాలని వుంది..” అన్నాను.

సమయం ఆరున్నర అంతే.. కొండమీద గనక కొంచం చలి ఉంది. ఆ చిరుచలిలో వేడివేడి ఫిల్టర్ కాఫీ తాగటం ఎంత హాయిగా ఉంటుందో..

“తప్పకుండా . ఇక్కడ దొరికినంత చిక్కని స్వచ్చమైన పాలు మద్రాసులో దొరకవు తెలుసా.. కారణం ఇక్కడి ఆవులు, గేదెలూ మేసేది సహజమైన కొండగడ్డిని. యీ కొండంతా ఔషధ మొక్కలమయం అంటారు. అందుకేనేమో పాల రుచి అద్భుతం..!” మాట్లాడుతూనే వేడిపాలని మళ్ళీ వేడి చేసింది.

“మద్రాసు యిల్లు?” అడిగాను.. “మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి సుమా..”

“చెప్తానుగానీ యీ విషయాలు మళ్లీ మీరు సురేష్‌గారికీ, వాళ్ల వాళ్లకీ చెప్పకూడదు..”

“టిఫిన్‌కి వచ్చినప్పుడు వాళ్లు వస్తారుగా.. గుర్తుపట్టి మిమ్మల్ని అడిగితే?”

“అసలు మీరు వొస్తారని నేను వూహించలా. ఊహిస్తే ఆ శేటుతో ముందే చెప్పేదాన్ని. అతన్నే వొచ్చి కాఫీ టిఫెన్లు పట్టికెళ్ళమని. మొత్తానికి మీరు వచ్చేసారు. సరే మాట్లాడుకుంటున్నాం. టిఫిన్ కాఫీలు వాళ్ల దగ్గర చేర్చడం ఇప్పుడు మీ బాధ్యత. మీరు తీసికెళ్ళొచ్చు లేదా శేటుతో చెబితే వాళ్ళబ్బాయికిచ్చి సత్రానికే పంపుతాడు..” నవ్వింది.

“సరేసరే.. ఎవరికీ చెప్పను..” కాఫీ కప్పు మళ్లీ అందుకుంటూ అన్నాను.

“మా అమ్మ ఏనాడూ ‘కులం’ గురించి ఎత్తేది కాదు గనక మాది ఏ కులమో నాకు తెలీదు. ఓ జమీందారుగారు తనని గాంధర్వ వివాహం చేసుకున్నారని ఆ ఇల్లు వారిదేనని మాత్రం చెప్పేది. ఆయన పేరు.. నాయుడుగారు. చాలా పెద్ద జమీందార్. ఆయనకి భార్యా పిల్లలూ వున్నారుట. మా తమ్ముడు పుట్టిన రెండేళ్ళకే ఆయన చనిపోయారు. ఆయన మొహం అంటే మా నాన్నగారి మొహం చాలా కొద్దిగా గుర్తుంది. ఆయన పోయిన తరవాత చాలా గొడవలు జరిగాయి. అవన్నీ అప్పుడు వివరంగా తెలీదు గానీ తరవాత తెలిసింది. మా నాన్నగారి మొదటి భార్యా పిల్లలూ మద్రాసులో ఇంటిని స్వాధీనపరుచుకోవడానికి వచ్చారుట. అప్పుడు రాజరాజేశ్వరిగారి భర్త చాలా సహాయం చేసారని మా అమ్మ చెప్పేది. చనిపోకముందే మద్రాసులో ఇల్లు మా నాన్నగారు అమ్మ పేరిట రాయించి రిజిస్టరు చేయించారట. దాంతో తలదాచుకోవడానికి ఇబ్బంది లేకుండా పోయింది. మా అమ్మ సంగీతం నేర్పుతూ నన్నూ తమ్ముడ్నీ చదివించింది”

“ఎంతవరకు చదివారూ?”

“నేను ఎనిమిదో తరగతిలో వుండగా ‘స్కూలు పిల్ల’లాగా వేయమని ఒక ఆఫరు వచ్చింది. రాజరాజేశ్వరిగారి భర్త మా అమ్మగార్ని ఒప్పించారు. ఆ సినిమాలో నా వేషానికి చాలా పేరొచ్చింది. అది తమిళ సినిమా. ఆ తరవాత వరసగా అలాంటి రోల్సే వచ్చాయి. ‘వద్దు’ అనే పరిస్థితి కాదు మాది. ఇల్లుంది. చాలా పెద్దది. కానీ దాన్ని మెయింటెన్ చెయ్యాలిగా? అదీగాక ఆరోజుల్లో సంగీతం నేర్పినా భోజనం వరకూ ఫరవాలేదుగానీ చదువులకి చాలదుగా..”

“అద్దెకివ్వొచ్చుగా?”

“వచ్చినవాళ్లు ఖాళీ చెయ్యం” అని ఆక్రమిస్తే? రాజరాజేశ్వరిగారి భర్త కుమరేశన్ గారే అద్దెకివ్వొద్దన్నారు. నాకు పద్నాలుగేళ్ళప్పుడు ఆయన రాజరాజేశ్వరిగార్ని పెళ్లి చేసుకుని మా ఇంట్లోనే ఒక పోర్షన్‌కి వచ్చేశారు. అప్పట్నించీ ఆవిడ్ని ‘అత్తా’ అనే పిలిచేదాన్ని. మేనత్తగానే భావించాను. కుమరేశన్‌ని దేవుడిచ్చిన అన్నగా అమ్మ అనుకునేది గనక ఆయన్ని ‘మామా’ అని పిల్చేదాన్ని.

“అలాగా! ఓహ్… తరవాత?”

“తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో సుమారు వంద సినిమాలు నటించా. రాజరాజేశ్వరి అదే అత్త మొదట్లో తెలుగు, తమిళ నాటకాల్లో నటించింది. నేను బిజీ అవడంతో ఆమె సినిమాలు మానేసి నన్ను చూసుకునేది. రోజులు చాలా బాగా నడిచేవి. సడన్‌గా అమ్మ చనిపోయింది. ‘హార్ట్ఎటాక్’ వల్ల అన్నారు. మొత్తం భారం అంతా ఇంటి ఖర్చూ, తమ్ముడి చదువు ఖర్చు నా మీద పడింది. అదృష్టం ఏమంటే నాకు మంచి మంచి వేషాలు.. అంటే ఎక్కువ సిస్టర్ కేరక్టర్లూ, సెకండ్ హీరోయిన్ కేరక్టర్లూ వరసగా వచ్చాయి. దాంతో తమ్ముడి చదువుకి ఇబ్బంది కలగలేదు… నా ఐరవై మూడో ఏట కొంచెం ప్రేమలో కూడా పడ్డాను. అదో మత్తు. అప్పటివరకూ చక్కగా నా పని నేను చూసుకునేదాన్ని కాస్తా ప్రేమలో పడగానే కళ్లు బైర్లు కమ్మాయి. ఇంట్లోంచి వెళ్లిపోయి ఓనాడు నేను ప్రేమించిన మళయాళ నటుడ్ని పెళ్ళాడేశాను గుళ్ళో…! ” మళ్లీ నవ్వు.. ఆ నవ్వులో ఏ భావమూ లేదు..

అన్ని రోడ్లూ రోముకే అన్నట్టు.. సినిమా హీరోయిన్ల ‘ప్రేమ’లన్నీ గుళ్ళో పెళ్ళిళ్ళకే.. కాంటాక్ట్ (లైసెన్స్డ్) పెళ్లిళ్లకే..

“ఆ తరవాత?”

“మీతో వచ్చినవాళ్లు స్నానాలూ అవీ అయిపోయి వుంటై గనక మీరు సత్రానికి పోవటం మంచిది. ఓ పాతిక ఇడ్లీలూ, చెట్నీ, కారప్పొడీ, నెయ్యి ఆ శేటు కొడుక్కిచ్చి పంపిస్తాను. హాయిగా తినేసి దర్శనాలయ్యి సాయంత్రం వరకూ యీ వూళ్లో వుండేటట్లయితే రండి. అప్పుడు చెప్పుకుందాం…”

“మరి.. టిఫిన్లకి..”

“ఓహ్.. డబ్బు సంగతా? నేను ఎవరైనా టిఫిన్లు కావాలని అడిగితే, వారికోసం తయారు చేసి పెట్టేదాన్నే కానీ.. హోటల్ పెట్టినదాన్ని కాదు.. నా దగ్గర ఇంకా కొంత సొమ్ముంది. అదీ అయిపోతే బహుశా హోటల్ పెట్టాల్సి వస్తుందేమో.. ప్రస్తుతానికి కాఫీ టిఫెన్ల వరకూ ఉచితమే…!” పకపకా నవ్వింది. సన్నటి బంగారు గొలుసు తప్ప వేరే ఆభరణాలు ఏమీ కనిపించలేదు. చీర కూడా ఖరీదైనది కాదు. చక్కగా ఉతికిన కాటన్ చీర. అగరువత్తులు వెలుగుతున్నాయి గనక నేను ఇక్కడికి రాకముందే అంటే.. తెల్లవారు ఝామునే స్నానం చేసి వుండాలి. నేను లేచాను. కానీ కథ మధ్యలో ఆగిందన్న చింత వుంది.

“అన్నట్టు రెండు గుళ్లల్లోనూ ప్రసాదాలు దండిగా వుంటాయి గనక దాన్నే మద్యాహ్న భోజనం అనుకోండి. రెండుసార్లు అడిగినా పెడతారు. లడ్డూలూ, అరిసెలూ కొనుక్కుని ఇంటికి తీసికెళ్లొచ్చు” చెప్పిందామె..

శేటుతో చెప్పి సత్రానికి వెళ్లాను. నిజమే.. వాళ్లంతా సిద్ధం. గబగబా స్నానం చేసి నృసింహస్వామిని చూసి, కిందకి దిగేసరికి ఒంటిగంట. కారణం సురేష్‌గారు ప్రత్యేకంగా ‘పూజలు’ చేయించడం.

ప్రసాదాలు గిన్నెల్లో పెట్టేసాం. కిందకి వచ్చి శేఠ్ దగ్గర ఆగాము. ఇడ్లీలు, చెట్నీ, నెయ్యీ, కారప్పొడి రెండు మూడు గిన్నెల కేరేజీల్లో వున్నాయి. ‘రుబ్బి’న పిండేమో.. టిఫిన్ అద్భుతంగా వుంది. వేడి లేకపోయినా..

“వేడివేడిగా పెట్టారండి ఆవిడ. ఎంత బాగున్నాయో.. పది ఇడ్లీలు తిన్నాను..” మాతో కొండపైకి రాని డ్రైవర్ సంబరంగా చెప్పాడు. మేము తింటూ వుంటే..

పాక తలుపు గొళ్ళెం పెట్టి వుంది. అంటే ఆవిడ లేదన్నమాట. ఆంజనేయస్వామి గుడి దర్శించుకుని కింద కొచ్చేసరికి నాలుగు. “ఇవాళ రాత్రి ఇక్కడే వుండిపోతే బాగుంటుంది కదూ..!” అన్నాను. “ఒక నిద్ర చేస్తే చాలు అండీ…” అయినా ప్రిపేర్డ్‌గా రాలేదుగా. మళ్లీ వచ్చే నెల్లో వద్దాం….!” సామాన్లు, అంటే మా దిళ్లూ, దుప్పట్లూ మడతపెడుతూ అన్నారు సురేష్‌గారు.

వాళ్లతో వచ్చినప్పుడు వారి ఇష్టప్రకారమే మనమూ నడుచుకోవాలి గదా.. కార్లో వచ్చేటప్పుడు చూసినా పాక తలుపు మూసే ఉంది.

మద్రాసు చేరేవరకు నా మనసు మనసులో లేదు. కథ మధ్యలో ఆగింది. ఆమెకి విరక్తి కలిగేంతగా అక్కడ ఏమి జరిగి వుండాలీ? మరుసటి రోజునే ఓ కారు మాట్లాడుకుని షోలింగర్ వెళ్లాలని స్థిరంగా నిర్ణయించుకున్నాను.

పొద్దున్నే ‘విజయబాపినీడు’గారింటినించి ఫోను. అర్జంటుగా వచ్చెయ్యమని. నాకు మొట్టమొదట అవకాశం ఇచ్చి ప్రోత్సహించింది శ్రీ విజయబాపినీడుగారే. ‘నాకూ పెళ్ళాం కావాలి” నా మొదటి సినిమా. నన్ను ఆయన దగ్గరకు తీసికెళ్లి పరిచయం చేసింది గుత్తా రామ్ సురేష్‌గారు. గుత్తా రామ్ సురేష్‌గారు నాకు ‘డాక్టరు’గారి దగ్గర పరిచయమయ్యారు. (‘డాక్టరు’గారి ‘కథ’ ఫోటొలతో సహా త్వరలో వ్రాయబోతున్నాను) V.B. దగ్గరకు వెళ్ళాకే తెలిసింది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా సిట్టింగ్‌లో కూర్చోవాలని.

(పాటల రచయితకి స్టోరీ సిటింగ్స్‌తో పెద్దగా సంబంధం ఉండదు. పాట రాసేటప్పుడు పాట ఏ సందర్భంలో వస్తుందో అంతవరకే చెబుతారు. కానీ విజయబాపినీడుగారు ‘నన్ను స్టోరీ సిటింగ్స్‌లో కూడా కూర్చోబెట్టుకునేవారు. నాకు ఎక్కడ సందేహం వచ్చినా, సీను బాగా లేదని అనిపించినా నిర్మొహమాటంగా చెప్పేవాడ్ని. ఒకోసారి ఎలా యితే బాగుంటుందో కూడా నా ఆలోచన చెప్పేవాడ్ని. కఠంతా తెలియడం వల్ల పాటలు కథలో కలిసిపోయేట్టు వ్రాయడానికి వీలయ్యేది. మా యింటి మహారాజూ, ఖైదీ 786, గ్యాంగ్ లీడర్, దొంగ కోళ్లు. ఇంకా ‘బిగ్ బాస్’ , కొడుకులు, ఫ్యామిలీ సినిమా వరకూ అన్నీ కథాచర్చల్లో నేనూ పాల్గొన్నా)

ఆ సిటింగ్స్ జరుగుతూ వుండగానే మా అమ్మగారికి ‘సీరియస్’ అని టెలిగ్రాం వచ్చింది. విజయవాడ చేరేసరికి భయంకరమైన తుఫాను. మొత్తానికి ఎలాగోలా రాజమండ్రి (హాస్పిటల్‌కి) చేరడం, మళ్లీ మద్రాస్ వచ్చిన రోజుకే మా అమ్మగారు ‘పరమపదించడం’ జరగడంతో ‘స్వర్ణకుమారిగారి కథ’ మనసులోనే సమాధి అయిపోయింది. అంటే అసలు గుర్తు రాలేదు. దానికి తోడు గ్యాంగ్ లీడర్ తరవాత ‘బిజీయెస్ట్’ రైటర్నయ్యాను.

ఆ తరవాత ‘ఘరానా మొగుడు’తో రోజుకి పద్ధెనిమిది గంటలు పని చెయ్యాల్సి వచ్చేది. సరే అది వేరే కథ.

నాలుగైదేళ్ల తరవాత మళ్లీ షోలింగర్ వెళ్లాం. అప్పుడు గుర్తొచ్చింది స్వర్ణకుమారిగారు. తీరా వెడితే ఆ పాక స్థానంలో ‘రెస్టారెంట్’ కట్టబడి వుంది. శేట్‌ని అడిగితే ‘తాయమ్మ’ని ఖాళీ చేయించడంతో (ఇల్లు) ఆమె వూరు వదిలి వెళ్ళిపోయిందని చెప్పాడు. నా మనసులో ఒక శూన్యం.

చెన్నై తిరిగి వెళ్లాక సారంగపాణి స్ట్రీట్‌కి వెళ్లాను. నాకు బాగా పరిచయమూ, స్నేహమూ వున్న ఓ ప్రొడక్షన్ మేనేజర్‌తో స్వర్ణకుమారిగారి ఇల్లు ‘కుమరేశన్’గారు ఓ కన్నడ ప్రొడ్యూసర్‌గారికి అమ్మేశాడని తెలిసింది. నాకు షాక్. స్వర్ణకుమారి ఆస్థిని పోనీ స్వర్ణకుమారి వాళ్ల తమ్ముడి ఆస్థిని కుమరేశన్ ఎలా అమ్మాడూ?? అతనికి ఏం అధికారం వుందీ?

‘కుమరేశన్’గురించి ఎంక్వైరీ చేస్తే అతను కుంభకోణం దగ్గర వుండే వాళ్ల స్వంత వూరికి వెళ్లిపోయాడని అతి కష్టం మీద తెలిసింది. స్వర్ణకుమారి తమ్ముడేమయ్యాడో తెలీదు. కనీసం అతని పేరు కూడా నాకు తెలీదు. కనుక్కునేదెట్టా? కొన్నేళ్ళు గడిచాయి.

చాలా మార్పులు.. చలన చిత్ర పరిశ్రమ హైదరాబాదుకి తరలింది. నేను హైద్రాబాదు, చెన్నైల మధ్య తిరుగుతున్నాను. ఇ.వి.వి.గారి ‘కన్యాదానం’ సినిమాకి పాట వ్రాయడానికి హైద్రాబాద్ వెళ్లాల్సి వచ్చింది. బేగంపేట ఏర్‌పోర్ట్‌లో దిగాక నన్ను లోకేషన్‌కి తీసికెళ్లారు. అక్కడినించి నా ‘బస’కి చేరాను. అదో గెస్ట్ హౌసు. పాట ఫస్టు వెర్షను పూర్తి చేసి గేప్ ఇవ్వాలనుకుని కాసేపు బైటికొచ్చి తిరుగుతుంటే శ్రీమూర్తి కనిపించాడు. అతను నాకు చెన్నైలో పరిచయం. టి.నగర్‌లో వుండేవాడు.

“గురూగారూ… బాగున్నారా? హైద్రాబాదు షిఫ్ట్ కాకుండా మంచి పని చేశారండి..!” అన్నాడు. ఆ రోజుల్లో మద్రాసు నించి హైద్రాబాద్ పని మీద వెళ్లినవాళ్లలో అక్కడికి ఆల్రెడీ షిఫ్ట్ అయినవాళ్లు అలాగే అనేవాళ్ళూ.

“మీరేం చేస్తున్నారూ? ఎక్కడుంటున్నారూ?” అడిగాను.

“అక్కడయితే బాగా ‘కింగ్’లా వుండేవాడ్నండి. అదేనండి. స్వర్ణకుమారిగారి దగ్గర. ఇక్కడికొచ్చాక రోజుకి ఒకళ్ల దగ్గర..”నిట్టూర్చాడు.

“స్వర్ణకుమారిగారి దగ్గరా?”ఆశ్చర్యంగా అడిగాను. వాళింటి ముందునించి వెళ్తూ వుండటమేగానీ ఆ రోజుల్లో శ్రీమూర్తిని అక్కడ చూడలేదు.

“అవునండీ! ఆవిడ ఫీల్డులోకి వచ్చినప్పట్నించీ ‘టచప్’ (Touch-up)బాయ్‌గా మొదలెట్టి మేకప్‌మేన్‌గా ఆవిడ దగ్గర ఎదిగానండి. భద్రయ్యగారు నేర్పారండి..” గొప్పగా అన్నాడు. భద్రయ్యగారి శిష్యులకి ఆ గర్వం వుండటం అసహజమేమీ కాదు.

“అసలావిడ ఎక్కడికెళ్లారూ? ఎందుకెళ్లిపోయారూ?” అడిగాను. స్వర్ణకుమారిని చూసినట్టు చెప్పలేదు.

“అదో పెద్ద కథండి. కసాయివాడ్ని గొర్రె నమ్మినట్టు ఆ కుమరేశంగాడ్ని స్వర్ణకుమారి అమ్మగారు నమ్మారండి. కుమరేశన్, జమిందారుగారి దగ్గర మేనేజర్‌గా కాదు గానీ పనివాడుగా, అంటే చనువున్న పనివాడుగా వుండేవాడండి. నేనప్పుడు భద్రయ్యగారి ఇంటిదగ్గరే వుండేవాడ్నండి. జమిందారుగారు పోయాక, స్వర్ణమ్మగారి అమ్మగారికి సహాయం చేస్తున్నట్టుగా వుండేవాడండి. ఆవిడ ఉత్త వెర్రిబాగుల్దండి. ఆవిడా, ఆవిడ పిల్లలూ సంగీతమూ తప్ప ఏదీ పట్టించుకునేది గాదండి. ఆ పిల్ల చదువుకునేటప్పుడు తల్లి హార్ట్ ఎటాక్‌తో చచ్చిపోయిందన్నారండి. నాకైతే నమ్మకం లేదండి. కుమరేశన్ అంతకు రెండు మూడేళ్ళ ముందే రాజరాజేశ్వరి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకుని, స్వర్ణమ్మగారింట్ళోనే ఓ పోర్షన్‌లోనే దిగాడండి. ఆ రాజమ్మగారూ మంచి మనిషేనండి. స్వర్ణమ్మగారు బిజీ అయ్యాక రాజమ్మగారు సినిమాలు మానేసి ఇంట్ళో వుండేదండి. స్వర్ణమ్మ దగ్గర నన్ను టచ్చప్‌గా పెట్టిందీ, మేకప్ మేన్నీ చేసిందీ భద్రయ్యగారేనండి..!”

“ఆ తరవాత?” అడిగాను.

“తమ్ముడు బియ్యే చదువైతుండగా, ఆ స్వర్ణమ్మగారు ప్రేమలో పడిందండీ. అయితే కుమరేశన్‌గారు చాలా తెలివిగా ‘వెళ్లిపో’ కానీ, నీ ఆస్తి మాత్రం మీ తమ్ముడి పేరు మీద రాసి వెళ్ళు.. ఎందుకంటే ఒకవేళ ఆ మళయాళంగాడు నిన్ను తన్ని తగలేసినా కనీసం మీ అమ్మ ఆస్తి నీకు బతకడానికి ఊపయోగపడుతుందీ అని చెప్పాడండి. ఆ రోజుల్లో మేమందరం కుమరేశన్ దేవుడిలాంటోడు అనుకునేవాళ్ళమండి. ఆయన చెప్పింది సబబుగానే అప్పుడూ అనిపించిందండి. స్వర్ణమ్మకూడ మాట్లాడకుండా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టిందండి. స్వర్ణమ్మగారి తమ్ముడి పేరు ‘ధనుంజయ’ అండీ. డిగ్రీ కాగానే పాపం ఆ పిల్లాడికి తన చుట్టాన్నే ఎక్కడ్నించో తీసుకొచ్చి పెళ్లి చేశాడండీ… కుమరేశన్..!” ఆగాడు శ్రీమూర్తి.

ఏవో మబ్బులు విడిపోయి మళ్ళీ ముసురుకుంటున్నట్లనిపించింది..

“స్వర్ణమ్మ వెనక్కి రాలేదా?”

” ఆ విషయం మాత్రం అసలు తెలీదండి. అది కుమరేశన్ గాడికే తెలియాలండి. పిల్లాడి పెళ్లయిన మూడ్నెల్లకే రాజేశ్వరమ్మకి ‘క్షయ’ జబ్బు వచ్చిందండి. ఆవిడ్ని రాయవెల్లూరులో చేర్చారండి…!!”

” ఊ తరవాత?”

“నిజం నాకు తెలీదండి. అబద్ధం చెబితే పాపం వస్తాదంటారు కదండీ…”

“నిజం చెప్పండి మూర్తీ..”

” ఆ కుర్రాడు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదండి. ఆ పిల్లాడికిచ్చి చేసిన అమ్మాయికీ కుమరేశన్‌కీ సంబంధం వుండటం చూసి ఆ పిల్లాడు ఇల్లొదిలి పోయాడని పనిమనిషి ఓ రోజున నాతో అన్నదండీ..”

సైలెంటైపోయాను.

“మరి ఆస్తి?”

“స్వర్ణమ్మ చేతే నీతులు చెబుతూ నమ్మించి సంతకాలు పెట్టించిన వాడికి, ఆ కుర్రోడి చేత సంతకాలు పెట్టించుకోవడం ఎంతసేపండీ? వాడు ఆ యిల్లు ఓ కన్నడపు ఆయనకి అమ్మడం నాకు తెలుసండీ…!” వివరించాడు శ్రీమూర్తి.

” ఆ తరవాత?”

“నాకు ఏమె తెలీదండి. ఆ అమ్మాయి ఏమయిందో, ఆ బాబు ఏమైపోయాడో ఏమీ తెలీదు. కుమరేశన్‌గాడు మాత్రం లక్షలు దండుకున్నాడండీ ఆ ఇల్లు అమ్మి.. నాకు తెల్సింది అంతేనండి..!”

ఓ నిట్టూర్పు ఒకేసారి వెలువడింది. ఇద్దర్ని దగ్గర్నించీ..

డిసెంబరు (2013)లో విజయవాడలో రెండు రోజులు వున్నాను. శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర్రావు (నాకు 35 సంవత్సరాలనుంచి స్నేహితులు)గార్ని కలిసి, అక్కడే జలదం ప్రభాకర్ (నది .. ఎడిటర్)గార్ని కలిసి చాలా సేపు ఖబుర్లు చెప్పుకుని మళ్లీ నా హోటల్‌కి బయలుదేరుతూ మధ్యలో ఒక చోట ఆగాను… ఓ చిన్న పనుండి..

విజయవాడలో లెక్కకి మించిన స్నేహితులున్నారు. ఒకతనికి వొంట్లో కొంచెం సుస్తీగా వుందని తెలిసి చూడ్డానికి వెళ్ళానన్నమాట. చూసి వస్తుండగా పరిచయమైన ‘గొంతు’ వినిపించింది. ఆ గొంతే.. స్వర్ణకుమారిగారిది.

ఆ పాత పెంకుటింటి ముందు ఆగి.. “తాయమ్మా” అని పిలిచినాను. ఆమె బయటికొచ్చింది. వయసు తెచ్చిన చిన్న చిన్న మార్పులే తప్ప పెద్ద మార్పులేం లేవు. “ఆఖరికి వచ్చారన్నమాట…!” నవ్వింది. అదే నవ్వు… అంతే మధురంగా “గుర్తుపట్టారా?” అన్నాను.

“మిమ్మల్ని ఆ మధ్య లిటిల్ చాంప్స్. అదే జీ తెలుగు చానల్లో ప్రతీవారమూ చూశాను గనక గుర్తుపట్టకేం. అదీగాక మీది మరిచిపోయే పేరా?” మళ్లీ నవ్వింది.

‘నవ్వడం దేవుడు మనిషికి ఇచ్చిన వరం’ అని మరిచిపోయిన వాళ్లకి, స్వర్ణకుమారిని పరిచయం చెయ్యాలనిపించింది. లోకంలో కొందరు ‘నిరాశా అగరుబత్తీలు’ ఉంటారు. ఎప్పుడూ నిట్టూరుస్తూ ప్రపంచంలోని బాధలన్నింటినీ భరిస్తూ భారంగా జీవితాన్ని లాగుతూ వుంటారు. మనిషి కనపడంగానే వాళ్ల బాధని వెళ్లగక్కేస్తారు. చెప్పినవాడు బాగానే వుంటాడు గానీ, విన్నావాడికి ఉత్సాహం చచ్చిపోయి నిరాశలో మునిగిపోతాడు. కొందరు ఎంత బాధలో వున్నా సరే అది బయటపడనివ్వక ‘ఆశ’నీ, సంతోషాన్నీ పంచేవారైతే, కొందరు నిరంతరం నిరాశని మాత్రమే వెళ్లగక్కే జీవులు.

స్వర్ణకుమారి నిజంగా ‘ఆశా బ్రాండ్ అగర్‌బత్తీ’. ఆశల సువాసనని వెదజలుతూ వుండే నిజమైన మనిషి.

“లోపలికి రానివ్వరా?” నవ్వి అడిగాను.

“బాధపడతారు..!”

“పడను..!”

“అయితే రండి..!” పక్కకి తప్పుకుంది. లోపలికి అడుగుపెట్టాను. అంతా శుభ్రంగా వుంది. కానీ మంచం మీద ఒకామె శరీరం తొడిగిన అస్థిపంజరంలా వుంది.

“ఈమె రాజరాజేశ్వరి. నా మేనత్త. కొంచెం సుస్తీగా వుంది. త్వరలోనే కోలుకుంటుందని డాక్టర్సు అన్నారు. చంద్రగారూ, ఈమె నాకు నృత్యం నేర్పిన గురువు,.. మంచి నటి కూడా..!” పరిచయం చేసింది. కళ్లు చెమర్చాయి. ఆవిడ కష్టం మీద రెండు చేతులూ ఎత్తింది. నేనూ చేతులు జోడించాను.

“ఫిల్టర్ కాఫీ ఇద్దునుగానీ .. ఇది సమయం కాదు.. సరే.. కొంచెం బయటకు వెళ్లాల్సిన పని వుంది. కూడా వస్తారా..!! ” అంటూ బయటికొచ్చింది.

నేనూ మరోసారి రాజేశ్వరిగారికి నమస్కారం చేసి బయటికొచ్చాను.

“ఏమీ లేదు.. మీరేమో గతాన్ని గురించి ప్రశ్నిస్తే తను ‘భోరు’మంటుందని బయటికి లాక్కొచ్చాను.” అన్నది.

“ఏం చేస్తున్నారూ?”

“నేను టైలర్నయ్యానండోయ్.. అదీ సూపర్ టైలర్ని. జాకెట్టుకి నూటయాగ్భై తీసుకుంటున్నాను. షాపు కూడా పెట్టాలెండి..” పకపకా నవ్వింది.

“రాజరాజేశ్వరిగార్ని…”

“ప్రస్తుతం నేనే చూసుకుంటున్నాను. గతాన్ని నేను మర్చిపోయినా పాపం తను మర్చిపోలేకపోతోంది… సరే.. గతాన్ని భోంచెయ్యడం ఎందుకూ? ప్రస్తుతం ఆమె “షుగర్’తో నీరసించిపోయింది. బతుకుతుందనే నమ్మకం నాకు వుంది. మనిషి ఆశాజీవి కదా…! ఒకవేళ బతకలేదనుకోండి..”సరే ఆమెకి అన్ని బంధాలనించీ ‘విముక్తి’ లభిస్తుంది. ఏదైతేనేం..” నిశ్చలమైన మనస్సుతో అన్నది స్వర్ణకుమారి.

“మీరేమీ అనుకోకపోతే ఒక్క కాఫీ తాగుదామా!” అడిగాను.

“దానికేం భాగ్యం…!”

“రోడ్డుపక్కనే వున్న ఓ ఫాస్టు ఫుడ్ సెంటర్ దగ్గర ఆగి అక్కడున్న ప్లాస్టిక్ స్టూల్స్ మీద కూర్చుని కాఫీ తాగాము.

ఏ ప్రశ్నా అడగాలనిపించలేదు. ప్రశ్నలు లేవు. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది.

“చంద్రగారూ. మీరోసారి లిటిల్ చాంప్స్‌లో అన్నారు. “వై కలెక్ట్ వెన్ యూ కెనాట్ కేరీ” అని! నాకా మాట చాలా నచ్చింది. ఏం తీసుకుపోతామని పోగు చేసుకోవాలీ? ఆఖరికి అనుభవాలతో సహా…!” నా వంక చూస్తూ నవ్వింది.

ఇంకేం చెప్పనూ!

 

‘స్వర్ణకుమారి’ కథ రాస్తున్నంతసేపూ ఒళ్ళు పులకరిస్తూనే వుంది. లోకంలో జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పేవాళ్లూ ఉంటారని తెలీటం లేదూ…!

 

శుభాకాంక్షలతో

భువనచంద్ర

Download PDF

48 Comments

  • అనామకుడు says:

    Awesome! there’s nothing more say. God Bless Thayamma. God Bless you.

  • buchi reddi gangula says:

    ఏం తీ సుకపో తా మని పోగు చేసుకోవాలి ????బాగుంది Chandra గారు
    సర్ — యీ రోజుల్లో డబ్బు సంపాదన కోసం — పరుగులు — వేగం —పోటీలు —-(రాజకీయాలు )—-
    డబ్బు కోస0
    డబ్బు వలన
    డబ్బు చేత ——-నేటి లోకం పోకడ —
    అమెరికా అయినా అమలాపురం అయినా
    ———————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

    • BHUVANACHANDRA says:

      నిజం రెడ్డి గారూ …””’.కానీ ఏమీ తీసుకు పోలేము ””అన్నది పచ్చి నిజ …మనకి ఎంత కావాలో మనమే నిర్ణయించు కో గలిగిన నాడు సమాజం కొంత బాగుపడుతుంది …….నమస్సులతో …భువనచంద్ర

  • చదువుతున్నంత సేపూ కన్నీళ్లు ఆపుకోలేక పోయాను. సాటి మనిషిని నమ్మకుండా ఎలా ఉంటాం? తీరా ఆ మనిషి ద్రోహం చేసినప్పుడు , జీవితమే తలక్రిందులు అయి పోయినా కూడా చిరునవ్వుతో ఎదురు నిలబడ్డ స్వర్ణ కుమారి కి నిజంగానే hats off.

    • BHUVANACHANDRA says:

      ఆమె నిజంగా బతుకుని జయించింది ……..ఆమె నవ్వే ఆమె బలం …….థాంక్స్ గౌరీ గారూ

  • నింగికెగిరి, నె మ్మ ది గా జారి అదఃపాతాళంలో పడిపోయినవెన్ని జీవితాలో ఆ రంగుల ప్రపంచంలో. మీకు తెలియనిదేమున్నది భయ్యా?

    స్వర్ణకుమారి నిజంగా ‘ఆశా బ్రాండ్ అగర్‌బత్తీ’.
    వాళ్లందరికి కూడా.

    చావులో ఏముంది.. బతికినంతకాలం ఆత్మసంతృప్తితో బతకడంలో ఉంది అని చెప్పక చెబుతున్న స్వర్ణకుమారి గారి జీవితంలో ఉంది.

    • BHUVANACHANDRA says:

      ఆమె నిజంగా బతుకుని జయించింది ……..ఆమె నవ్వే ఆమె బలం …….థాంక్స్ గౌరీ గారూ

      • BHUVANACHANDRA says:

        అవును భయ్యా ….ఆవిడని చూసాక నాకెంతో సంతోషం కలిగింది

  • okaDu says:

    పైకి నేను బానే ఉన్నా అని చెప్పడం వేరూ, లోపల బాగా ఉండటం వేరూను. ఆ రెండూ ఒకటై నప్పుడు కళ్ళలో మెరుపు వెల్తురు అదే కనిపిస్తుంది ఆటోమేటిగ్గా. రెండూ వేరువేరైనప్పుడు కనిపించేది మనం రోజూ చూసే ప్రతి సినిమా ఏక్టర్ కళ్ళలో కనిపించేదే. మొత్తానికి గుండె పిండినట్టైంది చదివాక. ఎన్ని యుగాలు గడిచినా ఆడవాళ్ళ జీవితాలు ఇంతేనా అనిపించింది కూడా. ఎవడో ఒక మొగాడు నీకు నేనున్నా అనేసరికి సర్వం మర్చిపోయి వాడి వెనకాల పోవడం, వాణ్ణే నమ్మి నట్టేట్లో ములగడం, పునరపి జననం, పునరపి మరణం. ఏమిటో బతుకులు. సినిమా ఫీల్డ్ లో ఒకే ఒక నాగేస్వర రావూ, కోట్లకొద్దీ స్వర్ణలతలు ఎందుకుంటారో తెలియచేస్తోందీ కధనం.

    భువనచంద్రగారూ, ఈ కధ ఆవిడ పర్మిషన్ తీసుకుని రాసారా? ఇక్కడ పోస్ట్ చేసాక ఆవిడ్ని వెతుక్కుంటూ వెళ్ళే ఒకటో, రెండో పెద్ద మనుష్యులు పుకార్లన్నీ సంధించి దేశం మీద వదుల్తారు. అన్నట్టూ ఆవిడ ఎవరికీ చెప్పవద్దు అని మీతో అన్నట్టు రాసారు. ఇప్పుడు సురేష్ గారికీ ప్రపంచానికీ తెలియపర్చారు. ఆవిడ కిచ్చిన ప్రామిస్ కి నీళ్ళ ధారేనా?

    • BHUVANACHANDRA says:

      ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకునే రాసాను …వారి పర్మి షన్ తోనే ,,…..చిత్తు ప్రతి కూడా వారు చదివారు ,!,,కనుక నా ప్రామిస్ నిలుపుకున్నట్టే …!…. మీరు నా కధకి స్పందించి నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు …నమస్సులతో …భువనచంద్ర

  • Manjari Lakshmi says:

    మీది చదివి నేను విజయవాడే కదా మిమ్మల్ని అడిగి అడ్రెస్స్ తీసుకొని ఆమెను చూసి
    వద్దమనుకున్నాను. కానీ ఒకడు గారికి మీరిచ్చిన సమాధానం చదివితే విజయవాడలో చూసాను అనటం కూడా అబద్దమెమొ ననిపిస్తోంది.

    • BHUVANACHANDRA says:

      మంజరిగారూ …వారిని అడిగి ,వారు అనుమతిస్తే , వారి చిరునామా మీకు ఇవ్వగలను ….నమస్సులతో bhuvanachandra

  • kv ramana says:

    స్వర్ణకుమారి ఒక మలయాళీ నటుని పెళ్లిచేసుకుందని అన్నారు. ఆ పెళ్లి ఏమైందో, నటుడు ఏమయ్యాడో చెప్పలేదు. మా అమ్మ మా కులం ఏమిటో ఎప్పుడూ చెప్పలేదని కులం తెలియదనీ స్వర్ణకుమారి అనడం నమ్మేలా లేదు. కులాలను ఎంత వ్యతిరేకించే వాళ్ళకైనా తమ కులం ఏమిటో తెలియకుండా ఉండదు. అమ్మ చెప్పకపోయినా కూతురైనా అడిగి తెలుసుకుంటుంది. బంధువుల ద్వారా అయినా తెలుస్తుంది. ఈమె, ఈమె తమ్ముడు మరీ వెర్రి బాగులవాళ్లలా ఉన్నారు. ఎవణ్ణో అంత అమాయకంగా ఎలా నమ్మారో? అతను వీళ్ళ ఆస్తిని చేజిక్కుంచుకుంటే ఎలా ఊరుకున్నారో? మానవప్రయత్నంగా కనీసం పోరాడాలి కదా? పైగా నవ్వా? ఆ వెర్రి నవ్వును బతుకును జయించడం అనో, ఇంకొకటనో అంటూ గొప్ప చేసి చెప్పడమా? మంచి మెలోడ్రామా దట్టించిన ఈ సినిమా కథ చదివేసి పాఠకులు బొట బొటా కన్నీళ్ళు కార్చేయడమా? ఈ కథతో ఏం చెప్పాలనుకున్నారు? జీవితంలో మోసపోయిన వాళ్ళు అందరూ మోసగాళ్లను వదిలేసి, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి, ఇడ్లీలు, చాయీ అమ్ముకుంటూ, జాకెట్లు కుట్టుకుంటూ, నవ్వుతూ బతికేయండనా? సినిమాల్లో ఇలాంటి కథలు బావుంటాయేమో కానీ నిజజీవితంలో బావుండవు సార్.

    • BHUVANACHANDRA says:

      శ్రీ kv రమణ గారూ ….కధ చదివి నందుకూ , మీ స్పందనని సూటిగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు …

      • kv ramana says:

        భువనచంద్రగారూ, నా స్పందన హార్ష్ గా అనిపిస్తే మన్నించాలి. సినిమాలు ఎమోషన్స్ మీద ప్లే చేస్తాయి. ఆలోచనాశక్తిని పెంచవు. ఎమోషన్స్ మీద ప్లే చేసినప్పుడే వాటికి డబ్బులు వస్తాయి. వాటి బాధ వాటిది. మీరు సినిమా కథలకు అలవాటు పడ్డవారు కాబట్టి ఆ మూసలోనే ఈ కథ రాశారని చెప్పడం నా ఉద్దేశ్యం. మీ కథ చాలామందికి కన్నీళ్లు తెప్పించింది కనక మీరే రైటు అనుకుంటే మీ ఇష్టం. జీవితంలో మోసగించబడి, ఆస్తిని పోగొట్టుకుని అజ్ఞాతవాసం చేస్తున్న ఒక అభాగ్యురాలి నుంచి మనం ‘ఆశావాహదృక్పథాన్ని’, ‘స్పూర్తినీ’, ‘నల్లేరు మీద నడక’లాంటి వచనంతో మీలాంటి వారు కథ రాయడానికి సబ్జెక్టును తీసుకోవడానికి ఆస్తి కోల్పోవడం ద్వారా ఆమె అంత ఖరీదైన మూల్యం చెల్లించుకోవాలన్న మాట. ఇలాగే పాకుడురాళ్ళ మీంచి జారిపడి కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకున్న ఒక నటి గురించి రాసి ఒకాయన జ్ఞాన్ పీఠ్ అవార్డు తెచ్చుకున్నాడు. అమాయకంగా నష్టపోయిన జీవితాల గురించి పాసివ్ గా, పాఠకుల్లో ఎమోషన్స్ కు అప్పీల్ చేసేలా రాసి చేతులు దులుపుకోవడం నిజమైన రచయిత చేయవలసింది కాదని నా ఉద్దేశ్యం. అలాంటివాళ్లలో పరిస్థితులపై తిరగబడే మనస్తత్వాన్ని పెంచేలా రాస్తే రచనకు సార్థకత ఉంటుంది. నా అభిప్రాయంలో అర్థం లేదనుకుంటే మీ ఇష్టం. మలయాళీ నటుడితో ఆమె పెళ్లి ఏమయ్యిందో, అతనేమయ్యాడో మీరు చెప్పకపోవడం కథలో ఒక లోపమని నా అభిప్రాయం. ఆమె తన కులం తెలియదనడం కూడా నమ్మేలా లేదు. దీనిపై మీరు స్పందిస్తే సంతోషం.

      • BHUVANACHANDRA says:

        శ్రీ kv రమణ గారూ నమస్తే … కులం గురించి చెప్పొచ్చు …..అయితే దానివల్ల ఉపయోగం లేదు అనిపించింది నిజంగా స్వర్ణ కుమారికి చాలా సంవత్సరాలు తన కులం ఏమిటో తెలియదనీ , తెలిసాక చాలా బాధ పడ్డాననీ అన్నది . పొతే ,కధ వరకూ కులం గురించి చెప్పాలి అంటే , నిజంగా ఆ కులం ఏమిటో చిబితేనే గానీ కధకి పరమార్ధం సిద్దించదు అనుకుంటే …..తప్పక చెప్పాల్సిందే !…కాదనను … ….త్వరలో ఒక కధ పబ్లిష్ కాబోతోంది ….ఈ కధలో కులగోత్రాలగురించి ఎందుకు ఎత్తలేదో ., ఆ కధ వివరిస్తుంది (అది మీకు నచ్చనూ వొచ్చు , నచ్చకనూ పోవచ్చు )…నేను ఈ శీర్షికలో రాసేవి కధలు కావు నేను చూసిన ,చూస్తున్న …..కొన్ని జీవితాలు ….అయ్యా ఒక కాంచనమాల, ఒక గిరిజ, ఒక .కస్తూరి శివరావు ….అంతెందుకూ పద్మశ్రీ చిత్తూరు నాగయ్య ….వారందరూ పోరాటపటిమ కలిగినవారేగా!!…సరే నేను సినిమా కధకుడ్ని కాదు , కేవలం పాటల రచయితని …నేను రాసే కధలు వేరు …..వాటిని మీరు ఇతర పత్రికలలో చూడొచ్చు …..ఇక్కడ నేను ఒక ”””’సాక్షి””’ని మాత్రమె …..ఐ యాం జస్ట్ రికార్డింగ్ అంతే …..మరో విన్నపం …..పాతకులందరికీ …..ఇటువంటి జీవితాలని ఎలా తిరిగి”” గాడి లోకి ””తేవోచ్చో…,,,, ఒక చక్కని పరిష్కార మార్గాన్ని సూచిస్తే …నేను ఎంతో సంతోషిస్తాను …..ఎందుకంటే ఈ untold stories వరకూ నేను ఒక టైపు రైటర్ ని మాత్రమె …….kvr గారూ….మీస్పందన నిజంగా నాకు ఆనందాన్నే కలిగించింది ఎందుకంటే మీరు విమర్సించిందీ ఒక ”’కన్ సర్న్””’తోనేగా ……ధన్యవాదాలతో భువనచంద్ర

      • BHUVANACHANDRA says:

        శ్రీ kv రమణ గారూ నమస్తే … కులం గురించి చెప్పొచ్చు …..అయితే దానివల్ల ఉపయోగం లేదు అనిపించింది నిజంగా స్వర్ణ కుమారికి చాలా సంవత్సరాలు తన కులం ఏమిటో తెలియదనీ , తెలిసాక చాలా బాధ పడ్డాననీ అన్నది . పొతే ,కధ వరకూ కులం గురించి చెప్పాలి అంటే , నిజంగా ఆ కులం ఏమిటో చిబితేనే గానీ కధకి పరమార్ధం సిద్దించదు అనుకుంటే …..తప్పక చెప్పాల్సిందే !…కాదనను … ….త్వరలో ఒక కధ పబ్లిష్ కాబోతోంది ….ఈ కధలో కులగోత్రాలగురించి ఎందుకు ఎత్తలేదో ., ఆ కధ వివరిస్తుంది (అది మీకు నచ్చనూ వొచ్చు , నచ్చకనూ పోవచ్చు )…నేను ఈ శీర్షికలో రాసేవి కధలు కావు నేను చూసిన ,చూస్తున్న …..కొన్ని జీవితాలు ….అయ్యా ఒక కాంచనమాల, ఒక గిరిజ, ఒక .కస్తూరి శివరావు ….అంతెందుకూ పద్మశ్రీ చిత్తూరు నాగయ్య ….వారందరూ పోరాటపటిమ కలిగినవారేగా!!…సరే నేను సినిమా కధకుడ్ని కాదు , కేవలం పాటల రచయితని …నేను రాసే కధలు వేరు …..వాటిని మీరు ఇతర పత్రికలలో చూడొచ్చు …..ఇక్కడ నేను ఒక ”””’సాక్షి””’ని మాత్రమె …..ఐ యాం జస్ట్ రికార్డింగ్ అంతే …..మరో విన్నపం …..పాఠకులందరికీకూడా …..ఇటువంటి జీవితాలని ఎలా తిరిగి”” గాడి లోకి ””తేవోచ్చో…,,,, ఒక చక్కని పరిష్కార మార్గాన్ని సూచిస్తే …నేనూ ఎంతో సంతోషిస్తాను …..ఎందుకంటే ఈ untold stories వరకూ నేను ఒక టైపు రైటర్ ని మాత్రమె …….kvr గారూ….మీస్పందన నిజంగా నాకు ఆనందాన్నే కలిగించింది ఎందుకంటే మీరు విమర్సించిందీ ఒక ”’కన్ సర్న్””’తోనేగా ……ధన్యవాదాలతో భువనచంద్ర

  • Gorusu says:

    భువనచంద్ర గారూ … మళ్ళీ మనసు కెలికారు . స్వర్ణ కుమారి పూర్తి జీవితం మనకేల ? ఆమె ఆశావహ ద్రుక్పధంతో కడవరకు నవ్వుతూ జీవించడం – మనకు ఒక స్ఫూర్తి కావాలి. ఎప్పట్లానే మీ వచనం నల్లేరు మీద నడక. ధన్యవాదాలు – గొరుసు

    • BHUVANACHANDRA says:

      గొరుసు గారూ నమస్కారం ….మీ మాటలు మరోకద రాసే ప్రోత్సాహాన్నిచ్చాయి …ధన్యవాదాలతో ….భువనచంద్ర

  • Radha says:

    భువన చంద్ర గారు, చదువుతుంటే కళ్ళు చెమర్చాయి. మనుషులు ఆ స్థితికి చేరితేనే అలా ఎప్పుడూ నవ్వుతూ ఉండగలరు. ఆదర్శ వంతంగా బ్రతుకుతున్న ఆమె జీవితం ధన్యం. ఆమె మీకు కనిపిస్తే అడిగినట్లు చెప్పండి.

    • BHUVANACHANDRA says:

      రాధ గారూ …..ఒక సందర్భంలో ,,,నేను ఆమే నే స్ఫూర్తి గా తీసుకున్నా …..నిర్మలమైన, స్వచ్చ మైన ,మనసు లోంచి వొచ్చే ”’నవ్వు”’ భగవంతుని ఆసీస్సులా ఉంటుందని తెలిసింది …….మీకు నా ధన్యవాదాలు ….నమస్సులతో భువనచంద్ర

  • ఆర్.దమయంతి says:

    పాఠ్య పుస్తకాల్నించి కాకుండా, కఠిన జీవితానుభవాల్నించి నేర్చేదే అసలైన పాతం. జీవించడానికవసరమైన అసలైన లెసెనదే. బహుశా, అదే జీవన వేద సారం అనుకుంటా! – అందుకు తార్కాణమే ఈ మీ కథ భువనచంద్ర గారు! చాలా బావుంది.
    మీ రచనలో ప్రత్యేకతేమిటంటే – శైలి లో కొత్త పరుగుంది. చకచకా వేగంగా చదివించేస్తుంది. + చప్పుడు చేయకుండా చొరబడిపోతూ..ఓ వేదాంత ధోరణి – పాఠకుని మనసుకి ఒక గొప్ప ప్రశాంతతనిచ్చిపోతుంది. సడి చేయని మది అలలెరుగని నదిలా మారిపోతూ..
    :-)
    శుభాభినందనలతో..

    • BHUVANACHANDRA says:

      దమయంతి గారూ నమస్తే ……..మీ మాటలు చాలా ఆనందాన్ని ఇచ్చాయి ….. మీకు నా ధన్యవాదాలు …..నమస్సులతో …భువనచంద్ర

  • Kosuri Uma Bharathi says:

    భువనచంద్ర గారు,

    Heart touching and heart warming real life story sir,

    your realistic and sincere approach and narration of events is reaching out…..
    Thank you…

    • BHUVANACHANDRA says:

      కోసూరి ఉమా భారతి గారూ నమస్తే ….మీరు ఇచ్చిన ప్రో త్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాల తో ….. భువనచంద్ర

  • Dr.Ismail says:

    ఆ చివరి రెండు వాక్యాలు>>> ఏం తీసుకుపోతామని పోగు చేసుకోవాలీ? ఆఖరికి అనుభవాలతో సహా…!” <<< అక్షర సత్యాలు. ఎవరో ఒకరు రాయకపోతే ఇలాంటి ఎన్నో కథలు కాలగర్భంలో కలిసిపోతాయి. ఇవి పంచుకొంటున్నందుకు మీకు నా ధన్యవాదాలు.

    • BHUVANACHANDRA says:

      DR .ఇస్మాయిల్ సాబ్ …..ఎలా వున్నారు ….మీకు నా మనః పూర్వక ధన్యవాదాలు …..నమస్సులతో …భువనచంద్ర

  • శ్రీ says:

    భువనచంద్ర గారు, కదలకుండా పూర్తిగా చదివించేసారు. ఆమె ఆస్తి పోగొట్టుకున్నా దేవుడిచ్చిన వరం ఆమెతోనే ఉంది, అది ఉన్నన్నాళ్ళు ఆమెకి బతుకు బండి లాగడం పెద్ద సమస్య కాదేమో? పాకుడురాళ్ళు చదివినపుడు కూడా ఇలాంటిదే ఏదో బాధ…..

    • BHUVANACHANDRA says:

      శ్రీ గారూ నమస్తే …..మీ చల్లని మాటలకు నా ధన్యవాదాలు …..ఒకరు అడిగారట .”’ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైనది ఏదీ?””అని . ఎల్లప్పుడూ దేనికీ చలించక సంతోషం గా ఉండగలగటమే అత్త్యంత KASTAMAI
      న Pపని …….చాలా సాధన కావాలి ……….నమస్సులతో భువనచంద్ర

  • kv ramana says:

    ధన్యవాదాలు సార్. పొడిగిస్తున్నానని అనుకోకపోతే ఒకటి, రెండు మాటలు. కులం గురించి చెప్పాలని నేను అన లేదండీ. మీరు కులం గురించి ఎత్తారు కనుక, కులం తెలియదని ఆమె అనడం నమ్మే విధంగా లేదనన్నాను. నా కులం గురించి తెలిసి బాధపడ్డాను అని స్వర్ణకుమారి అన్నట్టు ఇప్పుడు మీరే చెప్పారు కనుక ఆమెకు తన కులం తెలుసు అన్నట్టేగా? మీరు రిపోర్టింగ్ మాత్రమే చేశాను అన్నప్పుడు, ఆ రిపోర్టింగ్ లో ఒక వాస్తవం తప్పిపోయినట్టేగా? మీది రిపోర్టింగ్ అనడం కూడా నాకు అంత కన్విన్సింగ్ గా లేదండీ. ఆమె జీవితాన్ని, ఆమె నవ్వునీ, ఆ నవ్వు వెనకాల ఉన్న వేదాంతాన్ని మీరు వ్యాఖ్యానిస్తున్నారు కూడా. ఇక ఆమె మలయాళీ భర్త ఏమయ్యాడో, ఆ పెళ్లి ఏమైందో మీరు చెప్పలేదు. ఒక నాటకంలో గోడమీద తుపాకీ కనిపిస్తుంటే అది ఎప్పటికైనా పేలాలి అంటారు నాటక విమర్శకులు. మీరు ఆమె వివాహం గురించి చెప్పారు కనుక అదేమైందో చెప్పాలని అనడమే నా ఉద్దేశ్యం. మీరు పాటల రచయిత అయినా కథా చర్చల్లో కూడా పాల్గొన్నట్టు చెప్పారు కనుక నా అభిప్రాయాలను అలాగే తీసుకోండి సార్.

    • kv ramana says:

      సారీ… మీరు రికార్డింగ్ అన్నారు. నేను రిపోర్టింగ్ అని పొరబడ్డాను. అయినా రెండూ ఒకటే అనుకుంటాను.

      • BHUVANACHANDRA says:

        kvr గారూ ఆవిడ మలయాళీ భర్త ఈమధ్యే ,తన లేటెస్ట్ భార్య ఇచ్చిన విడాకుల నోటీసు పట్టుకుని లాయర్ల చుట్టూ తిరుగుతున్నాడని ఒక dubbing సినిమా నిర్మాత నాతొ చెప్పారు. మరో విషయం నిన్ననే చెప్పాను,,,,”, మీ అభిప్రాయాలను మంచిగానే తీసుకున్నాను ”’…అని. .అయినా ., ..విమర్శఅందుకో ని కధ ఉప్పులేని పప్పు లాంటిదని పెద్దలు అన్నారుగదా ….ధన్యవాదాలతో ……భువనచంద్ర

  • వ్యాసం తొలి పదం మా పక్కూరిపేరుతో ఉండటం, మీరు వ్యాసకర్తగా ఉండటం – ఈ రెండు కారణాలే నన్నీ వ్యాసాన్ని చదివించాయి. కథనంలోకి తాయమ్మ కేరకట్ రాగానే గుండెలో ఏదో తెలీని బాధ మొదలయ్యి చివర వరకు పెరుగుతు వచ్చింది. మీ మాటల్ని “వై కలెక్ట్ వెన్ యూ కెనాట్ కేరీ” అని ఆవిడ కోట్ చేసి యథార్థంలోకి లాక్కొచ్చారు!

    నిజమేగా? “ఏం తీసుకుపోతామని పోగు చేసుకోవాలీ? ఆఖరికి అనుభవాలతో సహా…!”
    నేనూ నవ్వుకున్నాను. హేట్స్ ఆఫ్ డియర్ భువన చంద్ర గారూ. మాకీ వ్యాసం అందించినందుకు.

    • BHUVANACHANDRA says:

      భాస్కర్ గారూ నమస్తే …మీ స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది …..మీకు నా మనః పూర్వక ధన్యవాదాలు ….నమస్సులతో ….భువనచంద్ర

  • Tejo Karthik says:

    ఆహా చాలా కాలం తరువాత మంచి కథ చదివానండీ మీ పుణ్యమా అని..

    మీరు వ్రాసిన ఈ లైను నాకు చాలా చాలా బాగా నచ్చింది…
    ” స్వర్ణకుమారి నిజంగా ‘ఆశా బ్రాండ్ అగర్‌బత్తీ’. ఆశల సువాసనని వెదజలుతూ వుండే నిజమైన మనిషి. “

  • nmraobandi says:

    ఒకడు గారు కే వి రమణ గారు ప్రాక్టికల్ గా ఆలోచించి సంధించిన ప్రశ్నలు, మీరిచ్చిన సమాధానాలు కూడా సమాంతరం గానే వున్నాయి. రమణ గారి ప్రశ్నలు కూడా నిజాయితీ ప్లస్ మీరన్నట్లు ఒక కన్సర్న్ తో కూడినవే. బాధాకరమైన విషయమేమిటంటే మనం స్పందించే చాలా విషయాలకు సూటియైన పరిష్కారం మనం సూచించగలగడం స్పందించినంత ఈజీ కాదు. స్పందన ఇన్ స్టంట్. సొల్యూషన్ కాన్ స్టంట్. ప్లస్ చెప్పినంత వీలుగా ఆచరణ సాధ్యం కూడా కాదు. జరుగుతున్న, చూస్తున్న సమస్యలను ఎత్తి చూపగలం కానీ పరిష్కారం మన చేతుల్లో ఉండదన్నది వాస్తవం. అదొక పరిష్కరించలేనటువంటి జఠిల సమస్య – ఎప్పటికీ. కాలంతో పాటు కదులుతూ భావావిష్కరణం చేయడమే మనకు చేతనైన పని. విధాత అనే ఒక అవతారం గనుక ఉండుంటే ఇవన్నీ ఆయన పరిష్కరించవలసిన విషయాలు. అన్నింటా – ఎన్నెన్ని నేరాలు, ఎన్నెన్ని ఘోరాలు? ఆయనకేమో ఇలాంటి వ్యధార్ధ (యధార్ధ) సమస్యలు పట్టించుకునే తీరిక వున్నట్లు పెద్దగా రుజువులు కనబడవు.
    (గుళ్ళలో అటెండన్స్, హుండీ కలెక్షన్స్ ఏమన్నా తగ్గితే గానీ పట్టించుకోడేమో మరి, తెలియదు).

    పైన ఉదహరించినట్లు ఓ చిత్తూరు నాగయ్య, కస్తూరి శివరావు, కాంచన మాల, గిరిజ, రాజనాల, టీ ఎల్ కాంతారావు, రమాప్రభ, స్వర్ణ కుమారి గార్ల – ఇంకా నాకూ మీకూ తెలియని ఎందరెందరో సినీ, ఇతర రంగాల వెలిగి, కనుమరుగై, కాలం వాతబడి, జీవితంలో గెలిచి, ఓడిపోయిన వారిని స్మరించి, స్పందించడం తప్ప మనదగ్గర ఇంకేం పరిష్కారం వుంది. అలా బ్రతుకుతూ పోవడం తప్ప …

    స్వర్ణ కుమారి గారి శేష జీవితం మరిన్ని సమస్యల బారిన పడకుండా నిశ్చింతగా జరగాలని కోరుకోవడమొక్కటే మనం ప్రస్తుతం చేయగలిగిన ప్రాక్టికల్ పరిష్కారం (దాన్నొక పరిష్కారం గానే మనం భావిద్దాం – ఇంకేం చేయలేం గనుక).

    ఈ సమస్య తో గానీ, ఈ వాదోప వాదాలతో సంబంధం ఉన్న ఎవరినీ గానీ నొప్పించే ఉద్దేశ్యం నా ప్రయత్నం లో లేదు – ఒక వేళ అలాంటి, తెలియక చేసిన తప్పిదముంటే – క్షంతవ్యుడిని.

    with regards …
    to all …

    • BHUVANACHANDRA says:

      ధన్యవాదాలు న్మ్రావు gఆరూ ….చాలారోజులతరవాత చూడడంతో . …. reply……ఆలస్యం గా ఇస్తున్న౦ దుకు మన్నించాలి ……నిజంగా మీ మాటలు ఎంతో సాంత్వన కలిగించాయి …..ఒక్కొక్కరి జీవితాన్నీ చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది వారు మనకి తెలుసనుకుంటాం నిజంగా లోతుకు వెడితే వారిలోనున్న ”’వారు”’మనకి అపరిచితులే …..మీకు మరోసారి థాంక్స్ …..నమస్సులతో భువనచంద్ర

      • BHUVANACHANDRA says:

        టైపు చెయ్యడం లో తప్పులు దొర్లాయి nmrao గారూ మన్నించండి

  • nmraobandi says:

    “మరి.. టిఫిన్లకి..”
    “ఓహ్.. డబ్బు సంగతా? నేను ఎవరైనా టిఫిన్లు కావాలని అడిగితే, వారికోసం తయారు చేసి పెట్టేదాన్నే కానీ.. హోటల్ పెట్టినదాన్ని కాదు.. నా దగ్గర ఇంకా కొంత సొమ్ముంది. అదీ అయిపోతే బహుశా హోటల్ పెట్టాల్సి వస్తుందేమో.. ప్రస్తుతానికి కాఫీ టిఫెన్ల వరకూ ఉచితమే…!” పకపకా నవ్వింది …

    అలా నవ్వగలిగిన స్వర్ణ కుమారి గారి మహోన్నత నిస్వ్వార్ధ వ్యక్తిత్వానికి జోహార్ …
    సమాజంలో ఇంకా ఇలాంటి ఉన్నతుల్ని కూడా ఓ మూల బ్రతకనిస్తున్న ఈ సమాజానికి కూడా జోహార్ …

  • Krishna Kumar says:

    భువన చంద్ర గారు…మీ untold stories కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాం. తరువాయి కథ ను త్వరగా రాస్తారని కోరుకుంటూ…
    కృష్ణ కుమార్
    USA

    • BHUVANACHANDRA says:

      ధన్యవాదాలు కృష్ణ కుమార్ గారూ ….. రాస్తానండీ త్వరలోనే ….

  • m.viswanadhareddy says:

    కులం తెలియదనడం ఎంతో నిజం . అది నా స్వానుభవం . నా మిత్రుడు ఒకాయన వున్నాడు 30 ఏళ్ళ స్న్హేహం .. అతని కులం ఇప్పటికి నాకు తెలియదు ఆ అవసరం నాకు కలగలేదు .చెన్నై ఒక మాన్షన్ లో మీరు వున్నప్పుడు నాకు కొంత పరిచయం మీరు .విజయచందర్ అసిస్టంట్ డైరెక్టర్ క్రిష్ట ద్వారా . అంతంత మీసాల్లొ అంత మంచి పాటలు పెట్టుకున్నారని అప్పుడు నాకేం తెలుసు .ఇప్పుడు నేను ఒక చిన్న డైరెక్టర్ అయ్యాను సార్ http://www.youtube.com/watch?v=NZRfPRade-8 ప్లీస్ ఈ లింక్ చూడండి యు ట్యూబ్ లో

    • kv ramana says:

      చర్చ పొడిగించడం కోసం కాదు కానీ దయచేసి కాస్త లాజికల్ ఆలోచించండి విశ్వనాథరెడ్డి గారూ, మీ కులం మీ మిత్రునికీ, మీ మిత్రుని కులం మీకూ తెలియకపోవచ్చు. తెలియాల్సిన అవసరం లేదు. కానీ మీ కులం మీకు, మీ మిత్రుని కులం మీ మిత్రునికి తప్పకుండా తెలుస్తుంది.

      • kv ramana says:

        పేరులోనే రెడ్డి, చౌదరి,శర్మ, శాస్త్రి ఉన్నప్పుడు కులం తెలియకపోవడం అనేది ఉండదు. పూర్వమ్ రుష్యశ్రుంగుడు అనే ముని అడవిలో ఒంటరిగా పెరిగాడట. అతనికి ఆడ, మగ తేడా తెలిసేది కాదట. ఈ కుల భారతం లో కులం తెలియదనేవారిని ఇలాంటి అడవి మనిషితో పోల్చడం తప్పు కాదనుకుంటాను. కులం తెలియదనడం మరీ హిపొక్రసీ. అలా ఎవరైనా అంటే సినిమా కత చెబుతున్నారనుకోవాలి.

  • BHUVANACHANDRA says:

    సో నైస్ విశ్వనాధ రెడ్డి గారూ …….తప్పక చూసి మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను thank యు సో మచ్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)