ఫాల నేత్రం

1514990_791134514236556_1280152144_n

నాలో నేనున్నాను.. నీవున్నావు

నేను మనమైయున్నాము-

* * *

జరిగిందేదో జరిగిపోయింది-

అలాని అది చిన్న నేరమనికాదుకానీ..

జరగాల్సినదెంతో ఉన్నందున కాసేపు దాన్ని విస్మరిద్దాం

సాకారమైన కలకు కొత్త నిర్మాణాలు నేర్పుదాం

* * *

సరే, ఎటులైతేనేమి, భీష్మ,ద్రోణ, విదుర, అశ్వత్థామలు ఓడిరి

ధర్మము నాలుగు పాదాలా నడయాడిననాడే..

‘కుంజరః’అని ధర్మజుడు కూసేయగలిగినాడు

కలియుగమ్మున-అందునా రాజకీయమ్మున..

ధర్మాధర్మ విచక్షణ తగునే విజ్నులకు?

వాలిని చంపిన రాముడు; కోకలు దోచి, కుత్తుకలు కోయించిన క్రిష్ణుడు

చేసినది లోక కల్యాణమేగాన..

ఇప్పుడు జరిగినది వేరేమి?

Red_eye_speed_painting_by_ZbassartZ

* * *

ఇన్నాళ్లూ, వేలు మనది కన్ను వారిది

ఇప్పుడు కన్నూవారిదే, వేలునూ వారిదే

కాటుకలే దిద్దుకుందురో, కలికములే పెట్టుకుందురో-

అది కన్నూ వేలూ సొంతమైనవారి సొంతయవ్వారంగందా!

ఫాల నేత్రం తెరుచుకుందిప్పుడే..

కన్ను కొత్తగా ఎరుపెక్కినప్పుడు బిగిసినవారి పిడికిలిలో..

మన వేలుకు ఎప్పుడూ చోటుంటుంది కదా!

* * *

నాలో నీవున్నాను.. నీలో నేనున్నాను..

మనమే, నీవు.. నేనైనాం!

-దేశరాజు

Download PDF

2 Comments

  • Sumanasri says:

    ప్రయత్నం బాగుందికానీ భారతంలోని అంశాలని అసమగ్ర వంకర బుద్ధితో ఉటంకించడమే బాగులేదు.

  • కూర్మనాథ్ says:

    చాలా బాగుంది. ఇపుడిక జరగాల్సింది చరిత్ర నిర్మాణం.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)