1.
అనుమతి లేకుండా ఎందుకలా చూస్తున్నావ్
అని జాబిల్లి అడిగితే ఏం జవాబు చెప్పాలో తెలీదు .
కాలిపోతున్న దీపపు వత్తి కాంతి లో
చెవికమ్మల్ని చూసి తృప్తిగా నిదురపోయే బేషరం ని నేను
బేషరం వద్ద జవాబు ఉండదు
2
బేషరం
దేవుడి గురించి ఆలోచిస్తుంటే
తెలియనేలేదు ..
ఎప్పుడు నీ కురులు తెల్లబడ్డాయో !
తిరిగి నేనే సరిచేసుకుంటాను
ఆ కురులని ఆ కుచ్చీళ్ళని
నువ్వు తరువాత లేచి వెళ్ళి
దేవుడి గది శుభ్రం చేసుకుంటూ ఉండు
4
నీళ్ళు తగిలితే తడిచిపోయే
చిన్న నిప్పురవ్వకు కాలిపోయే
చిన్న చెద పురుగుకు తలుచుకుంటే కనుమరుగయ్యే
ఓ పలుచని కాగితం ముక్కమీద
సంతకం పెడితే
మనకు ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగడం ఏమిటో
అర్ధం పర్ధం లేని తెలివైన దరిద్రం
5
రోజుల తరబడి కాల్చిన
ఇటుకలతో గోడలు కట్టుకున్న ఏం లాభం
వేకువ జాము కాకమునుపే
కమిలిపోయే పువ్వులు ఎలాగో వాడిపోవాల్సిందే
6
ఆజ్ఞను పాలించేవాడిని
ఆజ్ఞల్ని ఎలా ఇవ్వగలను
నీకు బేషరం నా కౌగిళ్ళు ముద్దులు
నా చేతి రెండు ముద్దలు ఇవ్వగలను
7
ఒప్పించడం కోసం ఈ సూర్యుడిని వాడుకోలేను
కొన్ని రాత్రులు భూమ్మీద ఈ తలకు
నీ గుండెల మీద ఆశ్రయం కావాలి అంతే
ఏ వృత్తలేఖిని తో గుండ్రని ఓ సరిహద్దు రేఖ
గీయబడుతుందో కాని …
దాని నుంచి బయటకు కాలుమోపడం అయ్యేపని కాదు
8
వాన పడిన ఓ రాత్రి
మసిపట్టి ఆరిపోయిన దీపపు బుడ్డిలో
బేషరం రెండు మిణుగురులు కొద్దిసేపు అలా అలా తిరిగి
ప్రళయం రాకముందే
ఎప్పుడు బయటకు వెళ్ళిపోయాయో ఏమో ..!
9
లోకాన్ని కాపాడే దేవుడికి
పోలీసుల రక్షణ ఉన్నట్లు
కొన్ని హృదయాలకు బయటి నుంచి ఎవరు కాపలా ఉండరు
10
నీ ముఖం అద్భుతంగా ఉందంటే నువ్వు నమ్మలేకపోవచ్చు బేషరం
అది నా జీవితాని మాత్రం అద్భుతంగా మార్చింది ఇది నేను నమ్ముతాను.
– సైఫ్ అలీ గోరే సయ్యద్
ప్రియమైన సైఫ్ ,
4 లోని వ్యంగ్యమూ, 7 లోని తాత్త్వికత మనోహరంగా ఉన్నాయి. ముఖ్యంగా “ఏ వృత్తలేఖిని తో గుండ్రని ఓ సరిహద్దు రేఖ గీయబడుతుందో కాని … దాని నుంచి బయటకు కాలుమోపడం అయ్యేపని కాదు “… అన్నది ఎంత అందమైన భావన. మీ బేషరంలు కూడా అలాంటి వృత్తాలే గీస్తున్నాయి. వాటిలోంచి కాలుబయటపెట్టడం సాధ్యం కావడం లేదు.
హృదయపూర్వక అభినందనలతో
సర్ , సలాం వలెకుం . మీరు ” ప్రియమైన సైఫ్ ” , అన్నారు అది చాలు . <3
మనిషికి మనిషి మీదలేని నమ్మకాన్ని
అర్ధం పర్ధం లేని తెలివైన దరిద్రం కాగితం మీధ పెట్టటం ఏంటీ?
ఇది ఒక విషాదాత్మక వ్యంగ్యం! కాగితపు పువ్వు!
@ రోజుల తరబడి కాల్చిన
ఇటుకలతో గోడలు కట్టుకున్న ఏం లాభం!
వేకువ జాము కాకమునుపే
కమిలిపోయే పువ్వులు ఎలాగో వాడిపోవాల్సిందే @
కఠోర జీవిత సత్యం!
చాలా బావుంది.
తిరుపాలు జి :)
సైఫ్ గారు చాలా బాగా రాసారు. ప్రతి యూనిట్ కోట్ చేయాల్సిందే. నాకు చాల నచ్చేసాయి.
మెర్సీ మార్గరెట్ జి :)
ప్రశ్నల పరిధి దాటిన జవాబులైనపుడు.. ఇక వేరే జవాబులేందుకు
ఎప్పటిలా మీ బేషరమ్ ఈజ్ సో స్వీట్.. అండ్ గ్రేట్లీ పొఎటిక్
జయశ్రీ నాయుడు జి స్వీట్ అన్నారు అది చాలు …గ్రేట్ వదిలెస్తున్నా ఎఅమనుకోవద్దు <3
ప్రతి లైను లోనూ ఘాడత. చాలా బాగుంది సైఫ్ జీ.