ఈ నలుపు ఒక తెలియని లోతు, అనిశ్చితమైన రేపు.కాంతి రాహిత్యమే చీకటి
ప్రేమరాహిత్యమే భయం ఇంద్రియాల చుట్టూరా చీకటి ఆ నీడల్లోంచి తొంగి చూస్తున్నదేమిటి? దుష్టత్వమా? ప్రమాదమా? గుండెల్లో గుబులు, నుదుటి మీంచి జాల్వారుతూ భయం. నెత్తుటెరుపు చారల్లోంచి మాత్రమే కాంతిని చూస్తున్నప్పుడు ఆశ ఏదీ? ఎక్కడా?! మన అశాశ్వతత్వానికి మనమే ఎదురేగుతున్న క్షణాలివి. నిశ్శబ్దాన్ని విను. ఆదిమ భయాన్ని తట్టి చూడు. భయం అనే భయాన్ని తెలుసుకో. |
భయానకం!

పెయింటింగ్ ఇంకా కవిత కూడా చాలా బాగున్నాయి
“కాంతి రాహిత్యమే చీకటి , ప్రేమరాహిత్యమే భయం ” – ఎన్ని సార్లు చదివానో మమత గారూ , ఈ ఒక్క వాక్యాన్నే!! దిగులు కలిగించే చీకటిని, భయాన్ని, సున్నితంగా విడమరచిన మీ అక్షరాల్లో చదవడం , ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంది. ఇక ఏ భయమూ లేదు. TQ Mam .
చివరగా
నలుపు తెలుపుతున్నదాని వైపు సూర్యుడి గుండెతో చూడు …..
……….
బంగారు తల్లులకి కొంచం ఆకుపచ్చ దైర్యాన్నికూడా ఇవ్వండర్రా
బంగారు
పైన నాకామెంట్ చివర బంగారు అని పొరపాటున రిపీట్ అయింది…నా టైపుతప్పుకి క్షంతవ్యుణ్ణి