Columns

ఏక్ ఫిలిం కా సుల్తాన్ (హీరో)

Untold Stories  ఈ టైటిల్ నేను అతనికి పెట్టలేదు.. అతనికి అతనే పెట్టుకోవడమేగాక, ‘ఆధ్యాత్మికంగా’ నవ్వి నాతో చెప్పాడు. “అదేమిటి?” అన్నాను. అతన్ని కలిసింది మౌంట్‌రోడ్డులో. ఒకప్పుడు ‘స్పెన్సర్శ్  ఉండే చోటికి దగ్గర్లో,…

Read More

ఒక నడి వయసు ప్రేమ కథ: లిజన్.. అమాయా!

చలం రాజేశ్వరి చేసిన ధైర్యం లిజన్ అమాయాలో లీలా చేస్తుందా? రాజేశ్వరికి లోకం ప్రేమ మయం! పిల్లల బంధాలు, బంధనాలు లేవ్! కాని  లీల అలాకాదు! షి ఈజ్ ఎ అర్బన్ లేడి!…

Read More

పిలవని పేరంటం

” ఏం చేస్తున్నావే ” అంటూ స్వతంత్రంగా  గది తలుపు తోసుకొచ్చారు  అత్తగారు .  ఆకాశం లోని ఇంద్రధనుస్సును ఒక్కలాగు లాగి భుజాలమీద వేసుకొచ్చేసినట్టూ ఆవిడ భుజాలనిండుగా రంగురంగుల చీరలు . “తులసిదళం…

Read More

కలలు కావాలి జీవితం దున్నడానికి…!

“కళ్ళు తుడుస్తాయి కమలాలు వికసిస్తాయి మెదిలితే చాలు నీ నామాక్షరాలు పెదవులమీద భ్రమరాల్లా”- కవిత్వాన్ని ఒక ఉత్సవంగా పాడుకునే గజల్ సంస్కృతిని అమితంగా ఆరాధించే గుంటూరు శేషేంద్ర శర్మ గారి వాక్యాల్లో ఆ…

Read More

ఒక తెలుగమ్మాయి ఇంగ్లీష్ నవల

ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా వున్నాయని పత్రికల్లో చదువుతాం. పత్రికల్లో వచ్చే అనేకానేక భీతావహమైన వార్తల్ని కూడా కాఫీతో పాటు సేవించే స్థితప్రజ్ఞత(జడత్వం?) అలవాటైంది కనుక, ఖాళీ కప్పుతోపాటు పత్రికని…

Read More

“పోయినోళ్ళు అందరూ…..అవును చాలా, చాలా మంచోళ్ళు….

మా తాత గారి, బామ్మ  గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, మా అమ్మ, మా బాబయ్య గారు (అంటే మా నాన్న గారు) అంతకు రెట్టింపు ఆప్యాయత, బాధ్యతలతో పంచిపెట్టిన “బంధు ప్రేమ”…

Read More

రాలిపోయిన వొక వాక్యం గురించి రెండు మాటలు …!

  ఆగస్టు 30 పొద్దున్న. వొక కవి చనిపోయిన రోజు మనసెలా  వుంటుంది? ఇప్పుడు నేను మాత్రం వాన నీళ్ళు భారంగా దేహంలోకి ఇంకుతున్న పొడి నేలలాగా వున్నాను. కొన్ని నల్ల మబ్బులు…

Read More

తోపుకాడ (In a Grove)

పరిచయం: రషోమన్ సినిమా గురించి  పాఠకులకు పరిచయం అవసరం లేదనుకుంటా. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి యాభై ఏళ్ళు దాటినప్పటికీ నేటికీ ప్రపంచ సినీ…

Read More

ప్రేమ ఒక బ్లాక్‌ హోల్‌!

ప్రేమ, పరాధీనత, బానిసత్వం ఈ మూడు పైకి వేరు, వేరు, భిన్నమయిన అంశాలుగా కనిపిస్తున్నప్పటికీ ఈ మూడింటి  అంతఃస్సారం ఒకటే! ప్రేమ పరాధీనతలోకి, పరాధీనత బానిసత్వంలోకి దారితీస్తుంది. మరో మాటలో చెప్పాలి అంటే…

Read More

ప్రపంచాన్ని చదివించిన ఆమె..!

చాలా సార్లు మనం పెద్దగా ఆలోచించం కాని, ఇది చాలా ముఖ్యమయిన ప్రశ్న! వొక రచన మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? లేదా వొక రచయితో, కవో మన అనుభవంలోకి ఎలా అడుగులు…

Read More

కల తెగిపోతే…అల ఆగిపోతే..అది సాహిర్ పాట!

“కహా హైన్? కహా హైన్? ముహాఫిజ్ ఖుదీకే….జిన్హే నాజ్ హై హింద్ పర్ ఓ కహా హైన్?” “తూ హిందు బనేగా న ముస్సల్మాన్ బనేగా..ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!”…

Read More

“ సబర్మతి “

 Untold Stories  – 5   మొన్నటి పేపర్లో అలనాటి నటీమణి ‘దేవిక’ కుమార్తె ‘కనక’ కేరళలోని ఒక హాస్పిటల్ వరండాలో దిక్కులేకుండా పడి వుంటే ఓ చిత్రప్రముఖుడు చూసి గుర్తించాడనీ, ఆమెకి…

Read More

పెళ్ళా? చేసుకుందాం, ఎప్పుడో .. ఏం తొందర?

పేరున్న సీనియర్ రచయిత్రి పి. సత్యవతిగారు 90లలో పెళ్ళి ప్రయాణం అని ఒక గొప్ప కథ రాశారు. రకరకాల మధ్య తరగతి మనస్తత్వాలని అద్భుతంగా ఆవిష్కరించారు ఆ కథలో. నాకు బాగా గుర్తున్న…

Read More

‘మాట’ కోసం దేశం దాటిన తస్లీమా!

2006 ఫిబ్రవరి 24న తస్లీమా  ఇంటివద్ద ఆమెతో చర్చిస్తున్న ఇన్నయ్య ‘శటానిక్ వర్సెస్’ రచయిత సల్మాన్ రష్డీ ఫత్వాలకు గురయి న్యూయార్క్ లో స్వేచ్ఛగా వుంటున్నారు.  ఆయనే ‘మహిళా సల్మాన్ రష్డీ’ అని…

Read More

“చదువుకున్న మూర్ఖుడు” – ఇంకెవరూ? ….

నా సాహిత్య” ప్రస్థానంలో” మా అన్నదమ్ములకీ, అప్పచెల్లెళ్ళకీ ఏ మాత్రం ప్రమేయం లేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను కానీ అది ఒక విధంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే, ముందుగానే చెప్పుకునేది నాది…

Read More

ఒక స్నేహ దీపం ఆరిపోయింది!

ప్రముఖ కథా రచయిత, గేయ రచయిత, సంగీతజ్ఞుడు గిడుగు రాజేశ్వర రావు గారు (1932-2013) హఠాత్తుగా కన్ను మూయడం ఆయన అభిమానులనందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. చివరి దాకా ఆయన పూర్తి ఆరోగ్యంగా, తాజాగా,ప్రసన్నంగా…

Read More

‘ తంతే బూరెల బుట్టలో ……’

నోములూ వ్రతాలూ, పెళ్ళిళ్ళూ పేరంటాలు లేకుండా   పొదుగుడు కోడిపెట్టల్లాగా  ఎవరింట్లో వాళ్ళు పడుండే  ఆషాఢ  మాసం అంటే అత్తగారికి అంత అభిమానం లేదు. అలా అని అలక్ష్యమూ లేదు . ” ఆషాఢం…

Read More

కళింగాంధ్ర వారసుడు

రెండు జీవిత దృశ్యాల మధ్య పోలిక చూడటం కవిత్వమైతే, వైరుధ్యాన్ని చూడటం కథగా రూపొందుతుంది. కొన్నిసార్లు దు:ఖమయంగానూ, కొన్నిసార్లు హాస్యాస్పదంగానూ ఉండే ఈ వైరుధ్యాల్ని చూసి మౌనంగా ఉండటం కష్టం. అనాదికాలం నుంచీ…

Read More

ఆలోచన లోపించిన ప్రతిమ కథ “కంకాళం”

2004 డిసెంబర్ “అరుణతార”లో వి.ప్రతిమ “కంకాళం” అనే కథ రాశారు. ఇది వుత్తమకథగా కూడా ఎన్నికైంది. మహిళలు రాస్తున్న కథలు అత్తగారి పెత్తనాల్తో, నడుము చూసి సొల్లు కార్చే మగాళ్లతో, పురుషాధిక్యత లాంటి…

Read More

ఛానెల్ 24/7- 16 వ భాగం

  ఆయనకు దక్షిణామూర్తిని చూడాలనిపించింది. అతన్ని భరించాలనిపించింది. ఆయన తప్పకుండా ఏదో ఒకటి అంటాడు. తన జీవితాన్ని విమర్శిస్తాడు. ఇది కూడదంటాడు. తను ఇంకెలాగో ఉండాలంటాడు. ఆయన తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తన…

Read More
అగరుపొగల వెచ్చలి

అగరుపొగల వెచ్చలి

  పసునూరు  శ్రీధర్ గారిలోని కవి “కొలనులోకి చేతులు జొనపకు పొద్దున్నే/అద్దం ముక్కలు గుచ్చుకుంటాయి” అని ఎవరో చెప్పగా విని మరో దారి లేక తన చుట్టూరా గాలిని వృత్తంగా తెగ్గోసి ఇక…

Read More

భద్రలోకపు అడ్డుగోడలు కూల్చేసిన గొరుసు!

‘వలసపక్షులు’ కథతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న కథకుడు గొరుసు జగదీశ్వర రెడ్డి. అతడి పాత కథల సంపుటి ‘గజ ఈతరాలు’ కొత్తగా చదవడం ఒక తాజా అనుభవం. ఆంధ్రదేశానికి ఆ మూలన ఉన్న…

Read More

‘ మరో వైపు’ చూద్దామా !

ఇటీవల వచ్చిన ఒక తెలుగు సినిమా లో  ‘చూడు ఒక వైపే చూడు’ అంటూ నందమూరి బాల కృష్ణ తన శత్రువును కండిషన్ చేస్తాడు. ఇవ్వాళ మన తెలుగు సమాజం కూడా అలాగే…

Read More

మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన ‘మల్లెల తీరం’!

చలం రచించిన ‘సావిత్రి’ లో సావిత్రి, సత్యవంతుడిని చూసి “మనస్సులు ఎప్పుడో కలిసాయి, మరణం ఒక్కటే మిగిలివుంది” అని అంటుంది. ఈ మాటల స్ఫూర్తితోనే“మల్లెలతీరంలో సిరిమల్లెపూవు” అనే సినిమా తీసాను అని ఒక…

Read More

త్రిపుర traits:ఒక జ్ఞాపకపు ఛాయ!

ఎవరైనా సమకాలీన రచయిత గొప్ప అక్షరంగా పరిచయమయ్యాక, నన్ను తరచి తవ్విపోశాక, చెప్పరాని చనువై మనసయ్యాక, ఆ రచయితని వ్యక్తిగతంగా కలవడానికి ఆరాటపడను. తీరా కలిస్తే- సిరా మరకలు కూడా అంటని కుదురైన…

Read More

కవితాత్విక కథ ‘వాంగ్మూలం’

నా స్నేహితురాలు ఒకరు ఒక సంఘటన గురించి చెప్పిన మాటలు తరచూ గుర్తుకొస్తూ ఉంటాయి. ఆమె, ఆమె స్నేహితుడూ సముద్రంలో మునుగుతున్నారంట. ఆనందమూ అలలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న వేళ, హఠాత్తుగా…

Read More

అందరి కుటుంబాలనీ ఆదుకోవడమే ఆయన జీవితాదర్శం….

1940 దశకంలో దొంతమ్మూరు గ్రామంలో (తూ.గో. జిల్లా కిర్లంపూడి దగ్గర గ్రామం) మా కామేశ్వర రావు మామయ్య గారు హఠాత్తుగా పోయారు. దానితో సుమారు 400 ఎకరాల మిరాశీ అనే పొలం వ్యవహారాలూ…

Read More

“అలసిన వేళనే చూడాలీ….”

  అలా నా జీవితం నువ్వుపప్పు జీడిలా తియ్యగా కమ్మగా సా…….గుతూ వుండగా ,  ఒక వెచ్చని సాయంత్రం  …… ‘ సోగ్గాడిపెళ్ళం’ అనే పతిభక్త సినిమానుంచీ ” కొండకోన పాలైన సీతమ్మ…

Read More

సీమాంధ్ర కత్తికి ఇంకెన్నాళ్లు ధారపడదాం ?

సీమాంధ్ర కవులు అభ్యుదయం, ప్రగతి, విప్లవం, వామపక్షం, ఇంకా పైకి కనపడని అనేక రూపాల్లో, హిడెన్‌ ఎజెండాలతో తెలంగాణపై తమ ఆధిపత్యాన్ని ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. ఇలా చలామణిలో పెట్టిన భావజాలం కారణంగానే…

Read More

అంత నిజాన్నీ ఇవ్వకు

 నేనడిగే ప్రశ్నలన్నిటినీ వినకు. అనుమానాల వంకతో బుకాయించే వీల్లేకుండా చేసే సమాధానాలు నీకు తెలిసినా చెప్పకు. ’నేనంటే నీకు అయిష్టం కదా? లోకంతో మననిలా కట్టిపడిసేది ఇంకా మిగిలున్న మన పాత్రల నటన…

Read More