తరంగ

దేవుడు ,కర్మ

దేవుడు ,కర్మ

నువ్వు తెచ్చిన ఆ పెట్టెలో పట్టేట్లు నన్ను చెప్పమంటావ్ . అరూపాన్ని అందులో పెట్టడమెలాగొ నాకు చేత కాదు లెక్కల పరీక్ష పెట్టావ్ నేను ఫెయిలయ్యాను దిగులుపడి  చివరికన్నాను ”మొదట ఈ పాఠాలు…

Read More
వెన్నెల వైపుగా

వెన్నెల వైపుగా

వెర్రిగా ఊగిపోతూ ఒళ్ళంతా గుచ్చుతూ అడుగడుగునా చీకటి ఊడలు గుర్తుచేస్తాయి ఒంటరి ప్రయాణాన్ని దిక్కుతోచక దడదడలాడుతుంది గుబులెక్కి గుండె ఇక కరిగిపోదామనే అనుకుంటుంది గుప్పున పొంగుతున్న పొగల్లో విశ్వాంతరాలనుంచి రాలిపడిన ఒకే ఒక్క…

Read More
మనసుపటం

మనసుపటం

1 మొక్కలకి నీళ్ళు పోశాను కుక్కపిల్లకు అన్నం పెట్టాను పిట్టలకు నీళ్ళు పోసుంచాను తల పగిలి పోతోంది; మళ్ళీ పడుకుంటాను గంట తర్వాత లేపుతావా? తలకి యెర్రటి స్కార్ఫ్ కట్టుకుని అమృతాంజనం వాసనతో…

Read More
నీ గదిలో వెలిగే దీపం

నీ గదిలో వెలిగే దీపం

ఆర్తిగా ఉదయించే ప్రతీ క్షణానికి అటువైపు, చేయి విదిలించుకుంటూ నీ నిరాశ పట్టు బిగిస్తూ ఇటువైపు మరో ఆశ మధ్యలో సన్నటి గీత ఒకటి మెరుస్తూనే ఉంటుంది చూసీ చూడనట్టు దాటే ప్రయత్నం చేసి బుద్ధి ఓడిపోతుంటుంది పగులూ రాత్రీ ,…

Read More
చేరతాను, కానీ..

చేరతాను, కానీ..

అయ్యలారా! మరీ సిగ్గులేకుండా అడుగుతున్నారు కదా సరే, మీ కోరిక ప్రకారం మీ మతంలో చేరతా, మీరు చేయమన్నవన్నీ చేస్తా.. కానీ, ముందు కొన్ని విషయాలు తేలాలి కొన్ని గట్టి హామీలు కావాలి..!…

Read More
ఇలా ఎప్పటికప్పుడు…

ఇలా ఎప్పటికప్పుడు…

మనస్సు కకావికలం అయినప్పుడు కేవలం నేనొక శకలం లా మిగిలినప్పుడు ఒక చిన్న మాట కూడా తుత్తునియ చేస్తుంది కానీ మరుక్షణం లోనే నేను ముక్కలు ముక్కలుగానైనా మళ్ళీ జీవం పోసుకుంటాను ,…

Read More
నిషేధం గురించే మాట్లాడు

నిషేధం గురించే మాట్లాడు

  కవికీ కవిత్వానికి నిషేధాలుండకూడదంటాను నీడ కురిపించే చెట్ల మధ్యో ఎండ కాసే వీధుల్లోనో గోళీలాడుకుంటున్న పిల్లాణ్ణి బంధించి చేతులు వెనక్కి విరిచి కణతలపై గురిచూసి తుపాకీ కాల్చకూడదంటాను కవీ పసిబాలుడే –…

Read More
విక్రమ్ బేతాళ్!

విక్రమ్ బేతాళ్!

  మనకేం హక్కుంటుంది, ఒకరి మీద ఫిర్యాదు చేయడానికి? సమాధానం కాలేనివారికి ప్రశ్నగా మారే సందర్భమెలా చిక్కుతుంది?   అడుగులన్నీ జాడల్ని మిగిల్చేవి కావు. ప్రయాణాలన్నీ జ్ఞాపకాల్ని రాల్చేవి అయ్యుండాల్సిన అవసరం లేదు….

Read More
అక్షరం ఆత్మహత్య చేసుకోదు

అక్షరం ఆత్మహత్య చేసుకోదు

అన్నా!పెరుమాళ్ మురుగన్  రచయితగా మరణించానన్నావు  అక్షరాల అస్త్ర సన్యాసం చేశానన్నావు  ఇంకెప్పుడూ కలాన్ని ముట్టుకోనన్నావు  రాసిన పుస్తకాలను వెనక్కి రప్పించుకున్నావు  ఆవేదనతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతానన్నావు  అన్నా!కన్నీటి మురుగన్ నీ ఆర్తికి ఏ రాతి…

Read More
అభినందనలు

అభినందనలు

మీదపడి రక్కే సమయాల్ని ఓపికగా విదిలించుకొంటూ, తోడేళ్ళు సంచరించే గాలిని ఒడుపుగా తప్పించుకొంటూ, బాట పొడవునా పరచుకొన్న పీడకలల్ని జాగ్రత్తగా దాటుకొంటూ, శీతలమేఘాలు చిమ్మే కన్నీళ్ళలో మట్టిపెళ్ళై చిట్లీ, పొట్లీ మళ్ళీ మళ్ళీ…

Read More
that’s way..!

that’s way..!

జీవితమంతా యాదృచ్ఛికమే అవుతుంది ఉదయాన్నే రాలిన మంచుబిందువులు ఆ బిందువులను అద్దుకొని మురిసిన పసిగడ్డిపోచలు ఆ గడ్డిపోచలపై వాలిన తొలిపొద్దు కిరణాలు ఆ కిరణాలు హత్తుకొని నడిచిన కొన్ని పాదముద్రలు జీవితం ఎంతోకొంత…

Read More
కుక్క అంటే ఏమిటి?

కుక్క అంటే ఏమిటి?

1 ఈ నడుమ మా చిన్ని పాప తరుచూ ప్రతీ దానికీ కుక్క అనే పదాన్ని చేరుస్తుంది   మూడేళ్ళ పిల్ల, బొత్తిగా భాషాపాటవం తెలియనిది ఇప్పుడిప్పుడే బడికి పోతూనో (హతవిధీ) పోబోతూనో…

Read More
కలబందమ్

కలబందమ్

నేలఉసిరి పరిచిన పరిచిత దారుల్లోంచీ కనకాంబరాల రెమ్మలనుంచీ లిల్లీ కోమ్మల వొంపునుంచీ కానుగ పూ పుప్పొడినుంచీ పున్నాగ సొంపు నుంచీ తాటి శిఖ పింఛాల మీంచి సంజెలో ఆమె విరబోసుకున్న బిగి బిరుసు…

Read More
లేమి

లేమి

<     అద్దాలు అక్షరాలు అనుభవించే శరీరం లేదు నీడని నీటిని తాకే నేత్రం లేదు శబ్దాలు మౌనాలు దాటే మనసు లేదు శోకాలు నవ్వులు దాచే వాక్యం రాయలేను ఎన్నటికి...

Read More
ఎప్పుడన్నా నేను

ఎప్పుడన్నా నేను

రాత్రిలా అలంకరించుకోవాలనుకుంటాను నేను అక్కడక్కడ చుక్కలతో – ఎక్కడో నెలవంకతో వెలుగుతో చెరచబడి ఉదయం నెత్తుటితో మొదలయ్యే జీవితం అవుతుంది నాది గాలిలా స్నేహించాలనుకుంటాను నేను అక్కడక్కడ స్పర్శలతో – ఇంకో చోట…

Read More
డిశెంబరు చలి గాలి పటాలు

డిశెంబరు చలి గాలి పటాలు

1 నిగ నిగ లాడుతున్న రేగుపండు, కొరికితే వకటే వగరు 2 ఎటు పోయింది మద తుమ్మెదల గుంపు! పూలు నిగారింపు కోల్పోయి విరహ నిట్టూర్పులతో తలవాల్చి… 3. మత్తు కిటికీ తెరుస్తూ…

Read More
అయ్య యాది-2

అయ్య యాది-2

ఉయ్యాల లూగింది యాద్లేదు నాకు భుజాలమీదాడింది మర్శిపోనెన్నట్కి కన్నదమ్మే గాని కంట్కి రెప్పోలె కాపాడ్త్వి నువ్వు పుట్టినకాడ్నించి   అంగడ్కి బోతప్డు   ఆఠాణ అక్కకిచ్చి అందర్కి బంచమని శెప్పిపోతుంట్వి పొద్దూక పండ్లు…

Read More
ఓ కప్పు సూర్యోదయం

ఓ కప్పు సూర్యోదయం

              తూర్పు కొండల్లో… రూపాయి కాసులా పొద్దు పొడుచుకొస్తున్నప్పుడు ఆమె… చీకటిని వెన్నెలను కలిపేసి మిణుక్ మంటున్న నక్షత్రాలను ఓ చెంచాడు పోసి కప్పుడు…

Read More
గుప్పెట్లోని సీతాకోకలు

గుప్పెట్లోని సీతాకోకలు

              1. నువ్వూ నేను ఒకరిలో ఒకరం మాట్లాడుకుంటాం ఎన్నో చెప్పాలని ఎదురొస్తానా అవే మాటల్ని కుదురు దండలా పట్టుక్కూచుని నువ్వు.   గుప్పెట్లోని…

Read More
నువ్వో నియంతవి

నువ్వో నియంతవి

  నువ్వో నియంతవి ఈ రాత్రికే రాత్రి గుడ్లను పాలించే చీకటి స్వప్నానివి నిద్దురలోనో మెలకువలోనో ఒకసారి జీవిస్తావు కళ్ళలో ఇంత ఆశను నాటుకుంటావు నువ్వో సేవకుడివి ఈ రాత్రికే యే ఒంటరి…

Read More
డియర్ రెడ్!

డియర్ రెడ్!

ఏ ఇందిరా పార్క్ దగ్గరో కొందరు బక్కపలచని స్త్రీలు ఎర్ర జెండాలని భుజాలపై పెట్టుకుని గొంతు తుపాకుల్లోంచి నినాదాల తూటాలు పేలుస్తూ సాగిపోతుంటారు డియర్ రెడ్ ! నీవు ఎప్పుడు ఇట్లా రెపరెపలాడుతూ…

Read More
తోటివారిని

తోటివారిని

  మన తోటివారిని గాజులానో, పూలలానో, కదలని నీటిపై నిదురించే చంద్రునిబింబంలానో చూడటం నేర్చుకోలేమా గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే బహుశా అద్దంలో మన ప్రతిబింబంలా మృదువుగా చూసుకొంటాం ఒకరినొకరం నిజంగా మనం తెలియనిచోట…

Read More
నీలాలు కారితే నే చూడలేను!

నీలాలు కారితే నే చూడలేను!

మోళీవాడి కనికట్టులా మొదల్లేని ఏడుపు పాయై ధారగడ్తావు జంట కంటి కంగారు నలుసై కారిపోతాను నెత్తిమీద నీళ్లకుండ జులపాల్లేని నీ జుట్టుక్కూడా లెక్కతేలని చిక్కులేస్తుంది. గంగవెర్రుల గంగాభవానిలో సత్తు కాసై మునిగిపోతాను ముందే…

Read More
పొయెమ్ లాంటి నువ్వు

పొయెమ్ లాంటి నువ్వు

  పొయెమ్ లాంటి నిన్ను నీలాంటి పొయెమ్ ను ప్రేమిస్తున్నాను 1 రాత్రి చీకటిని మత్తుగా తాగి మూగగా రోదిస్తుంటుందేమో సరిగ్గా నిద్రపట్టనే పట్టదు కలత నిద్రలో దిగుల్ దిగులుగా కొలను కనిపిస్తుంది…

Read More
రోబోసెపియన్ వరాహకస్

రోబోసెపియన్ వరాహకస్

పైసలున్నవి పోరియున్ గలదు గ్రిల్డ్ చికెన్ గుండెకాయ ఫిష్ ఫ్రై చర్మము -ఎంథిరన్! స్విమ్మింగ్ ఇన్ ద బౌల్ వాకింగ్ ఆన్ ద ట్రెడ్ మిల్ స్పర్శకు రుచి తెలియదు సోడాబిల్లేడ్ కళ్లకు…

Read More
మరల యవ్వనానికి…

మరల యవ్వనానికి…

  పరవశంతో నిలువెల్లా విరబూసిన మునుపటి పడుచుదనపు మహదానందం ఒక్కసారి నువ్వు నాకు తిరిగి ప్రసాదించు కాలం ముంచుకొచ్చిన తుఫానుగాలి ఆసాంతంగా ఊడ్చుకొనిపోతే పోనీ కొంజివురుల్నీ పచ్చనాకుల్నీ అరవిరి మొగ్గల్నీ నవనవ కుసుమాల్నీ…

Read More
రెండు పాదాల కవిత

రెండు పాదాల కవిత

    వొచ్చీరానీ అక్షరాలను కూడబలుక్కొని ఆ రెండు పాదాలూ నువ్వు రాస్తున్నప్పుడు నేను నీ పక్కనే కూర్చొని ఉన్నాను అప్పుడు చుట్టూ రాబందుల రెక్కల చప్పుడు   ఆ రెండు పాదాలే పుంఖానుపుంఖమై…

Read More
వేళ్ళ గులాబీలు

వేళ్ళ గులాబీలు

  కొత్తగా ఒక చితి చేతి వేళ్ళ మీద నుండి తెగిపడుతూ గోర్ల శవాలు భూమి నిండా నువ్వో నేనో తొక్కుతాం వాటి నీడలనో పదునుగా కనిపించే తలల తనువులనో ఇన్నాళ్ళు అందంగా…

Read More

కొన్ని అద్భుతాలంతే అలా జరిగిపోతాయి!

  అదెప్పుడూ నన్ను వీడిపోదు అమ్మకొంగు పట్టుకొని వేలాడే బాల్యపు చిరునవ్వులా నా చుట్టే దాని భ్రమణం   కాలపు జరిచీర మీద అంచు కదా దాని జిలుగుకు తరుగులేదు   ఏ…

Read More
On an autumn night

On an autumn night

నీలోపలి వణుకు చూసే గదినిండా చలి నీ చేతుల్ని వెలిగించింది చీకటి ** నీ పిలుపువిని నదుల్లోపలి ప్రతిధ్వనిలో హృదయాన్ని దాచుకుని- నీ సరిహద్దులు తెలీక దిగంతరేఖని చెరిపివచ్చాను. ** నీ పరిమళం…

Read More