నో రిగ్రెట్స్

mohan“సాధనా ! ఇది నాలుగో పెగ్గు ! రోజు రెండు పెగ్గులే తాగుతానన్నావు “ సిగిరేట్ పడేస్తూ అడిగాను

“ Dont stop me for the day ! ఈ రోజు నిన్ను కలిసిన సంతోషంలో ఎన్ని పెగ్గులు అయినా తాగొచ్చు ! అస్సలు మత్తు రాదు “ నవ్వుతూ చెప్పింది సాధన

“ love you ! సాధి “ ఎందుకో తెలియదు సాధన చాలా ముద్దు వచ్చింది , ఒకసారి వంగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాను

“ఏంట్రా ! ముద్దు వచ్చానా “ చిలిపిగా అడిగింది సాధన .

సాధన నాకు పరిచయం అయ్యి దాదాపు 9 నెలలు కావస్తుంది . ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఒక యువతి కి నేను ఇంత దగ్గరవుతానని కలలో కూడా ఊహించలేదు, ఈ 9 నెలల కాలంలో ఎన్ని గంటలు ఫోన్ లో మాట్లాడుకున్నామో , very bold girl . ఏ విషయం అయినా చాలా లోతుగా ఆలోచిస్తుంది. ఎవ్వరి ఆసరా లేకుండా ఒక MNC bank కి వైస్ ప్రెసిడెంట్ గా ఎదిగింది . 35 సంవత్సరాలు కూడా లేకుండా ఈ స్థాయి కి ఎదగటం అంత ఈజీ కాదు, నాకు నలభై దగ్గర పడుతున్నా, నేను పని చేస్తున్న బ్యాంక్ లో నేను ఇప్పటికీ మేనేజర్ గానే ఉన్నా, మహా అయితే నలభై వచ్చే సరికి సీనియర్, మేనేజర్ స్థాయి లోకి వస్తానేమో, అదే వైస్ ప్రెసిడెంట్ కావాలంటేమరో ఐదేళ్ళు ఆగాల్సిందే.

సెక్టార్ -34 లో విలాసవంతమైన ఆపార్ట్మెంట్స్ , టెర్రాస్ ఫ్లోర్ , అక్కడనుండి చూస్తే చండీగడ్ రంగు రంగుల్లో మెరిసి పోతుంది .

గ్లాస్ లో మరో పెగ్ ఫిక్స్ చేసుకొని అలా పిట్ట గోడ వైపు కి నడిచాను, దూరంగా కనిపిస్తున్న హోర్డింగ్ లో ప్రియాంక నడుము వైపు చూస్తూ నుంచున్నాను .

“నడుము బాగుందా ! “ వెనకనుండి ఎప్పుడు వచ్చిందో సాధన, కట్టుకున్న బ్లాక్ శారీ కొంచెం పక్కకు తొలిగి నడుము వంపు అందంగా కనిపిస్తుంది,.ఒక్క నిమిషం పాటు నా చూపు నిలిచి పోయింది.

Kadha-Saranga-2-300x268

“ఓయ్ ! చూసింది చాల్లే ! చూపు మార్చు “ పెద్దగా నవ్వుతూ నా చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకుని భుజం మీద తల పెట్టి నా పక్కనే నుంచుంది, నిజమే, సాధన ముఖంలో ఎప్పుడూ లేని ఒక వెలుగు కనిపిస్తుంది, సాధన ను నేను కలవటం ఇదే మొదటి సారి అయినా గత 9 నెలలుగా కొన్ని వందల ఫోటోస్ లో , కామ్ లో ఎన్ని సార్లు చూశానో , కాబట్టి ఆమె లో చిన్న తేడా కూడా గుర్తించగలను , ఎప్పుడూ లేని ఒక సంతోషం లో ఎందుకు ఉంది అది నా భ్రమా ! సాధన ను కలవటం నాకు సంతోషం కాబట్టి సాధన నాకు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుందా ! లేక నిజంగానే సంతోషంగా ఉందా !! ఏమో అసలు నేను ఆమె సంతోషం కోరుకుంటున్నానా ! ఆమె ద్వారా నా సంతోషం కోరుకుంటున్నానా ! ఏమో నాకే తెలియటం లేదు .

ఎప్పుడో 9 నెలల క్రితం ఒక చిన్న ప్రవాహం లా మొదలైనా మా స్నేహం ఇలా సముద్రం లా మారటానికి చాలా కారణాలున్నాయి . చక్కని రూపం, సమ్మోహనమైన స్వరం ఎందుకో మొదటి చూపులోనే ఆమె తో నన్ను ఆకర్షణ లో పడేశాయి. అదే ఆమె తో రోజు మాట్లాడటానికి నన్ను తొందర పెట్టాయి.క్రమ క్రమంగా ఆమె వ్యక్తిత్వం, ఆమె గురించి తెలిశాక, ఆకర్షణ కన్నా బలమైన మరో కారణం ఆమెను నాకు సన్నిహితురాలిని చేసింది .మరి నన్ను ఆమెకు సన్నిహితుడిగా చేసిన కారణం ఏమిటో మాత్రం నాకు అర్ధం కాలేదు, ఎవరి దగ్గరైనా గంభీరంగా ఉండే సాధన నా దగ్గర మాత్రం చిన్నపిల్లలా ఉంటుంది . అప్పటికి ఒకసారి అడిగాను “ప్రపంచంలో ఎవరిదగ్గరైనా గుంభనంగా ఉండే వారు కూడా ఒకే ఒకరి దగ్గర మాత్రం అన్నీ మర్చిపోయి , అసలు ఒక మనిషననే విషయం కూడా మర్చిపోతారు, నాకు ఆ మనిషి వి నువ్వే “ , ఇది తాత్వికత్వమో, ప్రేమ తత్వమో నాకు అర్ధం కాదు .ఏమైనా సాధన మాత్రం నాకు అపురూపమే .

ఎక్కడో నెల్లూరు జిల్లాలోని ఒక పల్లెటూరు నుండి డిల్లీ మీదుగా చండీగడ్ చేరిన సాధన ప్రయాణం నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే. మొదట్లో ఒక్కోసారి అనుమానం వచ్చేది నేను వింటున్నది సినిమా కథ కాదు కదా అని ! అన్ని మలుపులు ఎలా ఉంటాయా ఒక జీవితంలో అనే అనుమానం కలిగేది

నెల్లూరు లో ఒక మామూలు డిగ్రీ చదివిన అమ్మాయి సాధన , దిగువ మధ్య తరగతి కుటుంబం , తిండి కి లోటు లేక పోయినా, పెళ్ళికి మాత్రం లోటు ఉన్నంత కుటుంబం, డిగ్రీ చివరి సంవత్సరం అయిపోగానే కిషోర్ తో రెండో పెళ్ళికి సిద్దపడవలసి వచ్చిన నేపధ్యం. కిషోర్ ది కూడా ఒక బాదాకర జ్ఞాపకమే , పెళ్ళి అయి ఒక ఏడాది కాగానే, యాక్సిడెంట్ లో భార్య ను పోగొట్టుకోవాల్సి రావటం . ఆ యాక్సిడెంట్ లో తన భార్యతో పాటు, వదిన కూడా చనిపోవటం , తను కూడా నడుము కు దెబ్బ తగిలి ఆరు నెలల పాటు బెడ్ మీదే ఉండటం ఇవన్నీ దిగమింగలేని చేదు జ్ఞాపకాలే. పిల్లలు లేకపోవటం డిల్లీ లో మంచి హోదాలో ఉండటం , సాధన అందం చూసి వారంతట వాళ్ళే పెళ్ళి ప్రస్తావన తేవటం , అభ్యంతరం చెప్పటానికి పెద్ద కారణాలు కనపడలేదు , సాధన కి కూడా పెద్దగా కారణాలు కనిపించలేదు . కెనడా లో ఉంటున్న కిషోర్ తల్లిదండ్రులు చకచకా పెళ్ళి ఏర్పాట్లు చెయ్యటం , పెళ్ళి కావటం అన్నీ పదిహేను రోజుల్లో అయిపోయాయి . ఇప్పటికీ తనకి గుర్తే ఆ రోజు చెన్నై ఎయిర్ పోర్ట్ లో అత్తగారు సాధన కి కిషోర్ గురించి చెప్తూ “now ! its your responsibility to lead this house “ అని చెప్తున్నప్పుడు తోటమాలి పూల మొక్క చేతికిచ్చినట్లు కాక, నర్సరీ లో పూల మొక్కకొన్నాక చేతికిచ్చినట్లనిపించింది.

డిల్లీ లో పెద్ద ఇల్లు , కోరుకున్న సౌకర్యాలు, కిషోర్ అప్పటికే యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఉండేవాడు, బావ శేఖర్ మిలిటరీ లో కల్నల్ హోదా లో ఉండే వాడు . బావ గారికి ఒకతే పాప, స్నేహ, ఐదేళ్ల వయసులోనే తల్లి ని పోగొట్టుకుంది . డిల్లీ వచ్చిన మొదటి రోజు రాత్రే తెలిసింది ,యాక్సిడెంట్ లో కిషోర్ కి నడుము కి దెబ్బ తగలటం వల్ల అతను సంసారానికి పనికి రాడని, ఒక వారం పాటు మనిషి కాలేక పోయింది, కానీ ఆ విషయంలో తప్ప మిగతా ఏ విషయంలోనూ కిషోర్ లో తప్పు పట్టాల్సింది ఏమి లేదు . మిగతావాటిలో తనకు సంపూర్ణ స్వేచ్చ ఇచ్చాడు . తన మోటివేషన్ తోనే PG చేసింది ,బ్యాంక్ లో మేనేజర్ గా జాయిన్ అయ్యింది, చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి . కిషోర్ కి Kingston university లో ప్రొఫెసర్ గా పోస్టింగ్ రావటం , ఉద్యోగం కోసం ఇంగ్లాండ వెళ్ళటం వెంట వెంటనే జరిగిపోయాయి, తిరిగి ఒంటరి తనం, స్నేహ ఇప్పుడిప్పుడే తల్లి జ్ఞాపకాలనుండి కోలుకుంటుంది , రోజు బ్యాంక్ నుండి రాగానే స్నేహ తోనే కాలక్షేపం. బావ శేఖర్ గారు పోస్టింగ్ ఆగ్రా కి మారటం అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడకు వచ్చి వెళ్తుండే వాడు.

శేఖర్ ఈ మధ్య ఇంటికి రావటం ఎక్కువయ్యింది, దాదాపుగా ప్రతి వారం వస్తున్నాడు, ఆ రోజు సాధన కి బాగా గుర్తుంది , ఆ రోజు స్నేహ ఎందుకో 8 కే నిద్ర పోయింది, శేఖర్ బాల్కనీ లో కూర్చొని త్రాగుతూ ఉన్నాడు, శేఖర్ ఇక్కడకు వచ్చినప్పుడల్లా త్రాగటం అలవాటే, కిషోర్ ఉన్నప్పుడు కూడా ఇద్దరూ కలిసే తాగే వారు , కానీ ఈ రోజు మరీ ఎక్కువగా డ్రింక్ చేసినట్లున్నాడు , అడుగు తడబడుతుంది , సాధన లేచి చెయ్యందించింది, ఏదో లోకంలో ఉన్నట్లుంది శేఖర్ ప్రవర్తన, ఆసరా కోసం భుజం మీద వేసిన చెయ్యి క్రిందకు జారింది , ఒక్కసారిగా ఏదో ప్రకంపనలు, ఒంటరి తనాన్ని, నిర్లిప్తతని, జడత్వాన్ని బద్దలు కొట్టే అంత ప్రకంపన, బహుశా సాధన కి కూడా ఎక్కడో అంతరాలలోఆ కోరిక ఉందేమో, అభ్యంతరం చెప్పలేదు , ఇద్దరూ కలిసే బెడ్ రూమ్ వైపు నడిచారు

అప్పటి నుండి శేఖర్ రాకపోకలు ఎక్కువయ్యాయి, సాధన కి కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కనిపించలేదు. కెరీర్ లో కూడా పైకి ఎదుగుతూనే ఉంది, కిషోర్ ఎప్పుడైనా వచ్చి ఒక పది రోజులు ఉండి వెళ్తున్నాడు, కిషోర్ ఉన్న రోజుల్లో శేఖర్ రాకపోకలు కొంచెం తగ్గేవి .అంత కన్నా పెద్ద తేడా ఏమి లేదు, ఈ విషయం కిషోర్ కి తెలుసు అని సాధన్ కి ఎక్కడో చిన్న అనుమానం ఉన్నా ఎప్పుడూ బయట పడలేదు . స్నేహ పెద్దదవుతున్న కొద్ది ఇద్దరూ మరింత జాగ్రత్త పడే వాళ్ళు . తర్వాతర్వాత సాధనకు ఛండీగడ్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాక , స్నేహ డిల్లీ లోనే హాస్టల్లో ఉంటున్నా, శేఖర్ స్నేహ కన్నా సాధన కోసమే ఎక్కువ వచ్చే వాడు . ఇప్పటికీ వస్తూనే ఉన్నాడు .

అసలు ఒక అమ్మాయి ఇలాంటి విషయాలు కూడా bold గా చెప్పటం నాకు ఆశ్చరంగానే ఉంది. ఈ 9 నెలలలో ఎప్పుడైనా నాకు సాధన దగ్గర నుండి పోన్ రాకపోతే ఆ రోజు శేఖర్ వచ్చినట్లు లెక్క, బహుశా అలాంటి సంధార్భాలు ఒక 10-12 సార్లు వచ్చాయేమో . మరుసటి రోజు శేఖర్ వచ్చి వెళ్ళిన సంగతి సాధనే చెప్తుంది . సాధారణంగా నాకు తెలిసి ఇలాంటి విషయాలు ఎవ్వరూ బయటకు చెప్పరు,. ఒక వేళ చెప్పినా అది బావ ట్రాప్ చేశాడు అనో మరో రకంగానో తన వ్యక్తిత్వానికి దెబ్బ తగలకుండా చెప్తారు , కానీ సాధన ఎప్పుడూ శేఖర్ గురించి చెడుగా చెప్పలేదు, కానీ ఈ మధ్య అతని ప్రవర్తన లో మార్పు వస్తుందని, నేను పరిచయం అయ్యకా, ఆరాలు తీయటం, అనుమానం పెంచుకోవటం చేస్తున్నాడని చెప్పేది, అప్పటికి ఒకసారి అడిగాను

“ అలా అనుమానం ఎందుకు వస్తుంది దాదాపు 5 సంవత్సరాలుగా మీ మధ్య అనుబంధం ఉంది కదా”

“ఆరేయ్ ! బుద్దూ ! మా మధ్య ఉంది అనుబంధం కాదు, అక్రమ సంబంధం , నేను ఎప్పుడైతే అతనికి లొంగిపోయానో, అప్పుడే తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా లొంగిపోతాను అని అతను ఫిక్స్ అయిపోయాడు ! అందుకే అనుమానం “

“మరి ! నీకు అతని మీద కోపం రావటం లేదా ! ఏ అధికారం తో అతను నిన్ను అనుమానిస్తున్నాడు”

“ అనుమానించటానికి అధికారం తో పనేముంది అనుమానం ఉంటే చాలు”

saranga

“ నువ్వు నాకు అర్ధం కావు సాధనా”

ఈ సంభాషణ మా మధ్య కనీసం ఒక పది సార్లు వచ్చి ఉంటుంది

ఇక్కడ, నాకు సాధన ఒక పజిల్ లా కనిపించేది . అనుమానిస్తున్నా అతన్ని ఎందుకు అభిమానిస్తుంది, అది అభిమానమేనా ! మరేదైనా ఉందా ! నాకు అర్ధం అయ్యేది కాదు .

గత నెల రోజులుగా ఎందుకో సాధన ని చూడాలని బలంగా అనిపిస్తుంది . అదే అడిగాను సాధన ని, “అవునా ! అయితే వచ్చేయ్యి చండీగడ్” అని సరదాగా అన్న మాటలను నేను సీరియస్ గా తీసుకొని, చండీగడ్ వచ్చాను, ముందు ఆశ్చర్య పోయినా తర్వాత చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంది . ఇప్పుడు ఇలా నా భుజం మీద తన తల, ఆమె చేతిలో నా చెయ్యి, చల్లగా తగులుతున్న గాలి, జీవితం చాలా రోమాంటిక్ కదూ ! నా ఆలోచనను నాకే నవ్వొచ్చింది ! ఇప్పటిదాకా సాధన కథ గుర్తొచ్చి ఉద్వేగానికి గురైన నేను వెంటనే రొమాన్స్ గురించి ఆలోచించటం విచిత్రంగా లేదూ !

సాధన నడుము చుట్టూ చెయ్యి వేసి అడిగాను

“ ఒకటి అడుగుతాను చెప్తావా సాధనా ! “

“ నువ్వు ఒకటి అడిగితే నేను రెండు ఇస్తా , అడుగురా “

“ నీ భర్త కిషోర్ మీద నీకు కోపం లేదా “

“ఎందుకు కోపం ! అతను ఏమి చెయ్యగలడో అది చేశాడు, చేయలేని దాని గురించి ఎందుకు కోప్పడాలి “

“ మరి ! శేఖర్ మీద…..”

“ శేఖర్ మీద కూడా ఎందుకుండాలి “

“ అదే ! అతను నిన్ను లోబర్చుకోవటం, ఇప్పుడు అనుమానించటం . అతను నీ నుండి సెక్స్ కోరుకుంటున్నాడు ….. వీటన్నిటివల్ల “

“ శేఖర్ మీద కోపం ఉంటే నీ మీద కూడా కోపం ఉండాలి “”

“ నా మీదా !! ఎందుకు !!!!! “

“శేఖర్ కి నాకు ఉంది అక్రమ సంబంధం అని నీకు తెలియబట్టే నువ్వు హైదరబాద్ నుండి నన్ను వెతుక్కుంటూ చందీగడ్ వరకు రాగలిగావు, అదే శేఖర్ నా భర్త అయితే నువ్వు ఇక్కడికి రాగలిగే వాడివా ! ఇప్పుడు నీకు శేఖర్ మీద కోపం ఎందుకుంది ? ఆ అనుమానం వల్లే కదా ! నీకు శేఖర్ కి తేడా ఏముంది ! ఒకటి చెప్పు ! నీకు నామీద కోరిక లేదా ! కోరిక లేకుండా కేవలం ప్రేమతోనే ఇంతవరకు వచ్చావా ! .. అందుకే నాకు శేఖర్ మీదా కోపం లేదు, నీ మీదా కోపం లేదు “

నా చేతిలో గ్లాస్ కొంచెం వణికింది , అవును నిజమే నాకు శేఖర్ మీద కోపం ఎందుకుంది ?? సాధన కి నాకు మధ్య అతను ఉన్నాడు అనే కదా ! మరి శేఖర్ కి ఉండటం లో తప్పేముంది . నాకు సాధన మీద కేవలం కోరిక మాత్రమే ఉందా ! ప్రేమ లేదా ! రెండు కలిసి ఉన్నాయా ! ఉంటే ప్రేమ ఎక్కువుందా ! కోరిక ఎక్కువుందా !! ఏమో నాకే కన్ఫ్యూజ్ గా ఉంది, బహుశా నాకు సాధన అర్ధం కావాలంటే ముందు వీటన్నిటికి సమాధానాలు నాకు తెలియాలి . అయినా సాధన అంత తేలికగా అర్ధం కాదు. అసలు సాధన చేస్తుంది కరెక్టేనా, ఆమె కోసం నేను ఇక్కడివరకు రావటం కరెక్టేనా !

“ ok ! ok ! forget it ! ఇంకా ఏంటీ “ ఇంకొంచెం దగ్గరకు జరిగింది సాధన

“ సాధనా ! మరొకటి అడుగుతాను ఏమి అనుకోవుగా “

“ అడగటానికి డిసైడ్ అయ్యాక, ఆగకూడదు, అడుగు “

“ పోనీ ! శేఖర్ తప్పు చేస్తుంది తప్పు అని అయినా అనిపించిందా “

ఒక అడుగు దూరం జరిగి, గ్లాస్ లో విస్కీ ని సిప్ చేసింది సాధన

“ నన్ను ఆడగాలి అనుకున్న ప్రశ్న శేఖర్ పేరుతో అడుగుతున్నావా ! తప్పు అనిపిస్తే ఆ ఒక్క రోజు అనిపించిందేమో ! ఆ తర్వాత అది తప్పా ! కాదా ! అని ఆలోచింఛం, . నువ్వు అడగబోయే తర్వాత ప్రశ్న కూడా నేనే చెప్తాను, నన్ను ఇష్టపడటం కరెక్టా కాదా అనే డౌట్ నీకుంది . let me clear that my sweet ! నా జీవితంలో నేను ప్రేమించిన ఏకైక వ్యక్తివి నువ్వు. మరి శేఖర్ తో సంబంధం అంటావా ! దానికి ప్రేమతో పని లేదు. అలా అని అది యాంత్రికంగా జరుగుతుందనో అనలేను , లేదా నేనేదో ట్రాప్ లో పడ్డాను అనే self pity నో నాకు లేదు . అది అలా జరగాలి, జరిగిపోయింది. No regrets. ఇప్పుడు నీతో కూడా నేనేమీ కలిసి జీవించాలి అనుకోవటం లేదు . నువ్వంటే నాకు చాలా ఇష్టం కాదు అనను, నేను నీతో కోరుకుంటుంది మానసికమైన బంధం . అలా అని నాతో ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోవద్దు, పవిత్రంగా ఉందాం అనే కబుర్లు చెప్పను, అసలు ప్రేమ లేకుండా సెక్స్ ఉంటుందేమో కానీ, సెక్స్ లేకుండా ప్రేమ ఉండదు, నేను ఈరోజు మొదటిసారిగా సెక్స్ కోసం మానసికంగా కూడా prepare అయ్యాను. నువ్వు నన్ను ఎలా అనుకున్నా , ఈ రాత్రి తర్వాత మనం మళ్ళీ ఎప్పటికీ కలవం. మన మధ్య ఎలాంటి రిలేషన్ ఉన్నా, అది ఈ రాత్రి తో ఎండ్ అవుతుంది . “ స్థిరంగా చెప్పింది

Now decision is in my hands. నా చేతిలో గ్లాస్ ఖాళీ అయ్యింది, let me fix another peg.

*

చిత్రరచన: రాజు

Download PDF

17 Comments

 • Lakshmi says:

  Bavundi,chala realistic gaa undi,India ni chusthunte westernisation ki oka adugu dooram lone unnam anipisthundi Daaniki proof ee katha lo Lanti jeevithlu chala common ayipovatame.

  • mohan.ravipati says:

   thanq లక్ష్మీ గారు కాలాన్ని బట్టి మనుషులు మారటం సహజం, దాని కనుగుణంగా కల్చర్స్ లో మార్పులు రావటం కూడా సహజం,

 • raju epuri says:

  మోహన్ గారు మీ కథ చాల బాగుంది.
  మీకథకు సరిపడా బొమ్మ వేసాను అని అనుకుంటున్నా?

  • mohan.ravipati says:

   థాంక్యూ రాజు గారు, మీ బొమ్మ ద్వారా నేను చెప్పాలి అనుకున్న విషయం మరింత ఈజీ గా అర్ధం అయ్యేలా చేశారు, థాంక్యూ

 • Sadlapalle Chidambara Reddy says:

  నిజం చెప్పాలటే నేను చాలా పాతకాలం వాడ్ని.రెండునెలల్నుండి కుస్తీపట్టి ఇంటర్నెట్ ఓపన్ చేయడం,పొస్ట్చేయడ,ఫోటోలుపెట్టడం కొంతగానేర్చి-గతంలో ఒకసారి మా అబ్బాయితెరిచి నప్పుడుఒకకవిత చదివి నట్లు గుర్తు-ఈరోజు “నో రిగ్రెట్స్” కథ చదివాను.భావ వ్యక్తీకరణలో,జీవన విధానంలో,చాలా మార్పులు వచ్చాయి.ఇదో ప్రవాహం.ఏగట్లను వొరుస్తుందో,ఎక్కడ ఏమలుపుతిరుగుతుందో ఓపికున్నంతవరకూ చూడాల్సిందే.

 • prasanthi says:

  మోహన్ గారు,

  కధ బావుందండి. మీ కధ చదువుతుంటే ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారని అనిపిస్తుంది. ఈలాంటి కధే ఒక గ్రామం లో కూడా చూసాను నేను.

  • mohan.ravipati says:

   ప్రశాంతి గారు, thanq అండి మీరు చెప్తుంది ఒక గ్రామం సినిమా గురించా !

 • Sai Padma says:

  బావుంది మోహన్ గారూ .. ఇప్పటి రిగ్రేట్ లేని రిలేషన్ల లా ..! లేదా రిగ్రేట్ అవటానికి టైం లేని మనుషుల్లా

  • mohan.ravipati says:

   మీరన్నదే నిజం సాయి పద్మ గారు, ఇప్పటి రోజుల్లో రిగ్రేట్ కి మనుషులకు టైమ్ ఉండటం లేదు

 • sunita gedela says:

  చాలా బాగుంది. నేటి సొసైటీ ని ఈ కధ రిప్రజెంట్ చేస్తుంది. అటాచ్డ్ పిక్ కూడా కధకు కరెక్ట్గా మేచ్ అయింది. సమాజం ఒప్పుకోలేని నిజాలు మీరు చెప్పినవన్నీ. కానీ మనం జీర్ణించుకోలేము. చాలా అద్భుతంగా ఒప్పుకునే విధం గా రాసారు.

  • mohan.ravipati says:

   కొన్ని నిజాలు మనం ఒప్పుకోవటానికి ఇష్టపడము సునీత గారు, కానీ అవి కూడా సమాజంలో సహజంగానే జరుగుతూ ఉంటాయి, అలాంటిది ఒకటి చెప్పాలి అని నా ప్రయత్నం

 • siva kishore says:

  హాయ్ వంశి మోహన్ …. ఈలా ఎప్పటినుంచి కధలు వ్రాస్తున్న్నావ్… చాల బాగుంది…

 • Nandi Reddy says:

  సాధన పాత్రను మీరు నిజజీవితంలో చూసి కావచ్చు విని కావచ్చు ఊహించి కావచ్చు ఆమెపై ఎవరికీ చులకన భావన కలగకుండా చాలా సహజంగా ఎక్కువ విశ్లేషణలేకుండా కధా గమనంతో తనకు నచ్చిన విధంగా తాను జీవించే స్థిరవ్యక్తిత్వమున్న ఆధునిక యువతిగా సౄష్టించారు. ఇక్కడ ఏమాత్రం ఎక్కువ తక్కువ పదాలు వాడినా మీ ప్రధానపాత్ర చాలా చులకనకు గురి అవుతుంది.విభిన్నతకు చాలా జాగ్రత్తగా గౌరవస్థానమిచ్చారు.విశాలాత్వం నిండిన మనిషిగా కవిగా మీరు ఇక్కడ పాఠకుల్ని గెలిచారు.
  మిగిలిన పాత్రలు సహాయకపాత్రలే వాటిని అంతవరకే కధకి నష్టం లేకుండా సాధన పక్కన చిన్నగీతలుగా మలిచారు.బాగుంది.
  కధలో వైవిధ్యం ఏమీ లేదు ఈలాటి కధలు గుర్తు లేవు కాని చాలా చదివాను.
  నా జీవితంలో నేను ప్రేమించిన ఏకైక వ్యక్తివి నువ్వు. “ఈ రాత్రి తర్వాత మనం మళ్ళీ ఎప్పటికీ కలవం. మన మధ్య ఎలాంటి రిలేషన్ ఉన్నా, అది ఈ రాత్రి తో ఎండ్ అవుతుంది ” అని సాధన అనటానికి కారణాలు ఏంటి? మీరు ఆమెను వ్యక్తిగత ప్రశ్నలు ఆడగటమేనా? కానీ మీ సాధన అలాటి చిన్నవిషయానికి అంతటి పెద్ద నిర్ణయాలు తీసుకోదు కదా? ముగింపులో పాఠకులను అనిశ్చితస్థితిలో వదిలేయటం కధ ఎత్తుగడ అని సరిపుచ్చుకోమంటారా?
  కధగా అయితే సాధన చేసే ప్రతి చర్యను విమర్శించాలి.నిజజీవితంలోని వ్యక్తి అయితే తన విషయంలో మన అభిప్రాయము ఎందుకు అని తన స్థానంలో ఉంటే అలాగే చేస్తారేమో అని పక్కకు తప్పుకోవాలి.–నందిని రెడ్డి.

 • Nandi Reddy says:

  కధ ఆఫకుండా చదివించింది.కధకునిగా మీరు సఫలమయ్యారు.మీకు చెప్పేటంతటి దానను కానీ సాధనలానే కధకూడా సగటి పాఠకులకి connect అవదు. ఇక్కడ కధావస్తువు కారణం
  Wishing more and stories from you. All the బెస్ట్ _
  Mohan gaaru.

 • Kameswari Chengalvala says:

  చాలా నిజం హిపోక్రసీ లేకుండా ఒప్పుకునే పరిణతిఉన్న కధ మోహన్ గారికి అభినందనలు
  సాధన చదువు సంస్కారం హోదా సంపద అన్ని ఉన్న మానసిక పరిపక్వత గల స్త్రీ అందుకే తనకేమి కావాలో ఎవరికేది కావాలో చెప్పగల సర్వ స్వతంత్రురాలు పవిత్థత అంటగట్టి ఉదాత్తత గల స్త్రీ కన్నా ఇప్పటి రోజుల్లో స్త్రీలు ఇలాగ ఉంటేనే సుఖపడతారు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)