అధివాస్తవ విస్మృతి

అధివాస్తవ విస్మృతి

ఈ నిరామయ సాయంత్రాన

ఎవరిని గుర్తుకు తెచ్చుకొని

రోదించను?

ఎత్తైన ఈ రెండు పర్వతాల మద్య

లోయలో

గుబురుగా ఎదిగిన పొదలతో

నా ఒంటరి సమాధి కప్పివేయబడివుంది

మెల్లగా, భ్రమలాగా

మేఘాలు భూమిని రాసుకొని వెళుతున్నాయి

ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు

కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు

ఈ రోజెవరో నా అజ్ఞాత సమాధి మీద

రెండు పుష్పాలు ఉంచారు

రెండు కన్నీటి బొట్లూ రాల్చారు

ఆమె ఎవరో గుర్తులేదు

ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు

కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ గుర్తు లేదు

-శ్రీరామ్

శ్రీరామ్

Download PDF

3 Comments

  • balasudhakarmouli says:

    సంక్లిష్ట సామాజిక దశలో వొక మానసిక కల్లోలం సంగతి. కల్లోలాలన్నీ వ్యక్తీకరణలే. కవిత్వాలే. గాథలే !

  • balasudhakarmouli says:

    వొక గాఢమైన వ్యక్తీకరణ ఈ కవిత !

  • david says:

    బాగుంది శ్రీరాం గారు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)