తరంగ

పేరు తెలియని పిల్లవాడు

పేరు తెలియని పిల్లవాడు

  యవ్వనం పొద్దుతిరుగుడు పువ్వులా విచ్చుకొని తలవాల్చింది ముసలితనమేలేని మనసు విహరిస్తోంది ఆకాశంలో అందని ఇంద్రధనుస్సు అందుకునేందుకు తొలియవ్వన కాంతి మేనిపై తళతళలాడేవేళ ఎందుకు సెలఏరులా తుళ్ళిపడతావో పురివిప్పిన నెమలిలా పరవశంతో నర్తిస్తావో…

Read More
జస్ట్ ఫర్ యూ..

జస్ట్ ఫర్ యూ..

అక్షరాల్లేని కవిత కోసం అర్థాల్లేని పదాల కోసం పదాల్లేని భావాల కోసం వర్ణాల్లేని చిత్రాల కోసం రాగతాళలయరహితమైన సంగీతం కోసం పట్టాల్లేని రైలు కోసం నగరాల్లేని నాగరికత కోసం ఆఫీసుల్లేని ఉద్యోగాల కోసం…

Read More
ఒక హుషారు పూట

ఒక హుషారు పూట

  పసి పువ్వు పసి పువ్వూ తడుముకున్నట్లు ,మూడు నెలల పాపాయి పాల బుగ్గల మీద మూడేళ్ళ చిన్నారి చిరు ముద్దు- విలోమ సౌందర్యం కుప్పేసినట్లు ,నల్లటి నేల మీద రాలిన తెల్లటి…

Read More
ఉహూ ….కారణాలేమయినా ?

ఉహూ ….కారణాలేమయినా ?

జిందగీ మౌత్ నా బన్ జాయే సంభాలో యారో : శరత్కాలం ఆకుల్లా కలలన్ని రాలిపడుతున్నపుడు జ్ఞాపకాల వంతెన పగుళ్ళు పాదాలని సుతిమెత్తగానే అయినా కోస్తూ ఉంటే గుండె మంటలను చల్లార్చే మేజిక్…

Read More
నదీమూలంలాంటి ఆ యిల్లు!

నదీమూలంలాంటి ఆ యిల్లు!

  చాలాచోట్లకు చాలా సందర్భాల్లో , అసందర్భాల్లో వెళ్ళలేకపోయాను వెళ్ళినందువలన ,వెళ్ళలేకపోయినందున అంతే ;అంతేలేని ,చింతే వీడని జ్ఞాపకంఊళ్ళో ఇప్పుడెవరూ లేరు వృద్ధాప్యంలో ఉన్న యిల్లు తప్పఇల్లంటే చిన్నప్పటినుంచీ నాలోనే నిద్రిస్తున్న ద్వారబంధం;…

Read More
అవ్యక్తం

అవ్యక్తం

1  ఎదురుచూస్తునే వుంటాం మనం, కళ్లువిప్పార్చుకొని, ఇంకొన్ని ఆశలు కూర్చుకొని, ఆ చివరాఖరి చూపులు మళ్లీ తెరుచుకోకుండా, మూసుకొనేదాకా.   2 ఎన్ని కష్టాలు తలలకెత్తుకొని తిరుగాడిన దుఃఖాలనుంచి విముక్తినొందే సమయాలను మళ్లీమళ్లీ…

Read More
రాలిపోయిన కాలం

రాలిపోయిన కాలం

మిగిలిపోయిన గాయాల గురించి బెంగలేదు పగుళ్లిచ్చిన కలల గురించి పశ్చాత్తాపం లేదు ముళ్లను కౌగిలించుకోబట్టే పాఠాలు బోధపడ్డాయి కళ్లు నులుముకున్న ప్రతిసారీ నిప్పులకుంపట్లు బయటకు దూకేవి అధ్యాయాల్ని ఔపోసన పట్టడానికి తెల్లవారుజాముల్లో ఎన్నెన్ని…

Read More
బువ్వగాడు

బువ్వగాడు

“ఒలేయ్ ఆడికి అన్నమెట్టు” అన్నప్పుడల్లా నాకు ఆకలేయదేందుకు ? అన్నమంటే అమ్మా, నాన్నే అనిపిస్తుందెందుకు! ఒరేయ్ బువ్వగా ఇంతకుముందెప్పుడో ఇలాగే  అన్నం తింటన్నప్పుడు రొయ్యల సెరువు కోసం ఇసకలంకని ఎవరికో ఇచ్చేసారని కంచంలో…

Read More
గ్రావిటీ

గ్రావిటీ

  1 భూమి నుదుట తడిముద్దు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా ఇంకిన చినుకు ఎదో ఓ రోజు ఊటనీరై ఉవ్వెత్తున ఉబుకుతుంది.   2 తల్లికొమ్మలోంచి తలపైకెత్తి కరుగుతున్న కాలాలన్నీటినీ ఒడిసిపట్టిన ఆకు…

Read More
పాత ఇల్లు …

పాత ఇల్లు …

ఆ పాత ఇల్లు ఇప్పుడొక జ్ఞాపకం ఆ పాత ఇల్లు ఒక జీవితం చరమాంకం కోసం తెరలు దించుకొని సిద్ధంగా ఉన్న రంగస్థలి ఒక జడివాన తరువాత చూరునుండి జారే ఆఖరి చినుకు…

Read More
రాదారి ఆవల

రాదారి ఆవల

వాక్యమేదీ కూర్చబడక చర్మపు రహదారి గుండా ఓ నెత్తుటి దారమేదో అల్లబడుతూ ఒకింత బాధ సున్నితంగా గాయమ్మీద మైనపు పూతలా పూయబడుతూ రాలుతున్న పూరెక్కలను కూర్చుకుంటూ ఒడిలోకి తీసుకున్న తల్లి తన నెత్తుటి…

Read More
అరచేతిలో తెల్లకాగితం

అరచేతిలో తెల్లకాగితం

ఉత్తరం చేతివేళ్ళమధ్యలో మెత్తని అడుగులతో  ఊపిరివేడిని మొసుకొచ్చి విప్పి చూడమని అడుగుతోంది అలసిపో్యిన కనుల నలుపుచారలు దాటిన బిందువులు అక్షరాలని తడిచేసి చెదురుమదురు చేసాయి ఆశ్రమ పాకలో చీకటినిర్మించుకున్నప్పుడు సవ్వడిలేని నిద్ర ధ్యాననిమగ్నతలో…

Read More
పాటల  సముద్రం

పాటల సముద్రం

1 తీరం పరుపు అలలు తలగడ వెన్నెల దుప్పటి ఒడ్డున పడుకుని పదాల రేణువులతో చెలిమి చేస్తూ 2 పురా వేదనల్నీ అసమ్మతి ఆత్మనీ ఉపశమించడానికి పాట తప్ప మార్గమేముంది? 3 బధ్ధకపు…

Read More
చీకటి దారి నడకలో…

చీకటి దారి నడకలో…

జేబులో కొన్ని వెలుతురులు- *** కలలో నడకలా దారంతా చీకటి- గాఢత నిండిన గాలీ భయపెడ్తూ చెవులు కొరికేస్తూ- నిశ్శబ్దంలో మరో నిశ్శభ్దాన్ని మోస్తూ- సాగే కాళ్ళూ ఆగేంత కలవరం- దూరం తగ్గకా…

Read More
అలల చేతివేళ్లతో..

అలల చేతివేళ్లతో..

అలలా కదులుతున్న ఆ చేతివేళ్ల నైపుణ్యం ముందు.. ఆకాశం చిన్నబోతుంది ఆకాశాన్ని అల్లి లోకం మీద పరిచిన సృజనకారుడెవరో.. ఆకాశమొక పిట్టగూడు ఏ పురాతన ఆదిమజాతి మానవుడో శరీరమ్మీద ఆచ్ఛాదన లేని దశలో…

Read More
ఒక్కసారిగా ఎంత వెన్నెల!

ఒక్కసారిగా ఎంత వెన్నెల!

      చీకటి…చీకటి… మండుటెండలో సైతం మనసు ఖాళీల్లో నిండిపోయిన చీకటి. పొద్దు వాలినా ఒక తేడా తెలీని తనంలోంచి నిర్నిద్రతో క్షణాలన్నీ నిస్సహాయంగా మండిపోయాక నిరాశగా పడున్న చందమామ పుస్తకంలోంచి ఏ…

Read More
పుట్టగొడుగు మడి

పుట్టగొడుగు మడి

నుదుటి మీదకొక తెల్ల వెంట్రుక చికాగ్గా- పండుటాకు కొమ్మను ఒరుసుకుంటున్నట్లు- శిశిరం మొదటిసారి నిర్దయగా తలుపు విరుచుకు పడుతున్నట్లు నాలో ఎక్కడో పెళపెళా కొమ్మలు విరిగిపోతున్న చప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త…

Read More
వ్యక్తిగతం

వ్యక్తిగతం

  తాడు మీద నడిచే విన్యాసపు మోళీ పిల్లలా కట్టగట్టి గుంపులో నిలబెట్టదు. పిల్ల మదిలో గూడు కట్టుకున్న దిగులు  మాత్రమే  అనిపిస్తుంది. ఆకాశం పైకెక్కి కనివిందు చేసే ఇంద్రధనుస్సు సోయగంలా కట్టిపడెయ్యదు….

Read More
అర్ధాంతరంగా….

అర్ధాంతరంగా….

నిలువెత్తు మనిషి ఎదుట నిలబడితే నువ్వేనా, ఆ నాటి నువ్వేనా నవ్వేనా అప్పటి పారిజాత పువ్వేనా అని ఆపాదమస్తకం శోధించే చూపులు ఒక్క కుదుపుకు పూలు జలజలా రాలినట్టు వేనవేల జ్ఞాపకాల పరిమళాలు…

Read More
స్వర్గాల చీకటి మీద..

స్వర్గాల చీకటి మీద..

1 ఎవరిదైతేనేం? జాగ్రత్తలేని ఊహల్లోంచి జారిపడ్డ రాత్రికి గుర్తు. నీలాగా,నాలాగ ఒక పసిప్రాణం. చూస్తూ చూస్తూ ఎలా చంపమంటావ్? 2 తెలిసిందా? రాత్రులు నువుమోసిన స్వర్గాలన్నీ భారంగా తేలిపోయే నల్లమబ్బులు. నిజమైన స్వర్గం…

Read More
చీకట్లోంచి రాత్రిలోకి…

చీకట్లోంచి రాత్రిలోకి…

ఎంతసేపని ఇలా పడిపోతూనే ఉండడం? పాదాలు తెగిపడి పరవశంగా ఎంతసేపని ఇలా జలపాత శకలంలా లేనితనంలోకి దిగబడిపోతూనే ఉండడం? రాలిన కనుగుడ్ల నడుమ కాలిన దృశ్యంలా ఎంతసేపని ఇలా నుసిలా రాలిపోతూ ఉండడం?…

Read More
Frozen సరోవరం!

Frozen సరోవరం!

    అతని రాత్రుల్ని సాంప్రదాయ రాక్షసి మింగేసింది- అందం చేసే నఖక్షతాల నాజూకు బాధల్లో మూర్ఛిల్లాలనే కోరిక లేత యవ్వన తుఫాను ఉధృతిలో నిలువ లేక గింగిరాలు కొట్టాడు- నిటారుగా నిలిచిన…

Read More
ఇంద్రధనుసుపై ఎగిరిన సీతాకోక ఒకటి

ఇంద్రధనుసుపై ఎగిరిన సీతాకోక ఒకటి

    ఒక పరిమళమేదో అపుడపుడూ అల్లుకుంటుంది పరిమళమే కాదు … పరిమళాన్ని పంచిన పూల చాటు ముళ్ళ గాయాలు  కూడా   ఒక ఉత్సవ గీతమేదో వెంటాడుతుంది  అపుడపుడూ ఉత్సవగీతమే  కాదు…

Read More
చత్తిరి

చత్తిరి

అత్త అస్మాన్ కోడలు జమీన్ ఆషాడంల అత్తకోడండ్లు మొఖాలు మొఖాలు సూస్కో వద్దంటరు గనీ ,గీ ఆషాడo లనే గమ్మత్తి జర్గుతది గదా జేష్టం  దాక అస్మాన్ అంతా మండిపోతది జమీన్ ని…

Read More
త్రిపదులు

త్రిపదులు

1. ఎడారిలో వాన కవిత్వం …………. 2. నొసట మంట పెదవి నవ్వు శివుడు కాదు – మనిషే! ……………. 3. ఒక జీవిత దూరం ప్రయాణం గమ్యం రాలేదు ………………….. 4….

Read More
బేషరం వద్ద  ఓ జవాబు ఉండదు

బేషరం వద్ద ఓ జవాబు ఉండదు

1. అనుమతి లేకుండా ఎందుకలా చూస్తున్నావ్ అని జాబిల్లి  అడిగితే ఏం జవాబు చెప్పాలో తెలీదు . కాలిపోతున్న దీపపు వత్తి కాంతి లో చెవికమ్మల్ని చూసి తృప్తిగా నిదురపోయే బేషరం ని…

Read More
నీల్ కమల్

నీల్ కమల్

సముద్రమూ ఆకాశమూ డెనిమ్! వర్ణాంధుడైనా కాంచగలడు. రిధమ్ బ్లూస్: పిచ్చిస్వేచ్ఛగా ఎగురుకుంటూ-దే వోంట్ రియలీ కేర్ ఎబౌట్ అజ్ అని మైకేలు జాక్సనుడు బ్లూజీన్స్ వేసుకునేకదా ఎలుగెత్తి పాడాడు. ఆకాశాన్ని అంటినట్టు. సముద్రంలో…

Read More
Divine Tragedy

Divine Tragedy

KS స్పోర్ట్స్ ఎక్స్ ట్రా డాట్స్, విస్పర్ అల్ట్రా క్లీన్ ఐదు పాల పాకెట్లు, రెండు రేజర్లూ పార్క్ అవెన్యూనో మైసూర్ సాండలో వైల్డ్ ఫాంటసీ వాసనా ఓ బియ్యం బస్తా కిలో…

Read More
ఎన్నీల ఎలుగు

ఎన్నీల ఎలుగు

తెల్లని ఎన్నీల ఎలుగుల చల్లదనం వాకిట్ల గడన్చల ఎల్లెలుకల పండి తాత చెప్పిన శాత్రాలు ఇన్నందుకేమో కొంతైనా కైత్వాల అల్లకం అబ్బింది మక్కజొన్న కావలి కాడ ఎత్త్హైన మంచె మీన్నుంచి చూసిన గోరుకొయ్యల…

Read More
సాతానువాచ

సాతానువాచ

సందేహమెందుకు ? నిస్సంకోచంగానే స్వార్ధాన్ని ప్రేమించు స్వార్ధం నిషిద్ధ పదార్ధమేమి కాదు కదా సంశయిస్తున్నవా? పసిపిల్లలను చూడు… ఎంత స్వచ్ఛం గా స్వార్ధంగా సహజంగా సంతోషంగా వుంటారో స్వార్ధం శత్రువనే భ్రమలో బ్రతుకుతావెందుకు?…

Read More